మంటలంటుకున్న దృశ్యం.. ఇన్‌సెట్‌లో డేవిడ్ షుమాకర్(File Photo)
ఎఫ్-1 రేస్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. రేసులో భాగంగా జరిగిన యాక్సిడెంట్‌లో ఫార్ములావన్ దిగ్గజం మైకెల్ షుమాకర్ అల్లుడు డేవిడ్ షుమాకర్ వెన్నుముక విరిగింది. వెన్నుముకకు సర్జరీ అవసరం లేకపోయినప్పటికి డేవిడ్ షుమాకర్ కోలుకోవడానికి ఆరువారాల సమయం పట్టే అవకాశముంది. హాకెన్‌హీమ్ డీటీఎమ్ రేస్‌లో ఈ దుర్ఘటన జరిగింది.
రేసులో భాగంగా లాప్-6 జరుగుతున్న సమయంలో టర్న్-8 వద్ద షుమాకర్ మెర్సిడెస్ కారు.. మరో కారుతో క్రాష్ అయింది. ఈ సమయంలో రెండు కార్లు బారికేడ్లను తాకడంతో షుమాకర్ కారుకు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత షుమాకర్‌ను ఆసుపత్రికి తరలించారు. కాగా వెన్నుముక కింది భాగమైన లంబర్ వర్టిబ్రే విరిగినట్లు రిపోర్ట్స్‌లో తేలింది. దీనికి సర్జరీ అవసరం లేకపోయినప్పటికి ఆరు వారాల విశ్రాంతి మాత్రం కచ్చితంగా అవసరమని వైద్యులు పేర్కొన్నారు.
ఇక ఫార్ములావన్‌లో మైకెల్ షుమాకర్ దిగ్గజంగా పేరుపొందాడు. ఎఫ్-1 రేసులో ఏడు వరల్డ్ టైటిల్స్ సాధించిన షుమాకర్ అందులో ఐదు ఫెరారీ డ్రైవర్‌గా.. మిగతా రెండు టైటిల్స్ మెర్సిడెస్ ద్వారా అందుకున్నాడు. ఇక 2013లో తీవ్రమైన యాక్సిడెంట్‌కు గురైన షుమాకర్ కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత 2014లో కోమా నుంచి బయటపడిన షుమాకర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్నాడు. ఇక షుమాకర్ రికార్డును లూయిస్ హామిల్టన్ 2021లో బ్రేక్ చేశాడు. షుమాకర్ తర్వాత మెర్సిడెస్‌కు ఎఫ్-1 రేసర్‌గా మారిన హామిల్టన్ ఏడు వరల్డ్ టైటిల్స్ సాధించి షుమాకర్‌తో సమానంగా నిలిచాడు.
చదవండి: 14 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు.. డ్యాన్స్‌తో లంక క్రికెటర్స్ అదుర్స్
Comments
Please login to add a commentAdd a comment