ఈ రోజుల్లో యువకులు వినూత్నంగా ఆలోచిస్తూ తమ బుర్రకు పదును పెడుతున్నారు. సరికొత్త ప్రయోగాలతో ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వేదికగా తమ ఆలోచనలను షేర్ చేస్తున్నారు. ఏదో ఒకరకంగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ విధంగానే ఓ యువకుడు సరికొత్త ఆలోచనతో తనకున్న పల్సర్ బైక్‌రూపాన్నే మార్చేశాడు. అదేంటో మీరే చూసేయ్యండి!
వాహనాలను కొత్తగా, కొద్దిగా చేర్పులతో సవరించేటువంటి వీడియోలను మీరు సోషల్ మీడియాలో ఇది వరకే చూసుంటారు. ఇది మాత్రం అందుకు భిన్నం. అది ట్రాక్టర్.. కాదు కాదు.. కారు. అసలే కాదు.. నాలుగు చక్రాల పల్సర్ బైకే! ప్రస్తుతం ఈ వీడియే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇటీవల ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా @kuldeepsinghrawat2లో పోస్ట్ అయ్యింది. దీని ప్రకారం పల్సర్ బక్‌కు రెండు చక్రాలైతే, దీనికి మాత్రం నాలుగు చక్రాలను అమర్చాడు ఆ కుర్రాడు. ఆ బైక్ రోడ్డుపై కారులా మారి రయ్ రయ్‌మంటూ.. దూకినప్పుడు ఆ దృశ్యం చూసి తీరాల్సిందే. బజాజ్ కంపెనీకి చెందిన పల్సర్ బైక్‌కి.. స్పోర్ట్స్ కారు లుక్ అందించాడు. ఇందులో విశేషం ఏంటంటే? నాలుగు చక్రాలను అమర‍్చడంతో.. కాలు కింద పెట్టకుండా బైక్ బ్యాలెన్స్ చెదిరిపోకుండా ఉండడమే. సూపర్ కదూ!
ఇవి చదవండి: క్రమంగా ఆన్‌లైన్ ఆటలకు అలవాటు పడ్డారో.. ప్రమాదమే!
Comments
Please login to add a commentAdd a comment