ఈసీహెచ్‌ఎస్, ఇన్‌కాయిస్ లలో ఉద్యోగాలు | ECHS Secunderabad, INCOIS Hyderabad Recruitment 2021: Vacancies Details | Sakshi
Sakshi News home page

ఈసీహెచ్‌ఎస్, ఇన్‌కాయిస్ లలో ఉద్యోగాలు

Published Thu, Aug 26 2021 1:50 PM | Last Updated on Thu, Aug 26 2021 1:58 PM

ECHS Secunderabad, INCOIS Hyderabad Recruitment 2021: Vacancies Details - Sakshi

ఈసీహెచ్‌ఎస్, సికింద్రాబాద్‌లో 65 ఖాళీలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కంట్రిబ్యూటరీ హెల్త్‌ స్కీమ్‌(ఈసీహెచ్‌ఎస్‌)... ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (డిగ్రీతో ఏఓ కొలువు.. నెలకు రూ.60వేల వేతనం..)

► మొత్తం పోస్టుల సంఖ్య: 65
► పోస్టుల వివరాలు: గైనకాలజిస్ట్, మెడికల్‌ ఆఫీసర్, నర్సింగ్‌ అసిస్టెంట్, ల్యాబ్‌ టెక్నీషియన్, ఫార్మసిస్ట్‌ తదితరాలు.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎనిమిదో తరగతి, జీఎన్‌ఎం, డీఎంఎల్‌టీ, గ్రాడ్యుయేషన్, బీఎస్సీ, సంబంధిత స్పెషౖలñ జేషన్లలో ఎండీ/ఎంఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.

► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.16,800 నుంచి రూ.1,00,000 వరకు చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

► ఇంటర్వ్యూ తేదీలు: 2021 అక్టోబర్‌ 05 నుంచి 13 వరకు

► ఇంటర్వ్యూ వేదిక: హెడ్‌క్వార్టర్స్, తెలంగాణ, ఆంధ్రా సబ్‌ ఏరియా, సికింద్రాబాద్‌.

► దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఈసీహెచ్‌ఎస్‌ సెల్, బైసన్‌ యూఆర్‌సీ కాంప్లెక్స్, తిరుమలగిరి, సికింద్రాబాద్‌ –500015 చిరునామాకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 04.09.2021

► వెబ్‌సైట్‌: www.echs.gov.in


ఇన్‌కాయిస్, హైదరాబాద్‌లో 82 ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌లు

భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని ఇండియన్‌ నేషనల్‌సెంటర్‌ ఫర్‌ ఓషియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌(ఇన్‌కాయిస్‌).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (పీఎఫ్‌ఆర్‌డీఏ, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాలు)

► మొత్తం పోస్టుల సంఖ్య: 82

► పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌లు(1,2,3)–62, ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ (1,2)–20.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నైపుణ్యాలు ఉండాలి.

► వయసు: పోస్టుల్ని అనుసరించి 28ఏళ్ల నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి.

► వేతనం: నెలకు రూ.39,000 నుంచి రూ.78,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌(1,2,3) పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా; ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌(1,2) పోస్టులకు రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 22.09.2021

► వెబ్‌సైట్‌: www.incois.gov.in

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement