Amazing shock
-
Viral Video: అబ్బో! ఇది బైకే, కాదు కాదు... కారే! అదేంటో మీరే చూడండి!
ఈ రోజుల్లో యువకులు వినూత్నంగా ఆలోచిస్తూ తమ బుర్రకు పదును పెడుతున్నారు. సరికొత్త ప్రయోగాలతో ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వేదికగా తమ ఆలోచనలను షేర్ చేస్తున్నారు. ఏదో ఒకరకంగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ విధంగానే ఓ యువకుడు సరికొత్త ఆలోచనతో తనకున్న పల్సర్ బైక్రూపాన్నే మార్చేశాడు. అదేంటో మీరే చూసేయ్యండి!వాహనాలను కొత్తగా, కొద్దిగా చేర్పులతో సవరించేటువంటి వీడియోలను మీరు సోషల్ మీడియాలో ఇది వరకే చూసుంటారు. ఇది మాత్రం అందుకు భిన్నం. అది ట్రాక్టర్.. కాదు కాదు.. కారు. అసలే కాదు.. నాలుగు చక్రాల పల్సర్ బైకే! ప్రస్తుతం ఈ వీడియే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇటీవల ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ ఖాతా @kuldeepsinghrawat2లో పోస్ట్ అయ్యింది. దీని ప్రకారం పల్సర్ బక్కు రెండు చక్రాలైతే, దీనికి మాత్రం నాలుగు చక్రాలను అమర్చాడు ఆ కుర్రాడు. ఆ బైక్ రోడ్డుపై కారులా మారి రయ్ రయ్‌మంటూ.. దూకినప్పుడు ఆ దృశ్యం చూసి తీరాల్సిందే. బజాజ్ కంపెనీకి చెందిన పల్సర్ బైక్‌కి.. స్పోర్ట్స్ కారు లుక్ అందించాడు. ఇందులో విశేషం ఏంటంటే? నాలుగు చక్రాలను అమర్చడంతో.. కాలు కింద పెట్టకుండా బైక్ బ్యాలెన్స్ చెదిరిపోకుండా ఉండడమే. సూపర్ కదూ!ఇవి చదవండి: క్రమంగా ఆన్లైన్ ఆటలకు అలవాటు పడ్డారో.. ప్రమాదమే! -
కాదేదీ రికార్డుకనర్హం! కనుకే అగ్గిపుల్లలతో సరికొత్త రికార్డు..
'జీవితంలో ఎన్నో వింతలు, విశేషాలు తారసపడుతూంటాయి. కొందరి జీవతంలో వారే వింతగా ఏదేదో సాధిస్తూంటారు. అలా చేసేదాకా వారికి అదే ధ్యాసనో, లేక అదే ప్రపంచమో..! ఇలాగే డెన్మార్క్‌లోని ఓ వ్యక్తి చేసిన రికార్డును చూస్తే.. వ్హా అనక తప్పదు. ఇక ఆ రికార్డు ఏంటో తెలుసుకందాం.' ‘అగ్గిపుల్లా సబ్బుబిళ్లా కుక్కపిల్లా కాదేదీ కవితకనర్హం’ అన్నాడు శ్రీశ్రీ. పీటర్ వాన్ టాంగెన్ బుస్కోవ్ అనే ఈ డేనిష్ పెద్దమనిషి మాత్రం కాదేదీ రికార్డుకనర్హం అనుకుని, ఏకంగా అగ్గిపుల్లలతో రికార్డు సృష్టించాడు. రెండు ముక్కురంధ్రాల్లోనూ 68 అగ్గిపుల్లలను దట్టించుకుని, అత్యధిక సంఖ్యలో అగ్గిపుల్లలను ముక్కులో దట్టించుకున్న వ్యక్తిగా కొత్త రికార్డును నెలకొల్పాడు. డెన్మార్క్‌లోని ఒక వ్యాపార సంస్థలో పనిచేస్తున్న పీటర్, త్వరలోనే ఉపాధ్యాయ వృత్తిలోకి మారాలనుకుంటున్నాడు. తన చర్మానికి సాగే గుణం సాధారణం కంటే కొంత ఎక్కువని, అందువల్లనే సునాయాసంగా ఈ రికార్డును సాధించగలిగానని అతడు చెప్పాడు. ఇదివరకు ఒక వ్యక్తి ముక్కురంధ్రాల్లో 44 అగ్గిపుల్లలను దట్టించుకుని రికార్డు నెలకొల్పాడు. పీటర్ ఆ రికార్డును సునాయాసంగా అధిగమించడం విశేషం. ఇవి చదవండి: పరీక్షల పద్ధతిని ప్రవేశ పెటిందెవరో మీకు తెలుసా..! -
లాడ్ సోదరులకు అమేజింగ్ షాక్
అటవీ భూమిని ఆక్రమించుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు 47.24 ఎకరాల్లో రిసార్ట్ ఏర్పాటు కోర్టు ఆదేశాలతో వెలుగు చూసిన వాస్తవాలు భారీ బందోబస్తు మధ్య స్వాధీనం చేసుకున్న అధికారులు సాక్షి, బళ్లారి : అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల అక్రమాలు బహిర్గతమయ్యాయి. బళ్లారి సిటీ ఎమ్మెల్యే, గనుల యజమాని అనిల్‌లాడ్, కలఘటిగి ఎమ్మెల్యే సంతోష్‌లాడ్ కుటుంబసభ్యులు సండూరు - మురారీపుర మధ్య అటవీ భూమిని ఆక్రమించుకుని ఏర్పాటుచేసిన రిసార్ట్‌ను అధికారులు సీజ్ చేశారు. బళ్లారి జిల్లా సహాయ అటవీ సంరక్షణాధికారి బసవరాజప్ప నేతృత్వంలో భారీ బందోబస్తు మధ్య సండూరు శివారులోని అమేజింగ్ వ్యాలీ రిసార్ట్‌ను అధికారులు గురువారం ఉదయం చేరుకున్నారు. మొత్తం 47.24 ఎకరాల్లో రిసార్ట్ ఏర్పాటు చేసి నెలకు రూ. లక్షల్లోనే గడిస్తున్నట్లు గుర్తించారు. చుట్టూ సుందరమైన కొండలు, పక్కనే నది ఉన్న అటవీ భూమిలో రిసార్ట ఏర్పాటు చేసుకుని, అక్రమార్జనకు తెరలేపారన్న ఫిర్యాదులు అందడంతో విచారణకు లాడ్ సోదరులకు ‘అమేజింగ్’ షాక్ న్యాయస్థానం ఆదేశించింది. దీంతో వాస్తవాలు బహిర్గతమయ్యాయి. జూలై 30 లోపు రిసార్ట ఖాళీ చేయాలని అదే నెల 10న అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై అనిల్‌లాడ్ కుటుంబసభ్యులు స్పందించకపోవడంతో అధికారిక చర్యలు చేపట్టారు. రిసార్‌టకు చేరుకుని సీజ్ చేశారు. అక్కడ ఆదేశ పత్రాలు అతికించారు. అనిల్‌లాడ్ అన్న భార్య పేరుపై... అమేజింగ్ వ్యాలీ రిసార్ట అనిల్‌లాడ్ అన్న భార్య రజనీలాడ్ పేరుపై ఉంది. ఈ రిసార్‌టకు అనుకుని ఉన్న సర్వే నంబర్ 410లో 3.65 ఎకరాల భూమిని అప్పట్లో అనిల్ సోదరుడు అశోక్ లాడ్ కొనుగోలు చేశాడు. 1999-2000లో అప్పటి అసిస్టెంట్ కమిషనర్ నుంచి ఈ భూమిని వ్యవసాయేతర కార్యకలాపాలకు వినియోగించుకునేందుకు ఎన్ఓ కూడా పొందారు. అనంతరం ఆ భూమి పక్కనే ఉన్న 47.24 ఎకరాల భూమిని ఆక్రమించుకుని విలాసవంతమైన రిసార్ట నిర్మించారు. అశోక్‌లాడ్ మరణానంతరం ఆ రిసార్టను అతని భార్య రజనీ లాడ్ పేరిట బదిలీ చేయించారు. అటవీ భూమి చుట్టు పక్కల వంద మీటర్ల పరిధిలో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు లేకుండా చేశారు. నిబంధనలు అతిక్రమించి రిసార్ట నిర్మించారంటూ 2012లో హైకోర్టులో బెంగళూరుకు చెందిన ఆర్టీ కార్యకర్త శ్రీనివాస్.... పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అటవీ భూమిని ఖాళీ చేయించాలని ఆదేశించింది. అంతేగాకుండా ఈ కేసును అటవీ శాఖ కోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచించింది. ఆ మేరకు ముఖ్య అటవీ సంరక్షణ న్యాయాలయం జూలై 30లోగా రిసార్ట్‌ను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. స్వాధీన ప్రకియలో వలయ అటవీ అధికారి గణేష్, మంజునాథ్, భాస్కర్, సిబ్బంది పాల్గొనగా, వీరికి డీఎస్పీ పీడీ గజకోశ, సీఐ రమేష్ రావ్, ఎస్ఐ షన్ముఖప్ప, సిబ్బంది పాల్గొన్నారు.