![2023 Audi Q3 Sportback Bookings Start in India details inside - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/8/audiq3sportsback.jpg.webp?itok=tn7Wnf-x)
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి’ తన నూతన స్పోర్ట్‌బ్యాక్ కారు ‘ఆడిక్యూ3’ స్పోర్ట్‌బ్యాక్ బుకింగ్‌లను మంగళవారం ప్రారంభించింది. రూ.2 లక్షలతో బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
2.0లీటర్ల టీఎఫ్‌ఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్‌తో ఈ కారు ఉంటుంది. మంచి పనితీరు, అద్భుతమైన డిజైన్‌తో రోజువారీ వినియోగానికి కారు కోరుకునే వారు ఆడిక్యూ3 స్పోర్ట్‌బ్యాక్‌ను ఎంతో ఇష్టపడతారని ఆడి ఇండియా హెడ్ బల్బీర్‌సింగ్ దిల్లాన్ పేర్కొన్నారు. 2022లో భారత్‌లో 27 శాతం మేర విక్రయాల వృద్ధిని నమోదు చేశామని, 2023లోనూ విక్రయాలు ఇదే విధంగా ఉండొచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment