![Fight Turns At Wedding Four People Dead After Car Rammed - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/6/555555.jpg.webp?itok=sNwA9Ma8)
అందంగా జరుపుకోవాల్సిన వివాహ వేడుక విషాదంగా మారింది. ఇంకాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా చిన్న రగడ మొదలైంది. అది కాస్త తీవ్రంగా పరిణమంచి నలుగు వ్యక్తులు మృతికి దారితీసింది.
వివరాల్లోకెళ్తే...స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ఓ రెస్టారెంట్‌లో వివాహం జరగబోతోంది. ఇంతలో ఏమైందో ఏమో ఇరు వర్గాల మధ్య చిన్న గొడవ చోటుచోసుకుంది. అది కాస్త మరింత రసాభాసగా మారింది. ఆ తర్వాత కొద్దిసేపటికే అనుహ్యంగా ఒక కారు పెళ్లికి వచ్చిన అతిథులపైకి దూసుకు వచ్చింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఐతే దాడికి పాల్పడిన కారుని రెస్టారెంట్‌కి 50 కి. మీ సమీపంలోనే పోలీసులు గుర్తించారు. ఆ కారులో ఉన్న ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. మరోకరు పరారిలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గరులో ఒకరు తండ్రి, మిగతా ఇద్దరు అతని పిల్లలుగా గుర్తించారు. దీంతో మరోకరు కూడా ఈ ఘటనలో పాల్గొని ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు గాలించడం ప్రారంభించారు.
(చదవండి: 9 రోజుల పాటు గనుల్లో చిక్కుకున్న కార్మికులు...కాఫీ ఫౌడర్, నీళ్లే ఆహారంగా..)
Comments
Please login to add a commentAdd a comment