‘ఫాస్ట్ బీట్ వద్దు.. మెలోడీయే ముద్దు’ అంటూ ఓ కొత్త నినాదాన్ని అందుకున్నాడు చెచెన్యా అధ్యక్షుడు రమ్‌జాన్ కాదిరోవ్. ‘చెచెన్ సంగీతం చెచెన్ మనస్తత్వానికి అనుగుణంగానే ఉండేట్టు చూడండి’ అంటూ ఆ దేశపు సాంస్కృతిక శాఖ మంత్రి మూసా దాదయేవ్‌కి ఆదేశాలూ ఇచ్చాడు. విషయం ఏంటంటే.. చెచెన్యా బహిరంగ వేడుకలు, సంబరాల్లో ఫాస్ట్ బీట్ మ్యూజిక్‌ని రద్దుచేశారు.
ఇది కిందటి నెల నుంచే అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఆ దేశ సంప్రదాయ సంగీతం ఆధునిక పాశ్చాత్యా సంగీత బాణీలతో ప్రేరణ, స్ఫూర్తి చెందకుండా.. తమ కల్చర్‌కి తగ్గట్టే ఉండాలి. ప్రదర్శనల్లో పాటలకు, ఆ పాటల మీద డాన్స్‌లకు ప్రేక్షకులు వెర్రెత్తి ఊగినా.. ఈలలతో గోల చేసినా ఆ షోకి ఇక అంతే సంగతులు.
అప్పటికప్పుడు దాన్ని రద్దు చేస్తారు. అందుకే బీట్స్ మరీ స్పీడ్‌గా కాకుండా అలాగని మరీ స్లోగా కాకుండా నిమిషానికి 80 నుంచి 116 మధ్యలో ఉండాలని చెచెన్యా సర్కారు వారి ఆనతి. తమ దేశం మీద వెస్టర్న్ ఇన్‌ఫ్లుయెన్స్‌ని రూపుమాపడానికే ఈ చర్య కాకపోతే.. సంగీతానికి హద్దులు, నిషేధాలు ఏంటని అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు కొంతమంది గ్లోబల్ మ్యూజిక్ లవర్స్.
అయితే స్థానిక సంగీతకారులు మాత్రం.. ఈ రద్దును జూన్ నుంచి అమలు చేయాల్సిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నారట. రద్దుకు ముందే ఖరారై, అన్నిరకాలుగా ప్రిపేర్ కూడా అయిన మే నెలలోని తమ ప్రోగ్రామ్స్‌కి కొత్త ఉత్తర్వుల ప్రకారం తిరిగి మ్యూజిక్ నోట్స్ రాసుకోవడం.. రిహార్సల్స్.. రికార్డింగ్స్ ఎట్‌సెట్రాకు టైమ్ కావాలి కాబట్టి.. వాళ్లంతా ఆ రద్దును జూన్ వరకు వాయిదా వేయమని కోరుతున్నారు. సర్కారు మాత్రం సమస్యేలేదంటోందట.
ఇవి చదవండి: ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
Comments
Please login to add a commentAdd a comment