
విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను రాంగ్ డైరెక్షన్‌లో వచ్చిన ఓ కారు వేగంగా దూసుకొచ్చి ఢికొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. ఉత్తరప్రదేశ్ లక్నోలోని అవధ్ ప్రాంతంలో ఉన్న కూడలి వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై నుంచి ఓ కారు వైగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనకు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ మారింది. ట్రాపిక్‌ను అదుపులో ఉంటే కానిస్టేబుల్ భద్రతలేకుండా పోయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు పాల్పడిన కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి.. అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు పేర్కొన్నారు.
लखनऊ के अवध चौराहे पर हादसा..
— Suraj Shukla (@suraj_livee) December 4, 2023
बेअन्दाज़ शख्स ने उल्टी दिशा में कार दौड़ाई और ट्रैफिक सिपाही पर चढ़ा दी
हादसे के बाद चालक कार लेकर भाग निकला, घायल सिपाही अस्पताल में भर्ती
पुलिस ने फुटेज की मदद से चालक अभिषेक दास को गिरफ्तार किया..@lkopolice pic.twitter.com/25izaQmiCc