'జీవితంలో ఎన్నో వింతలు, విశేషాలు తారసపడుతూంటాయి. కొందరి జీవతంలో వారే వింతగా ఏదేదో సాధిస్తూంటారు. అలా చేసేదాకా వారికి అదే ధ్యాసనో, లేక అదే ప్రపంచమో..! ఇలాగే డెన్మార్క్‌లోని ఓ వ‍్యక్తి చేసిన రికార్డును చూస్తే.. వ్హా అనక తప్పదు. ఇక ఆ రికార్డు ఏంటో తెలుసుకందాం.'
‘అగ్గిపుల్లా సబ్బుబిళ్లా కుక్కపిల్లా కాదేదీ కవితకనర్హం’ అన్నాడు శ్రీశ్రీ. పీటర్ వాన్ టాంగెన్ బుస్కోవ్ అనే ఈ డేనిష్ పెద్దమనిషి మాత్రం కాదేదీ రికార్డుకనర్హం అనుకుని, ఏకంగా అగ్గిపుల్లలతో రికార్డు సృష్టించాడు. రెండు ముక్కురంధ్రాల్లోనూ 68 అగ్గిపుల్లలను దట్టించుకుని, అత్యధిక సంఖ్యలో అగ్గిపుల్లలను ముక్కులో దట్టించుకున్న వ్యక్తిగా కొత్త రికార్డును నెలకొల్పాడు.
డెన్మార్క్‌లోని ఒక వ్యాపార సంస్థలో పనిచేస్తున్న పీటర్, త్వరలోనే ఉపాధ్యాయ వృత్తిలోకి మారాలనుకుంటున్నాడు. తన చర్మానికి సాగే గుణం సాధారణం కంటే కొంత ఎక్కువని, అందువల్లనే సునాయాసంగా ఈ రికార్డును సాధించగలిగానని అతడు చెప్పాడు. ఇదివరకు ఒక వ్యక్తి ముక్కురంధ్రాల్లో 44 అగ్గిపుల్లలను దట్టించుకుని రికార్డు నెలకొల్పాడు. పీటర్ ఆ రికార్డును సునాయాసంగా అధిగమించడం విశేషం.
ఇవి చదవండి: పరీక్షల పద్ధతిని ప్రవేశ పెటిందెవరో మీకు తెలుసా..!
Comments
Please login to add a commentAdd a comment