
చెన్నై: ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ పెట్రోనాస్ లూబ్రికెంట్స్ ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యాన్ని పటిష్ట పరచుకుంటోంది. తద్వారా దేశీయంగా మోటార్ స్పోర్ట్స్‌ను ప్రోత్సహించడంలో పరస్పరం కట్టుబడి ఉన్నట్లు సంస్థలు పేర్కొన్నాయి.
భాగస్వామ్యంలో భాగంగా రానున్న మూడేళ్ల కాలానికి టీవీఎస్ రేసింగ్ టీమ్ టైటిల్ స్పాన్సర్‌గా టీవీఎస్ మోటార్, పెట్రోనాస్ లూబ్రికెంట్స్ వ్యవహరించనున్నాయి. 2022–23 సీజన్‌లో టీవీఎస్ రేసింగ్‌కు టైటిల్ స్పాన్సర్‌గా పెట్రోనాస్ లూ బ్రికెంట్స్ ఇండియా వ్యవహరించింది.
ఇండియన్ నేషనల్ సూపర్‌క్రాస్ చాంపియన్‌షిప్, ఇండియన్ నేషనల్ ర్యాలీ చాంపియన్‌షిప్, ఇండియన్ నేషనల్ మోటార్‌సైకిల్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లలో రేసింగ్ టీమ్ పాల్గొనేందుకు మద్దతివ్వనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment