Sports Car
-
ఆస్టన్ మార్టిన్ ఫస్ట్ హైబ్రిడ్ కారు 'వల్హల్లా' ఇదే (ఫోటోలు)
-
Viral Video: అబ్బో! ఇది బైకే, కాదు కాదు... కారే! అదేంటో మీరే చూడండి!
ఈ రోజుల్లో యువకులు వినూత్నంగా ఆలోచిస్తూ తమ బుర్రకు పదును పెడుతున్నారు. సరికొత్త ప్రయోగాలతో ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వేదికగా తమ ఆలోచనలను షేర్ చేస్తున్నారు. ఏదో ఒకరకంగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ విధంగానే ఓ యువకుడు సరికొత్త ఆలోచనతో తనకున్న పల్సర్ బైక్రూపాన్నే మార్చేశాడు. అదేంటో మీరే చూసేయ్యండి!వాహనాలను కొత్తగా, కొద్దిగా చేర్పులతో సవరించేటువంటి వీడియోలను మీరు సోషల్ మీడియాలో ఇది వరకే చూసుంటారు. ఇది మాత్రం అందుకు భిన్నం. అది ట్రాక్టర్.. కాదు కాదు.. కారు. అసలే కాదు.. నాలుగు చక్రాల పల్సర్ బైకే! ప్రస్తుతం ఈ వీడియే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇటీవల ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ ఖాతా @kuldeepsinghrawat2లో పోస్ట్ అయ్యింది. దీని ప్రకారం పల్సర్ బక్కు రెండు చక్రాలైతే, దీనికి మాత్రం నాలుగు చక్రాలను అమర్చాడు ఆ కుర్రాడు. ఆ బైక్ రోడ్డుపై కారులా మారి రయ్ రయ్‌మంటూ.. దూకినప్పుడు ఆ దృశ్యం చూసి తీరాల్సిందే. బజాజ్ కంపెనీకి చెందిన పల్సర్ బైక్‌కి.. స్పోర్ట్స్ కారు లుక్ అందించాడు. ఇందులో విశేషం ఏంటంటే? నాలుగు చక్రాలను అమర్చడంతో.. కాలు కింద పెట్టకుండా బైక్ బ్యాలెన్స్ చెదిరిపోకుండా ఉండడమే. సూపర్ కదూ!ఇవి చదవండి: క్రమంగా ఆన్లైన్ ఆటలకు అలవాటు పడ్డారో.. ప్రమాదమే! -
రూ.కోటి రూపాయాల కారుకు నిప్పు
రంగారెడ్డి: కొనుగోలు ముసుగులో స్పోర్ట్స్ కారుకు నిప్పంటించిన సంఘటన పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలో శనివారం సాయంత్రం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగికి చెందిన నీరజ్ అనే వ్యాపారి తన లంబోర్ఘిని కారు (డిఎల్ 09 సివి 3636) అమ్మాలని నిర్ణయించుకొని పరిచయస్తుడైన అయాన్‌కు చెప్పాడు. దీంతో కస్టమర్ ఉంటే చూడాలంటూ అయాన్ తన స్నేహితుడైన మొఘల్‌పురాకు చెందిన అమన్ హైదర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో కారు కొనేందుకు పార్టీ రెడీగా ఉందంటూ అమన్‌కు అతని మిత్రుడు అహ్మద్ తెలిపాడు. శనివారం సాయంత్రం 4 గంటలకు మామిడిపల్లిలోని ఫామ్‌హౌస్ వద్దకు కారు తీసుకురావాలని అహ్మద్ చెప్పడంతో, అయాన్ కారు తీసుకొచ్చి జల్పల్లి వద్ద అమన్‌కు ఇచ్చాడు. జల్పల్లి నుంచి అమన్ తన స్నేహితుడు హందాన్‌తో కలిసి కారు నడుపుకుంటూ అహ్మద్ చెప్పిన మామిడిపల్లి వివేకానంద చౌరస్తాను దాటి ఎయిర్పోర్ట్ రోడ్డు వైపు మళ్లి కారును ఆపారు. అనంతరం అహ్మద్, అతనితో పాటు మరికొంత మంది హోండా సిటీ, వ్యాగనార్ కార్లు, బైక్‌లపై అక్కడికి చేరుకున్నారు. నీరజ్ ఎక్కడ..? అతడు మాకు డబ్బులు ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరజ్‌ను పిలిపిస్తామని చెప్పినా వినకుండా అహ్మద్, అతని వెంట వచ్చిన వారు బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒక్కసారిగా లంబోర్గిని కారుపై పోసి నిప్పంటించారు. ఫైరింజన్ ఘటనా స్థలానికి చేరుకునేలోపే కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. మహేశ్వరం ఏసీపీ పి.లక్ష్మీకాంత రెడ్డి, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి, ఎస్సై మధుసూదన్ ఘటనా స్థలానికి చేరుకొని కారును పరిశీలించారు. అమన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కారు విలువ దాదాపు రూ.కోటి వరకు ఉండవచ్చని తెలిపారు. -
Hit And Run Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో స్పోర్ట్స్ కారు బీభత్సం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో మరో హిట్ అండ్ రన్ వెలుగులోకి వచ్చింది. ఇటీవల జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి వద్ద బైకును కారు ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన మరువకముందే మరో ఘటన కలకలం రేగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో వైట్ డెకో స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగాంగా వెళ్లి ఎదురుగా ఉన్న రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో అన్నాచెల్లితో పాటు మరో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మాదాపూర్‌లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కార్ నెంబర్ ఆధారంగా గుంటూరుకు చెందిన బిక్కి అశోక్‌గా పోలీస్ గుర్తించారు. గుంటూరు బయల్దేరిన జూబ్లీహిల్స్ పోలీస్ బృందం -
భారత్ మార్కెట్లోకి లోటస్ లగ్జరీ కార్లు
న్యూఢిల్లీ: బ్రిటన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల బ్రాండు లోటస్ తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. తొలుత ఎలక్ట్రిక్ ’ఎలెటర్ ఆర్’ ఎస్‌యూవీని ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇందులో మూడు వెర్షన్స్ ఉంటాయి. ధర రూ. 2.55 కోట్ల నుంచి రూ. 2.99 కోట్ల (దేశవ్యాప్తంగా ఎక్స్‌షోరూమ్) వరకు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 265 కి.మీ.గా ఉంటుంది. 2.95 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని (గంటకు) అందుకోగలదు. ఒకసారి చార్జి చేస్తే ఈ ఫైవ్–సీటరు వాహనంలో గరిష్టంగా 600 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది సంప్రదాయ ఇంధనాలతో నడిచే ఎమిరా స్పోర్ట్స్ కారును కూడా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ తెలిపింది. లోటస్ కార్స్‌కు భారత్‌లో అ«దీకృత సంస్థగా ఎక్స్‌క్లూజివ్ మోటర్స్ వ్యవహరిస్తుంది. లోటస్ కార్లు అధునాతన టెక్నాలజీతో అసమాన అనుభూతిని అందిస్తాయని ఎక్స్‌క్లూజివ్ మోటర్స్ ఎండీ సత్య బాగ్లా తెలిపారు. -
ఫెరారీ కారు ఇలా కూడా కొనేయొచ్చు! అక్కడ మాత్రమే..
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'ఫెరారీ' (Ferrari) తమ బ్రాండ్ కార్లను క్రిప్టోకరెన్సీ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని ప్రకటించింది. యూరోపియన్ దేశాలలోని సంపన్న కస్టమర్ల అభ్యర్థమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెరారీ పేర్కొంది. ఫెరారీ చీఫ్ మార్కెటింగ్ అండ్ కమర్షియల్ ఆఫీసర్ 'ఎన్రికో గల్లీరా' (Enrico Galliera) దీని గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో క్రిప్టోకరెన్సీ ద్వారా విక్రయాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. క్రిప్టోకరెన్సీ ద్వారా కార్లను కొనుగోలు చేస్తే ధరల్లో ఏమార్పు ఉండదని, ఎలాంటి అధిక ఫీజులు ఉండవని స్పష్టం చేశారు. ఫెరారీ ఈ క్రిప్టోకరెన్సీ ద్వారా ఎన్ని కార్లను విక్రయించనుంది? నిర్దిష్ట సంఖ్య (లిమిట్) ఏమైనా ఉందా? అనేదానికి సంబంధించిన అధికారికి వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. క్రిప్టోకరెన్సీ చెల్లింపుల ద్వారా విక్రయాలు ప్రారంభమైతే యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మార్కెట్లలో విక్రయాలు భారీగా పేరే సూచనలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇదీ చదవండి: ధనవంతుల జాబితాలో రైతు బిడ్డ - సంపద తెలిస్తే అవాక్కవుతారు! గతంలో బిట్‌కాయిన్ ద్వారా టెస్లా విక్రయాలు 2021లో టెస్లా కంపెనీ అధినేత 'ఎలాన్ మస్క్' (Elon Muck) బిట్‌కాయిన్ చెల్లింపుతో టెస్లా కార్లను కొనుగోలు చేయడానికి అవకాశం కల్పించాడు. కానీ కొన్ని కారణాల వల్ల అతి తక్కువ కాలంలోనే ఈ విధానానికి ముగింపు పలికేసాడు. అయితే ఇప్పుడు ఫెరారీ ఈ విధానానికి సుముఖత వ్యక్తం చేసింది. ఇది సజావుగా ముందుకు సాగుతుందా? ఏదైనా సమస్యలను ఎదుర్కుంటుందా? అనే వివరాలు భవిష్యత్తులో తెలుస్తాయి. -
లగ్జరీ ఫీచర్లతో ఆడి క్యూ3 స్పోర్ట్‌బ్యాక్: బుకింగ్స్ షురూ!
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి’ తన నూతన స్పోర్ట్‌బ్యాక్ కారు ‘ఆడిక్యూ3’ స్పోర్ట్‌బ్యాక్ బుకింగ్‌లను మంగళవారం ప్రారంభించింది. రూ.2 లక్షలతో బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 2.0లీటర్ల టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌తో ఈ కారు ఉంటుంది. మంచి పనితీరు, అద్భుతమైన డిజైన్‌తో రోజువారీ వినియోగానికి కారు కోరుకునే వారు ఆడిక్యూ3 స్పోర్ట్‌బ్యాక్‌ను ఎంతో ఇష్టపడతారని ఆడి ఇండియా హెడ్ బల్బీర్‌సింగ్ దిల్లాన్ పేర్కొన్నారు. 2022లో భారత్‌లో 27 శాతం మేర విక్రయాల వృద్ధిని నమోదు చేశామని, 2023లోనూ విక్రయాలు ఇదే విధంగా ఉండొచ్చన్నారు. -
వావ్..లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్‌కార్: హాట్ సేల్
న్యూఢిల్లీ: ఇటాలియన్ కార్ బ్రాండ్ లంబోర్ఘిని మరో సూపర్ కారును భారత మార్కెట్లో లాంచ్ చేసింది. లంబోర్ఘిని అవెంటడోర్ అల్టిమే పేరుతో లిమిటెడ్ ఎడిషన్ కార్‌ను తీసుకొచ్చింది. ప్యూర్ పెట్రోల్ వీ12 ఇంజన్‌తో ఈ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 600 యూనిట్లను మాత్రమే అందుబాటులో ఉంచింది. కూపే, రోడస్టర్ రెండు వేరియంట్లలో దీన్ని పరిచయం చేసింది. కూపే మోడల్లో 350, రోడ్‌స్టర్ బాడీ స్టైల్లో 250 యూనిట్లను విక్రయించనుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ లంబోర్ఘిని అవెంటడోర్ అల్టిమేపనితీరు-స్పెసిఫికేషన్లు... కొంత మార్పు చేసినప్పటికీ, అవెంటడార్ ఎస్వీజే, అవెంటడార్ ఎస్ మాదిరిగానే ఉండనున్నాయి. లంబోర్ఘిని అవెంటడార్ LP780-4 Ultimae ఫీచర్లు అత్యంత శక్తివంతమైన 6,498 సీసీ వీ12 ఇంజన్. ఇది 770bhp వద్ద 8,500ఆర్పీఎంను, 6,750 ఆర్పీఎం వద్ద 720 ఎన్ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. కొత్త స్టైలింగ్, కొత్త ఫ్రంట్ బంపర్, మాసివ్ సైడ్ స్కర్ట్లు, రియర్ డిఫ్యూజర్, 20- అంగుళాల అల్లాయ్ వీల్స్ 7- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, గరిష్టంగా గంటలకు 355 కిలోమీటర్ల వేగం లాంటి ఇతర ఫీచర్లు ఈ కారుసొంతం. అవెంటడార్ ఎస్ కంటే ఇది 25 కిలోల బరువు తక్కువ. అయితే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంచిన కార్లన్నీ ఇప్పటికే అమ్ముడు పోయాయట. ఇండియాలో ఒక్కరు మాత్రమే ఈ కారును సొంతం చేసుకున్నారు. అయితే ఈ కారు ధరను లంబోర్ఘిని వెల్లడించలేదు. -
నీటి మీదా.. నేల మీదా..
నీటికి ఆనుకోకుండా, కాస్త పైన అలా తేలుతూ దూసుకెళ్లే హోవర్‌క్రాఫ్ట్‌లు అందరికీ తెలిసినవే. కానీ నీటిపైనే కాదు నేలపైనా వేగంగా దూసుకుపోయే సరికొత్త స్పోర్ట్స్ హోవర్‌క్రాఫ్ట్ అరోసాను అమెరికాకు చెందిన వోన్మెర్సీర్ సంస్థ రూపొందించింది. అత్యాధునిక డిజైన్‌తో, యుద్ధ విమానాల్లాంటి సీటింగ్, పరికరాలతో దీనిని తయారుచేసింది. అరోసా నీటిపైనా, నేలపైనా సుమారు ఏడు అంగుళాల ఎత్తులో ఎగురుతూ.. గంటకు 100 కిలోమీటర్ల వరకు వేగంతో.. 200 కిలోమీటర్ల దూరం వరకు ప్రయణించగలదు. ఇందులో పెట్రోల్ జనరేటర్ నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌తో రోటార్ ఫ్యాన్లు తిరుగుతాయని.. ఈ తరహా ఎలక్ట్రిక్ హోవర్‌క్రాఫ్ట్ ప్రపంచంలోనే మొదటిదని కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాదే దీన్ని మార్కెట్లోకి తేనున్నట్టు తెలిపింది. ఇంతకీ దీని ధరెంతో చెప్పలేదు కదా.. జస్ట్ రూ.75 లక్షలేనట. -
లగ్జరీ కారు కొనుగోలు చేసిన నరేశ్
1972లో వచ్చిన 'పండంటి కాపురం' సినిమాతో నటుడిగా ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశాడు నరేశ్ విజయకృష్ణ. అప్పట్లో హీరోగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడీయన. తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితులైన ఈయన ఈ మధ్యే సకల సదుపాయాలు ఉండేలా ఓ కారవ్యాన్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. తాజాగా నరేశ్ ఓ ఖరీదైన స్పోర్ట్స్ కారును సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 'నా కల నెరవేరిందోచ్, ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను' అని పేర్కొంటూ తన కారును చూపించాడు. పర్పుల్ కలర్లో ఉన్న ఈ కారును డ్రైవ్ చేస్తూ నగర రోడ్లపై చక్కర్లు కొట్టి మురిసిపోయాడు నరేశ్. వెంటనే తన ప్రొఫైల్ పిక్ కూడా మార్చేశాడు. కారు పక్కన నిల్చున్న ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నాడు. ఇంత ఖరీదైన కారును కొన్న నటుడికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Hi sharing my new dream come true with my twitter family💕 pic.twitter.com/rnxev9r2Ts — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) February 2, 2022 #NewProfilePic pic.twitter.com/J0c2BDDxhf — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) February 2, 2022 -
హైదరాబాద్‌లో రేసింగ్.. కుర్ర‘కారు’.. హుషారు
రాయదుర్గం: ఐటీ కారిడార్‌లో రేసింగ్ కార్లు రయ్ రయ్‌మంటూ దూసుకెళ్లాయి. రెండు కార్లు ఐటీ కారిడార్ హైదరాబాద్ నాలెడ్జిసిటీ రోడ్డు నుంచి మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా రోడ్ నంబర్ 45 వరకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ నాలెడ్జి సిటీ రోడ్డు వరకు వచ్చాయి. వీటిని అనందిత్రెడ్డి, అఖిల్ రవీంద్ర నడిపారు. ఇవి గంటకు 250 కి.మీ వేగంతో ప్రయాణం చేస్తా యి. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు యువత ఆసక్తి కనబర్చారు. దేశంలో మోటార్ స్పోర్ట్స్‌కు మంచి అవకాశాలు ఉన్నాయని రేసింగ్ ప్రమోషన్స్ చైర్మన్ అఖిలేష్ రెడ్డి పేర్కొన్నారు. చదవండి: 3 కి.మీ. మోసుకెళ్లినా దక్కని గర్భిణి ప్రాణం రాయదుర్గం సర్వేనెంబర్ 83లోని హైదరాబాద్ నాలెడ్జి సిటీలో వరల్డ్ క్లాస్ ఎఫ్ఐఏ గ్రేడ్ స్ట్రీట్ సర్క్యూట్లో భాగంగా రెండు రేసింగ్ కార్లతో రేసింగ్ ట్రయల్ రన్ తరహా కార్యక్రమాన్ని సంస్థ ప్రతినిధులు రమా, సుధా, సులోచన్ జ్యోతి వెలిగించి ఆదివారం ప్రారంభించారు. మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డి, ఆర్పీపీఎల్ జాయింట్ ఎం.డీ. అర్మాన్ ఇబ్రహీం, ఆదిత్య పటేల్, ఆర్పీపీఎల్ ప్రతినిధి పీపీ రెడ్డి, నవజీత్ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: వైరల్ వీడియో: కన్నకొడుకు కంటే ఈ కుక్కే నయం..! -
Huyndai N Line: హ్యుందాయ్ నుంచి ఎన్ లైన్... కీలక అప్డేట్స్ ఇవే
ఆటోమోబైల్ మార్కెట్లో పట్టు పెంచుకునేందుకు హ్యుందాయ్ ఇండియా దూకుడు పెంచింది. యూత్‌తో మరింతగా కనెక్ట్ అయ్యేందుకు వీలుగా సరికొత్త లైన్లో వెహికల్స్‌ని లాంఛ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన కీలక అప్డేట్ని హ్యుందాయ్ వెల్లడించింది. ఎన్ సిరీస్ డైనమిజం, స్పోర్టీనెస్ థీమ్‌తో రెండేళ్ల కిందట అంతర్జాతీయ మార్కెట్లో ఎన్ లైన్ సిరీస్‌ను హ్యుందాయ్ ప్రవేశపెట్టింది, తాజాగా ఇప్పుడు ఇండియాకు ఎన్ లైన్ సిరీస్‌లో వెహికల్స్ తెస్తామంటూ ప్రకటించింది. ఐ20 ఎన్ ప్రస్తుతం హ్యుందాయ్‌లో పాపులర్ మోడల్‌గా ఉన ఐ20లో సెగ్మెంట్లో తొలి ఎన్ లైన్‌ను తేనన్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి, ప్రస్తుతం ఉన్న ఐ 20 కారుకి డిజైన్, ఇంజన్లో స్పోర్టీనెస్, డైనమిజానికి తగ్గట్టుగా మార్పులు చేసి మార్కెట్లోకి తేనున్నారు. ఈ ఏడాదిలోనే ఇట్స్ టైమ్ టూ ప్లే అంటూ ఎన్ లైన్ సిరీస్‌కి సంబంధించిన ప్రోమోను హ్యుందాయ్ విడుదల చేసింది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం దసరా, దీపావళి పండగల సమయానికి ఎన్సిరీస్ కారు ఇండియా మార్కెట్లో అందుబాటులో ఉండవచ్చని అంచనా మార్కెట్‌ను ఆకట్టుకునేలా ఇండియన్ కార్ల మార్కెట్లో హ్యుందాయ్‌కి గణనీయమైన వాటా ఉన్నప్పటికీ మార్కెట్ లీడర్ కాలేకపోయింది. అయితే ఎన్ లైన్ సిరీస్‌తో మార్కెట్లో తన పట్టు పెంచుకునే ఉద్దేశంలో హ్యుందాయ్ ఉంది. దీంతో డైనమిజం, స్టోర్టీనెస్ వంటి ఫీచర్లు జోడించినా మార్కెట్‌ను ఆకట్టుకునే విధంగా రూ. 11 నుంచి 13 లక్షల మధ్య ధర ఉండవచ్చని అంచనా. The globally popular #HyundaiNLine, is now coming to India. N Line range comes with motorsports inspired styling elements to compliment your aspirations. N Line is a statement of dynamism and sportiness. #ItsTimeToPlay!#NLineInIndia #ComingSoon — Hyundai India (@HyundaiIndia) August 9, 2021 -
రియల్ లైఫ్‌లో హీరోయిన్ సాహసం: రేసులో లెవల్ వన్
ఫార్ములా రేసింగ్ నేర్చుకుంటున్నారు హీరోయిన్ నివేదా పేతురాజ్. ఇది సినిమా కోసం కాదు. రియల్ లైఫ్‌లో తన కలను నిజం చేసుకోవడానికి రేసింగ్ నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ ఓ స్కూల్ నుంచి ‘ఫార్ములా రేసింగ్ లెవల్ 1 రేసర్’గా సర్టిఫికేట్ కూడా పొందారు. ఈ సందర్భంగా నివేదా మాట్లాడుతూ.. ‘‘స్కూల్ డేస్ నుంచే ఫార్ములా రేసింగ్ అంటే నాకు ఆసక్తి. నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మా బంధువుల్లో ఒకరు స్పోర్ట్స్ కారు కొన్నారు. దాంతో స్పోర్ట్స్ కార్లంటే మరింత ఇష్టం పెరిగింది. ఆ ఇష్టంతోనే 2015లో ఓ స్పోర్ట్స్ కారు కొన్నాను. యూఏఈలో అప్పట్లో డాడ్జ్ ఛాలెంజర్ కారు కొన్న రెండో మహిళను నేనే. ఈ కారు వి6 ఇంజిన్ ఫాస్ట్ రేసింగ్‌కు సంబంధించినది. కానీ నేను బాగానే డ్రైవ్ చేశాను. చెన్నై వచ్చాక కొన్ని మోటార్ ట్రాక్స్‌ను చూసి, ఈ ట్రాక్స్‌పై డ్రైవ్ చేయగలనా? అనిపించింది. ఆ తర్వాత కోయంబత్తూరులోని ఓ అడ్వాన్డ్స్ రేసింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నాను. లెవల్ వన్ కంప్లీట్ చేశాను. మన దేశంలో ఫార్ములా వన్, ఫార్ములా 2 ఛాంపియన్ షిష్స్ మహిళా పోటీలు లేవు. ఉంటే ప్రోత్సాహంగా ఉంటుందని నా అభిప్రాయం. అయినా రేస్‌లో పాల్గొన్న ప్రతిసారీ రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది. అందుకే ప్రస్తుతం రేసింగ్‌లోని నెక్ట్స్ లెవల్స్‌ను పూర్తి చేయడం పైనే దృష్టి పెట్టాను’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేటి నుంచీ కియా ‘సెల్టోస్’ బుకింగ్స్ ప్రారంభం
దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్.. భారత్‌లో తన తొలి స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్ ‘సెల్టోస్’ బుకింగ్స్‌ను మంగళవారం నుంచి ప్రారంభించనుంది. ఆన్‌లైన్‌తో పాటు దేశవ్యాప్తంగా 206 సేల్స్ పాయింట్ల వద్ద జూలై 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమైనట్లు సంస్థ ప్రకటించింది. బీఎస్–6 ప్రమాణాలతో రూపొందించిన ఈ కారు 1.5 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభ్యంకానుంది. -
బీభత్సం సృష్టించిన స్పోర్ట్స్ కారు
-
లంబార్గిని సూపర్ స్పోర్ట్స్ కారు లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : ఇటలీకి చెందిన సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లంబార్గిని అతి ఖరీదైన కారును భారతీయ మార్కెట్లో గురువారం లాంచ్ చేసింది. హరికేన్ ఎవో పేరుతో లాంచ్ చేసిన ఈ కారుకు రూ .3.73 కోట్లు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరగా నిర్ణయించింది. 2018 ఏడాదికి సూపర్ లగ్జరీ కార్ సెగ్మెంట్లో భారత్ తామే లీడర్స్‌గా ఉన్నామనీ, ఈ ఏడాదిలో కూడా తమ స్థానాన్ని మరింత పటిష్టపరుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లంబార్గిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ వెల్లడించారు. 5.2 లీటర్ ఇంజిన్, వీ10 పవర్, మల్టీ పాయింట్ ఇంజెక్షన్ + డీఎస్ఐ డీజిల్ గరిష్ట టార్క్ 640, సెవెన్ స్పీడ్ డ్యుయల్ క్లచ్ గేర్ బాక్స్, రియర్ వీల్ డ్రైవ్ సిస్టం, రియర్ మెకానికల్ సెల్ఫ్ లాకింగ్ ఫీచర్లతోపాటు కొత్తగా అడ్వాన్స్డ్ న్యూ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టంను జోడించింది. కాగా గత సంవత్సరం భారతదేశంలో 45 యూనిట్లు విక్రయించగా, 2017 లో 26 యూనిట్లు విక్రయించింది. ప్రపంచవ్యాప్తంగా లంబార్గిని గత సంవత్సరం 5,750 యూనిట్లు విక్రయించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2017 లో 1,000 యూనిట్ల నుంచి 1,301 యూనిట్లను సేల్ చేసింది. -
స్పోర్ట్స్ కార్ ప్రాజెక్ట్ ‘రేస్‌మో’కు ‘టాటా’
న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్’ గతేడాది మార్చిలో జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో కార్యక్రమంలో తన రేస్‌మో కారుతో చేసిన సందడి అంతాఇంతా కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ప్రదర్శనకు ఈ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలా మంది సందర్శకులను తన సీతాకోకచిలుక డోర్స్ డిజైన్‌తో కట్టిపడేసింది. కానీ ఇప్పుడు టాటా మోటార్స్ వారందరినీ షాక్‌కు గురిచేసింది. తన ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ కార్ ప్రాజెక్ట్ ‘రేస్‌మో’ను రద్దు చేసినట్లు ప్రకటించింది. టర్న్ అరౌండ్, వ్యయ నియంత్రణ వ్యూహాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘‘ప్రస్తుత సమయంలో పలు ప్రాజెక్టులకు ఆర్థికంగా అంత విలువ లేదని భావిస్తున్నాం. రేస్‌మో ప్రాజెక్ట్‌ను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు’’ అని టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్‌వో పి.బి.బాలాజీ తెలిపారు. రేస్‌మో ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే, ఆ ప్రతిపాదనను పరిశీలిస్తామని తెలిపారు. -
ఈ గాడిద ఎంతపని చేసిందో తెలుసా!
