
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో మరో హిట్ అండ్ రన్ వెలుగులోకి వచ్చింది. ఇటీవల జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి వద్ద బైకును కారు ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన మరువకముందే మరో ఘటన కలకలం రేగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో వైట్ డెకో స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగాంగా వెళ్లి ఎదురుగా ఉన్న రెండు బైకులను ఢీకొట్టింది.
ఈ ఘటనలో అన్నాచెల్లితో పాటు మరో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మాదాపూర్‌లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కార్ నెంబర్ ఆధారంగా గుంటూరుకు చెందిన బిక్కి అశోక్‌గా పోలీస్ గుర్తించారు. గుంటూరు బయల్దేరిన జూబ్లీహిల్స్ పోలీస్ బృందం