hovercraft
-
నీటి మీదా.. నేల మీదా..
నీటికి ఆనుకోకుండా, కాస్త పైన అలా తేలుతూ దూసుకెళ్లే హోవర్‌క్రాఫ్ట్‌లు అందరికీ తెలిసినవే. కానీ నీటిపైనే కాదు నేలపైనా వేగంగా దూసుకుపోయే సరికొత్త స్పోర్ట్స్ హోవర్‌క్రాఫ్ట్ అరోసాను అమెరికాకు చెందిన వోన్మెర్సీర్ సంస్థ రూపొందించింది. అత్యాధునిక డిజైన్‌తో, యుద్ధ విమానాల్లాంటి సీటింగ్, పరికరాలతో దీనిని తయారుచేసింది. అరోసా నీటిపైనా, నేలపైనా సుమారు ఏడు అంగుళాల ఎత్తులో ఎగురుతూ.. గంటకు 100 కిలోమీటర్ల వరకు వేగంతో.. 200 కిలోమీటర్ల దూరం వరకు ప్రయణించగలదు. ఇందులో పెట్రోల్ జనరేటర్ నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌తో రోటార్ ఫ్యాన్లు తిరుగుతాయని.. ఈ తరహా ఎలక్ట్రిక్ హోవర్‌క్రాఫ్ట్ ప్రపంచంలోనే మొదటిదని కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాదే దీన్ని మార్కెట్లోకి తేనున్నట్టు తెలిపింది. ఇంతకీ దీని ధరెంతో చెప్పలేదు కదా.. జస్ట్ రూ.75 లక్షలేనట. -
హోవర్‌క్రాఫ్టస్ స్పీడ్‌కు బ్రేక్!
సాక్షి, విశాఖపట్నం : ఆర్కే బీచ్‌లో పర్యాటకులతో షికార్లు కొట్టేందుకు సిద్ధమైన హోవర్ క్రాఫ్ట్‌లు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టనుంది. ఇలాంటి హోవర్ క్రాఫ్ట్‌లను ఇప్పటిదాకా అమెరికా, న్యూజిలాండ్, అస్ట్రేలియా, రష్యా, యూరప్ దేశాల్లో పర్యాటకుల కోసం నడుపుతున్నారు. వీటిని మన దేశంలోనే తొలిసారిగా విశాఖలో ప్రవేశపెట్టడానికి హోవర్ డాక్ అనే సంస్థ ముందుకొచ్చి పర్యాటకశాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ హోవర్ క్రాఫ్ట్‌లు నేలపైన, నీటిపైన కూడా సునాయాసంగా ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆర్కే బీచ్‌లో తీరం నుంచి కిలోమీటరు లోపల వరకు హోవర్ క్రాఫ్ట్‌లు నడపడానికి అనుమతి పొందింది. దీంతో నాలుగు స్పీడ్ బోట్ల (హోవర్ క్రాఫ్ట్‌ల)ను నడపడానికి హోవర్ డాక్ సంస్థ సన్నద్ధమయింది. వీటిలో ఐదుగురు కూర్చునే వీలున్న హోవర్ క్రాఫ్ట్ రూ.1.10 కోట్లు, ఏడుగురు ప్రయాణించే సామర్థ్యం ఉన్న బోటును రూ.1.70 కోట్లు వెచ్చించింది. వీటితో పాటు మరో రెండు హోవర్ క్రాఫ్ట్‌లకు వెరసి రూ.6 కోట్లు వెచ్చించి రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఈ హోవర్ క్రాఫ్ట్‌లను నడిపే టగ్ ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వడానికి గత నెల మొదటి వారంలో రష్యా నుంచి శిక్షకుడిని తీసుకొచ్చారు. వారం రోజుల పాటు విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని రెడ్డికంచేరు సముద్రతీరంలో ఈ ఆపరేటర్లకు ఆయన శిక్షణ ఇచ్చారు. అనంతరం ఆయన వ్యక్తిగత పనులపై స్వదేశానికి వెళ్లిపోవడంతో వీరికి శిక్షణ నిలిచిపోయింది. మళ్లీ రష్యా నుంచి మరొక శిక్షకుడు రావలసి ఉంది. ఇందుకు మరి కొన్నాళ్ల సమయం పట్టనుంది. అందువల్ల ఆయన వచ్చే దాకా శిక్షణ పూర్తికాదు. వేసవిలో విశాఖకు ఉత్తర భారతదేశం నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో వేసవికి ముందే ఈ నెలాఖరు నుంచి ఆర్కే బీచ్‌లో ఈ హోవర్ క్రాఫ్ట్‌లను ప్రారంభించాలని హోవర్ డాక్ సంస్థ ప్రతినిధులు సన్నాహాలు చేశారు. కానీ రష్యా శిక్షకుడు అర్థాంతరంగా వెళ్లిపోవడంతో హోవర్ క్రాఫ్ట్‌ల ప్రారంభానికి బ్రేకు పడింది. త్వరలోనే రష్యా నుంచి మరో శిక్షకుడు రానున్నారని, ఆయన రాగానే శిక్షణ కొనసాగుతుందని హోవర్ డాక్ అధినేత ఆర్.మెహర్ చైతన్యవర్మ ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుత అంచనాలను బట్టి ఏప్రిల్ నెలాఖరు నాటికి హోవర్ క్రాఫ్ట్‌ల్లో షికారు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
నేలపై.. నీటిలో..
విశాఖ సిటీ, తగరపువలస (భీమిలి): దేశంలోనే మొట్టమొదటిసారిగా విశాఖ రామకృష్ణ బీచ్‌లో వచ్చే నెల నుంచి హోవర్‌క్రాఫ్ట్‌లు పర్యాటకులను అలరించనున్నాయి. ఇప్పటికే హోవర్ డాక్ సంస్థ ప్రతినిధులు బీచ్‌లో హోవర్‌క్రాఫ్ట్‌లు తిరగడానికి అనువైన ప్రదేశాన్ని గుర్తించి ప్రభుత్వపరమైన అనుమతులు పొంది ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రష్యా నుంచి రెండు హోవర్‌క్రాఫ్ట్‌లను దిగుమతి చేసుకున్న నిర్వాహకులు భోగాపురం మండలం రెడ్డి కంచేరు తీరంలో ఉంచి రష్యాకు చెందిన నిపుణులతోనే శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించారు. నేలపైన, నీటిలోనూ తిరగగలిగే హోవర్‌క్రాఫ్ట్‌లు ఇప్పటి వరకు యూరప్ దేశాలు, అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలలోనే అందుబాటులో ఉన్నాయి. పర్యాటక నగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖకు ఏడాదికేడాది పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వేసవిలో విశాఖకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి విశేషంగా పర్యాటకులు వస్తుంటారు. విశాఖలో ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే వీటిని అయిదు వరకు పెంచనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అయిదుగురు ప్రయాణించగల హోవర్‌క్రాఫ్ట్ రూ.1.10 కోట్లు, ఏడుగురు ప్రయాణించగల వాహనాన్ని రూ.1.70 కోట్లకు నిర్వాహకులు కొనుగోలు చేశారు. ఇప్పటికే విశాఖ తీరంలో సబ్‌మెరైన్ మ్యూజియం, టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం, కైలాసగిరి నుంచి అప్పుఘర్‌కు రోప్ వే వంటివి పర్యాటకులను అలరిస్తుండగా ఇటీవల హెలీ టూరిజమ్ పేరుతో ఏర్పాటు చేసిన హెలికాప్టర్లో నగర సందర్శన పర్యాటకులను ఆకర్షించలేకపోయింది. నేలపై నుంచి నేరుగా నీటిలోకి దూసుకుపోయే హోవర్‌క్రాఫ్ట్‌లను నేవీలో వినియోగిస్తుంటారు. విశాఖలో హోవర్‌క్రాఫ్ట్ తయారీ పరిశ్రమ.. నగరంలో హోవర్‌క్రాఫ్ట్ సేవలు పర్యాటకులను ఆకర్షించగలిగితే ఇక్కడే హోవర్‌క్రాఫ్ట్‌ల విడిభాగాలతో తయారీ పరిశ్రమ ఏర్పాటుకు నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. రష్యాలోని క్రిస్టి హోవర్‌క్రాఫ్ట్ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నారు. ఇవి కేవలం పర్యాటకులను ఆకర్షించడానికే కాకుండా తుఫానులు, వరదల సమయంలో వీటిలో బాధితులను జాగ్రత్తగా ఒడ్డుకు చేరవేయవచ్చు. మామూలు పడవలు ఎక్కువ లోతు గల నీటిలోనే ప్రయాణించగలవు. హోవర్‌క్రాఫ్ట్‌లు నీటిమట్టంతో సంబంధం లేకుండా నేలమీద కూడా ప్రయాణించగలవు కాబట్టి వీటిని సముద్రాలలోనే కాకుండా సరస్సులపై కూడా వినియోగించవచ్చు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఎదురయ్యే విషసర్పాలు, తేళ్లు, మొసళ్ల బారి నుంచి కూడా హోవర్‌క్రాఫ్ట్‌లు రక్షణగా ఉపయోగపడతాయి. పర్యాటకులు సముద్రంపై దీనిలో ప్రయాణించడానికి పది నిముషాలకు రూ.300 నుంచి 500 వరకు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి. -
మిలటరీ 'ఓవర్ క్రాఫ్ట్' ల్యాండింగ్