బెర్లిన్: ఖరీదైన తన స్పోర్ట్స్ కారును గాడిద పాడు చేసిందంటూ కారు యజమాని కోర్టును ఆశ్రయించాడు. ఇటీవల జరిగిన ఈ ఘటనపై జర్మన్‌లోని గిఎస్సెన్ రాష్ట్ర కోర్టులో కేసు దాఖలయింది. ఖరీదైన మెక్లారెన్ స్పోర్ట్స్ కారును పార్కు చేసి ఉంచగా ఓ గాడిద దాని వెనుక భాగాన్ని కొరకడంతో రంగు పోవటంతో పాటు సొట్టలు పడిందని కారు ఓనర్ ఫిర్యాదు చేశాడు. ఇందుకు గాను సదరు గాడిద యజమాని 5,876 అమెరికా డాలర్లు పరిహారంగా చెల్లించాలని పిటిషన్ వేశాడు. అయితే, గాడిద యజమాని మాత్రం ఇందుకు నిరాకరించాడు. అంత ఖరీదైన కారును అక్కడే ఎందుకు ఉంచాల్సి వచ్చిదంటూ అడ్డం తిరిగాడు. మరింత సురక్షితమైన ప్రాంతంలో పార్కు చేసుకోవాలని సూచించాడు. ఆ స్పోర్ట్స్ కారు ఆరంజ్ రంగులో ఉండటంతో క్యారెట్‌గా భావించి గాడిద కొరికి ఉంటుందని పోలీసులు అంటున్నారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి మరి. -
నేను.. అతడు.. ఆమె
ఈ వీకెండ్ సమంతకి ఎప్పటికీ గుర్తుండే మెమరబుల్ మూమెంట్ అనే చెప్పాలి. చల్లగాలిలో చెలికాడితో కలసి షికారుకి వెళ్లారు. అప్పుడు తీసిన ఫొటోల్ని ‘నేను, అతను మరియు ఆమె’ అని సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక్కడ ‘నేను’ అంటే సమంత. ‘అతడు’ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదూ... సమంత ప్రేమికుడు అక్కినేని నాగచైతన్యే! మరి, ‘ఆమె’ ఎవరు? అనుకుంటున్నారా! సూపర్‌ఫాస్ట్ స్పోర్ట్స్ కార్. నాగచైతన్యకి బైక్స్ అండ్ కార్స్ అంటే చాలా ఇష్టం. వీలు చిక్కినప్పుడు... కారులో షికారుకి వెళ్లడం చైతూకి అలవాటు. అంతకు ముందు సోలోగా రేసింగ్ కారులో రయ్ రయ్‌మంటూ చక్కర్లు కొట్టేవారు. ఇప్పుడు ప్రేమలో ఉన్నారు కదా! ప్రేయసి, త్వరలో కాబోయే శ్రీమతి సమంతతో కలసి శనివారం ఢిల్లీ శివార్లలోని రేసింగ్ సర్క్యూట్లో ఎంజాయ్ చేశారు. ఆ హ్యాపీ మూడ్‌లో ‘మా శ్రీమతి తీసిన ఫొటోలు’ అని నాగచైతన్య సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ లవ్‌బర్డ్స్ పెళ్లి చేసుకుని ఒకే గూటిలో ఉండే సమయం దగ్గర్లోనే ఉంది. -
ఈ కారు.. కిర్రాక్..
ఇది బుగాటీ ‘చిరాన్’.. దీని అత్యధిక వేగం గంటకు 420 కిలోమీటర్లు. 1,500 బీహెచ్పీ పవర్‌తో నడిచే ఈ కారు కేవలం 2.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందట. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, విలాసవంతమైన, వేగవంతమైన స్పోర్ట్స్ కార్ ఇదేనని బుగాటీ చెబుతోంది. దీని టాప్ స్పీడును తట్టుకోవడానికి టైర్లను ప్రత్యేకంగా తయారుచేయించారు. ఫార్ములావన్ కార్లలో వాడే బ్రేకింగ్ వ్యవస్థను ఇందులో ఉపయోగించారు. అత్యధిక వేగం అందుకోవడానికి కారులోనే టాప్‌స్పీడ్ కీ అని ఉంటుందట. అది వాడితేనే.. టాప్ స్పీడును అందుకుంటుంది. లేనిపక్షంలో దీని అత్యధిక వేగం గంటకు 379 కిలోమీటర్లు. పైగా.. ఇది లిమిటెడ్ ఎడిషన్ టైపు. 500 చిరాన్లను మాత్రమే తయారుచేస్తారు. ఇప్పటికే 180 కార్లకు అడ్వాన్స్ బుకింగ్ కూడా అయిపోయింది. దీని రేటు రూ.19 కోట్లు. -
ఈ ఏడాదే మార్కెట్లోకి ఫోర్డ్ ‘మస్టాంగ్’
