
ఫార్ములా రేసింగ్ నేర్చుకుంటున్నారు హీరోయిన్ నివేదా పేతురాజ్. ఇది సినిమా కోసం కాదు. రియల్ లైఫ్‌లో తన కలను నిజం చేసుకోవడానికి రేసింగ్ నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ ఓ స్కూల్ నుంచి ‘ఫార్ములా రేసింగ్ లెవల్ 1 రేసర్’గా సర్టిఫికేట్ కూడా పొందారు. ఈ సందర్భంగా నివేదా మాట్లాడుతూ.. ‘‘స్కూల్ డేస్ నుంచే ఫార్ములా రేసింగ్ అంటే నాకు ఆసక్తి. నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మా బంధువుల్లో ఒకరు స్పోర్ట్స్ కారు కొన్నారు. దాంతో స్పోర్ట్స్ కార్లంటే మరింత ఇష్టం పెరిగింది. ఆ ఇష్టంతోనే 2015లో ఓ స్పోర్ట్స్ కారు కొన్నాను.
యూఏఈలో అప్పట్లో డాడ్జ్ ఛాలెంజర్ కారు కొన్న రెండో మహిళను నేనే. ఈ కారు వి6 ఇంజిన్ ఫాస్ట్ రేసింగ్‌కు సంబంధించినది. కానీ నేను బాగానే డ్రైవ్ చేశాను. చెన్నై వచ్చాక కొన్ని మోటార్ ట్రాక్స్‌ను చూసి, ఈ ట్రాక్స్‌పై డ్రైవ్ చేయగలనా? అనిపించింది. ఆ తర్వాత కోయంబత్తూరులోని ఓ అడ్వాన్డ్స్ రేసింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నాను. లెవల్ వన్ కంప్లీట్ చేశాను. మన దేశంలో ఫార్ములా వన్, ఫార్ములా 2 ఛాంపియన్ షిష్స్ మహిళా పోటీలు లేవు. ఉంటే ప్రోత్సాహంగా ఉంటుందని నా అభిప్రాయం. అయినా రేస్‌లో పాల్గొన్న ప్రతిసారీ రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది. అందుకే ప్రస్తుతం రేసింగ్‌లోని నెక్ట్స్ లెవల్స్‌ను పూర్తి చేయడం పైనే దృష్టి పెట్టాను’’ అన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment