పదకొండేళ్ల తర్వాత ప్రపంచం ముందుకు షూమాకర్‌! | Schumacher Seen In Public 1st Time In 11 Years Reason Is Special: Report | Sakshi
Sakshi News home page

పదకొండేళ్ల తర్వాత ప్రపంచం ముందుకు షూమాకర్‌!

Published Wed, Oct 2 2024 8:44 PM | Last Updated on Wed, Oct 2 2024 8:48 PM

Schumacher Seen In Public 1st Time In 11 Years Reason Is Special: Report

PC: X

రేసింగ్‌ రారాజు మైకేల్‌ షూమాకర్‌ పదకొండేళ్ల తర్వాత తొలిసారి బయట కనిపించినట్లు సమాచారం. తన కూతురు గినా పెళ్లి సందర్భంగా ఈ దిగ్గజ డ్రైవర్‌ ప్రపంచం ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. యూకేకు చెందిన మెట్రో సైట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా ఏడుసార్లు ఫార్ములా వన్‌ చాంపియన్‌గా నిలిచిన షూమాకర్‌ 2013లో ఘోర ప్రమాదానికి గురయ్యాడు.

ఫ్రాన్స్‌లో ఆల్ఫ్‌ పర్వతాల్లో కుటుంబంతో కలిసి స్కీయింగ్‌ చేస్తుండగా.. పట్టుతప్పి పడిపోయాడు. ఈ క్రమంలో బండరాయికి తల బలంగా తగలడంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు. పేరుకు బతికి ఉన్నాడే గానీ పూర్తిగా అచేతనంగా మారిపోయాడు. ఆ తర్వాత అతడి మళ్లీ పూర్తిస్థాయిలో కోలుకోనే లేదనే వార్తలు వచ్చాయి.

అయితే, తాజాగా తన కుమార్తె గినా వివాహ బంధంలో అడుగుపెడుతున్న వేళ షూమాకర్‌ బయటకు వచ్చినట్లు కథనాలు రావడం అతడి అభిమానులకు ఊరటనిచ్చాయి. కాగా గినా అథ్లెట్‌. గుర్రపుస్వారీలో ఆమెకు అనుభవం ఉంది. ఇక గినా పెళ్లి విషయానికొస్తే.. తన చిరకాల స్నేహితుడు ఇయాన్‌ బెత్కెను ఇటీవలే వివాహమాడింది. మూడు రోజుల క్రితం ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె షేర్‌ చేసింది.

అయితే, అందులో షూమాకర్‌ సహా మిగతా కుటుంబ సభ్యులెవరూ లేకపోవడం గమనార్హం. ఇక స్పెయిన్‌లోని మాలోర్కాలో గల లగ్జరీ విల్లాలో గినా వెడ్డింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది. కాగా జర్మనీకి చెందిన 55 ఏళ్ల షూమాకర్‌ కుమారుడు మిక్‌ షూమాకర్‌ కూడా ఎఫ్‌1 రేసింగ్‌లో పాల్గొన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement