Fast Beat
-
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాశ్వతంగా రద్దే!
‘ఫాస్ట్ బీట్ వద్దు.. మెలోడీయే ముద్దు’ అంటూ ఓ కొత్త నినాదాన్ని అందుకున్నాడు చెచెన్యా అధ్యక్షుడు రమ్జాన్ కాదిరోవ్. ‘చెచెన్ సంగీతం చెచెన్ మనస్తత్వానికి అనుగుణంగానే ఉండేట్టు చూడండి’ అంటూ ఆ దేశపు సాంస్కృతిక శాఖ మంత్రి మూసా దాదయేవ్కి ఆదేశాలూ ఇచ్చాడు. విషయం ఏంటంటే.. చెచెన్యా బహిరంగ వేడుకలు, సంబరాల్లో ఫాస్ట్ బీట్ మ్యూజిక్‌ని రద్దుచేశారు.ఇది కిందటి నెల నుంచే అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఆ దేశ సంప్రదాయ సంగీతం ఆధునిక పాశ్చాత్యా సంగీత బాణీలతో ప్రేరణ, స్ఫూర్తి చెందకుండా.. తమ కల్చర్‌కి తగ్గట్టే ఉండాలి. ప్రదర్శనల్లో పాటలకు, ఆ పాటల మీద డాన్స్‌లకు ప్రేక్షకులు వెర్రెత్తి ఊగినా.. ఈలలతో గోల చేసినా ఆ షోకి ఇక అంతే సంగతులు.అప్పటికప్పుడు దాన్ని రద్దు చేస్తారు. అందుకే బీట్స్ మరీ స్పీడ్‌గా కాకుండా అలాగని మరీ స్లోగా కాకుండా నిమిషానికి 80 నుంచి 116 మధ్యలో ఉండాలని చెచెన్యా సర్కారు వారి ఆనతి. తమ దేశం మీద వెస్టర్న్ ఇన్‌ఫ్లుయెన్స్‌ని రూపుమాపడానికే ఈ చర్య కాకపోతే.. సంగీతానికి హద్దులు, నిషేధాలు ఏంటని అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు కొంతమంది గ్లోబల్ మ్యూజిక్ లవర్స్.అయితే స్థానిక సంగీతకారులు మాత్రం.. ఈ రద్దును జూన్ నుంచి అమలు చేయాల్సిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నారట. రద్దుకు ముందే ఖరారై, అన్నిరకాలుగా ప్రిపేర్ కూడా అయిన మే నెలలోని తమ ప్రోగ్రామ్స్‌కి కొత్త ఉత్తర్వుల ప్రకారం తిరిగి మ్యూజిక్ నోట్స్ రాసుకోవడం.. రిహార్సల్స్.. రికార్డింగ్స్ ఎట్సెట్రాకు టైమ్ కావాలి కాబట్టి.. వాళ్లంతా ఆ రద్దును జూన్ వరకు వాయిదా వేయమని కోరుతున్నారు. సర్కారు మాత్రం సమస్యేలేదంటోందట.ఇవి చదవండి: ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..! -
ఫాస్ట్ బీట్తో సాహిత్యం కనుమరుగు
ఇప్పటి ఫాస్ట్‌బీట్ పాటలతో సాహిత్యం కనుమరుగవుతోందని ప్రముఖ నేపథ్యగాయిని ఎస్పీ శైలజ పేర్కొన్నారు. అమలాపురం కామనగరువులోని ఆదిత్య పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవానికి శనివారం ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అప్పట్లో సాహిత్యానికి పెద్దపీట వేయడం వల్లే ఆనాటి పాటలు నేటికీ ప్రజాదరణ పొందుతున్నాయన్నారు. నేటితరం పాటల్లో సాహిత్యం, సంగీత విలువలు తగ్గిపోయాయన్నారు. మరిన్ని సంగతులు ఆమె మాటల్లోనే.. 1977లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రవర్తి ‘మార్పు’ సినిమాలో పాటపాడే అవకాశం ఇచ్చారు. నాలుగు భాషలలో దాదాపు 5వేలకు పైగా పాటలు పడాను. ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ గారి సూచన, కోరిక మేరకు సాగరసంగమం సినిమాలో నటించాను. అదే నా తొలి, ఆఖరి చిత్రం. నటనపై ఆసక్తిలేకే అవకాశాలు వచ్చినా నటించలేదు. కొన్ని సినిమాలకు మాత్రం డబ్బింగ్ చెప్పాను. క్లాసిక్‌లో సాగరసంగమంలో ‘వేదం అణువణువున నాదం’, మొండిమొగుడు పెంకి పెళ్లాం సినిమాలో ‘లాలూ దర్వాజ లస్కరు బోనాల్ పండుగకొస్తనని రాకపోతివి’ పాటలు నాకు బాగా గుర్తింపు తెచ్చాయి. మాది నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట. మా తల్లిదండ్రులు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతల. ఇద్దరు అన్నదమ్ములు, నలుగురు అక్కచెల్లెళ్లం. మా తల్లిదండ్రులు కూడా గాయకులే. అన్నయ్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి , నాకు ఆ వారసత్వమే వచ్చింది. నాకు గురువు అన్నయ్యే, గానంలో మెళకువలను ఆయననుంచే నేర్చుకున్నాను.స్వరం, శ్రుతి వస్తే ఎవరైనా పాటలు పాడవచ్చు. అలా సాధన చేస్తేనే మంచి గాయకులుగా రాణించవచ్చు.