న్యూఢిల్లీ: దాదాపు 50 ఏళ్లకుపైగా చరిత్ర... అమెరికాలో చక్కని జనాదరణ ఉన్న స్పోర్ట్స్ కారు ‘మస్టాంగ్’ భారతీయ రోడ్లపై పరిగెత్తడానికి సిద్ధమవుతోంది. అమెరికా దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ తాజాగా ఆరవ జనరేషన్ ‘మస్టాంగ్’ను గురువారం ఆవిష్కరించింది. దీన్ని ఈ ఏడాదే భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీ దీన్ని ఫిబ్రవరి నెలలో జరగనున్న ‘ఢిల్లీ ఆటో ఎక్స్పో-2016’లో ప్రదర్శించనుంది. అదిరిపోయే డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ‘మస్టాంగ్’ సొంతమని, స్టైల్, పనితీరు తదితర అంశాలకు ప్రాధాన్యమిచ్చే వారికి ఈ కారు కచ్చితంగా సరి పోతుందని ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ నిగెల్ హారిస్ తెలిపారు. కారు ప్రత్యేకతలు: ‘మస్టాంగ్’లో షార్ట్ రియర్ డెక్, లాంగ్ హుడ్, ఫ్రంట్ అండ్ రియర్ సస్పెన్షన్ సిస్టమ్, వాల్వ్ ట్రైన్ అండ్ సిలిండర్ హెడ్స్‌తో కూడిన 5.0 లీటర్ శక్తివంతమైన వీ8 ఇంజిన్, ఫోర్డ్ సింక్ టెక్నాలజీ ద్వారా డ్రైవర్ తన మాటలతో కారులోని ఎంటర్టైన్మెంట్ వ్యవస్థను కమాండ్ చేసే వెసులుబాటు, పుష్ బటన్ స్టార్ట్, నావిగేషన్, పవర్ ఫోల్డింగ్ మిర్రర్స్, రియర్ కెమెరా వంటి తదితర ప్రత్యేకతలు ఉంటాయని కంపెనీ తెలిపింది. 1964లో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు విక్రయాలు ఇప్పటి వరకు 90 లక్షల యూనిట్లకు చేరాయని పేర్కొంది. ‘మస్టాంగ్’ కారు ప్రస్తుతం ఫాస్ట్‌బ్యాక్, కన్వర్టబుల్ అనే రెండు మోడళ్లలో అంతర్జాతీయ మార్కెట్లో లభ్యమౌతోంది. భారత్‌లోకి ఫాస్ట్‌బ్యాక్ మోడల్ ముందుగా రానుంది. ధరను కంపెనీ ప్రకటించలేదు. రూ.50-60 లక్షల శ్రేణిలో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఉప్పునీటితో రయ్ రయ్...
ఈ స్పోర్ట్స్ కారు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది కదూ? కారే కాదు.. దీని ప్రత్యేకతలు మరింతగా మన మదిని దోచుకుంటాయి. సాధారణంగా స్పోర్ట్స్ కార్లు ఎక్కువ పెట్రోలు తాగుతాయి.. తక్కువ మైలేజీ ఇస్తాయి.. వెరసి నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతుంది. పైగా పర్యావరణానికి ఏమాత్రం అనుకూలంగా ఉండవు. కానీ ఈ కారు వాటన్నింటికీ భిన్నమైంది. దీని పేరు క్వాంట్-ఎ-స్పోర్ట్లైమోసిన్. పూర్తిగా పర్యావరణ అనుకూలమైనది. అంతేకాదు.. దీనికి పెట్రోలు, డీజిల్ లేదా గ్యాస్ ఏదీ అవసరం లేదు. మరి ఎలా నడుస్తుందా అని అనుకుంటున్నారా? ఉప్పునీటితో..! ఔను.. పెట్రోల్ బదులు ఉప్పునీరు పోస్తే చాలు.. రయ్ రయ్ మంటూ పరుగులు పెడుతుంది. దీని గరిష్టవేగం ఎంతో తెలుసా? గంటకు ఏకంగా 350 కిలోమీటర్లు. దాదాపు 2,300 కిలోల బరువున్న ఈ కారు.. సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.8 సెకన్లలోనే అందుకుంటుంది. 200 లీటర్ల సామర్థ్యమున్న రెండు ట్యాంకులను పూర్తిగా ఉప్పునీటితో నింపితే.. దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. త్వరలోనే ఐరోపా రోడ్లపై ఇది పరుగులు పెట్టనుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ కారు ధర కాస్త ఎక్కువే. ప్రస్తుతానికి దీని ధర ప్రకటించకపోయినా, దాదాపు రూ.10 కోట్లపైనే ఉంటుందని అంచనా.