నీటికి ఆనుకోకుండా, కాస్త పైన అలా తేలుతూ దూసుకెళ్లే హోవర్‌క్రాఫ్ట్‌లు అందరికీ తెలిసినవే. కానీ నీటిపైనే కాదు నేలపైనా వేగంగా దూసుకుపోయే సరికొత్త స్పోర్ట్స్ హోవర్‌క్రాఫ్ట్ అరోసాను అమెరికాకు చెందిన వోన్‌మెర్సీర్ సంస్థ రూపొందించింది. అత్యాధునిక డిజైన్‌తో, యుద్ధ విమానాల్లాంటి సీటింగ్, పరికరాలతో దీనిని తయారుచేసింది.
అరోసా నీటిపైనా, నేలపైనా సుమారు ఏడు అంగుళాల ఎత్తులో ఎగురుతూ.. గంటకు 100 కిలోమీటర్ల వరకు వేగంతో.. 200 కిలోమీటర్ల దూరం వరకు ప్రయణించగలదు. ఇందులో పెట్రోల్ జనరేటర్ నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌తో రోటార్ ఫ్యాన్లు తిరుగుతాయని.. ఈ తరహా ఎలక్ట్రిక్ హోవర్‌క్రాఫ్ట్ ప్రపంచంలోనే మొదటిదని కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాదే దీన్ని మార్కెట్లోకి తేనున్నట్టు తెలిపింది.
ఇంతకీ దీని ధరెంతో చెప్పలేదు కదా.. జస్ట్ రూ.75 లక్షలేనట.
Comments
Please login to add a commentAdd a comment