ఈ కారు.. కిర్రాక్..
ఇది బుగాటీ ‘చిరాన్’.. దీని అత్యధిక వేగం గంటకు 420 కిలోమీటర్లు. 1,500 బీహెచ్‌పీ పవర్‌తో నడిచే ఈ కారు కేవలం 2.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందట. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, విలాసవంతమైన, వేగవంతమైన స్పోర్ట్స్ కార్ ఇదేనని బుగాటీ చెబుతోంది. దీని టాప్ స్పీడును తట్టుకోవడానికి టైర్లను ప్రత్యేకంగా తయారుచేయించారు.
ఫార్ములావన్ కార్లలో వాడే బ్రేకింగ్ వ్యవస్థను ఇందులో ఉపయోగించారు. అత్యధిక వేగం అందుకోవడానికి కారులోనే టాప్‌స్పీడ్ కీ అని ఉంటుందట. అది వాడితేనే.. టాప్ స్పీడును అందుకుంటుంది. లేనిపక్షంలో దీని అత్యధిక వేగం గంటకు 379 కిలోమీటర్లు. పైగా.. ఇది లిమిటెడ్ ఎడిషన్ టైపు. 500 చిరాన్లను మాత్రమే తయారుచేస్తారు. ఇప్పటికే 180 కార్లకు అడ్వాన్స్ బుకింగ్ కూడా అయిపోయింది. దీని రేటు రూ.19 కోట్లు.