Title sponsorship
-
భారీ ఆదాయంపై కన్ను.. టైటిల్ స్పాన్సర్షిప్ టెండర్లకు పిలుపు
బోర్డు ఆఫ్ కంట్రోల్ క్రికెట్ ఇండియా(బీసీసీఐ) మరోసారి భారీ ఆదాయంపై కన్నేసింది. టైటిల్ స్పాన్సర్ రైట్స్‌కు బీసీసీఐ ఈరోజు టెండర్లను ఆహ్వానించింది. ప్రముఖ కంపెనీల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. జీఎస్టీతో కలిపి రూ. లక్ష చెల్లించిన వాళ్లకు మాత్రమే ఇన్విటేషన్ టు టెండర్ ఫామ్ ఓపెన్ అవుతుందని వెల్లడించింది. ఒకవేళ టెండర్ దక్కకుంటే కట్టిన డబ్బులు వాపసు ఇవ్వబోమని, ఈ టెండర్ దరఖాస్తు ఆగస్టు 21 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని నోటిఫికేషన్లో బీసీసీఐ స్పష్టంగా పేర్కొంది. ఆసక్తికల కంపెనీలు పేమెంట్ వివరాలను titlesponsor.itt@bcci.tv మెయిల్‌కు చేయాలని సూచించింది. స్పాన్సర్షిప్ దక్కించుకున్న కంపెనీ ఇకనుంచి బీసీసీఐ అన్ని కార్యక్రమాలకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. చదవండి: Ishan Kishan: హ్యాట్రిక్ అర్థసెంచరీలు.. ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు -
‘డ్రీమ్ 11’ ఒక్క 2020కే...
న్యూఢిల్లీ: రూ. 222 కోట్లకు ఐపీఎల్ –2020 టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు దక్కించుకున్న ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ ‘డ్రీమ్ ఎలెవన్’ జోరుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అడ్డుకట్ట వేసింది. ఈ ఏడాదిలాగే 2021, 2022 ఐపీఎల్‌లకు కూడా ప్రధాన స్పాన్సర్‌గా కొనసాగుతామనే ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. వారితో ఒప్పందం ఈ ఒక్క ఏడాదికే ఖరారైందని స్పష్టం చేసింది. తర్వాతి రెండేళ్లకు రూ. 240 కోట్ల చొప్పున చెల్లిస్తామని, తమకే హక్కులు ఇవ్వాలంటూ ‘డ్రీమ్ 11’ బోర్డుకు ఆఫర్ ఇచ్చింది. అయితే ఇది తమకు ఆమోదయోగ్యం కాదంటూ బోర్డు నో చెప్పేసింది. అదనపు రెండేళ్లు ఒప్పందం విషయంలో డ్రీమ్ 11కు, బీసీసీఐకి మధ్య చర్చలు జరిగాయని... తమకు ఇవ్వచూపిన మొత్తాన్ని పెంచాలంటూ బోర్డు కోరడంతో ఏకాభిప్రాయం కుదర్లేదని తెలిసింది. ‘ఐపీఎల్–13 కోసం డ్రీమ్ 11 ఎక్కువ మొత్తానికి కోట్ చేసింది కాబట్టి వారికి హక్కులు ఇచ్చాం. తర్వాతి రెండేళ్లకు రూ. 240 కోట్లకే మేం ఎందుకు ఇస్తాం. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత రాబోయే రోజుల్లో పరిస్థితులు కచ్చితంగా మెరుగు పడతాయి. అయినా ‘వివో’తో మా ఒప్పందం పూర్తిగా రద్దు కాలేదు. ఈ ఏడాది విరామం మాత్రమే ఇచ్చామంతే. రూ. 440 కోట్లు ఇచ్చేవారు ఉండగా, రూ. 240 కోట్లకు హక్కులు అందజేస్తామా’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈలో ఐపీఎల్ జరుగుతుంది. మాకు చాలా బాధ కలిగింది: సీఏఐటీ ఒక వైపు చైనా కంపెనీలతో సంబంధాలు తెంచుకోవాలంటూ, మరో వైపు ‘డ్రీమ్ 11’తో బీసీసీఐ ఒప్పందం చేసుకోవడాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్ (సీఏఐటీ) ప్రశ్నించింది. చైనా పెట్టుబడులు ఉన్న కంపెనీకే ఐపీఎల్ స్పాన్సర్షిప్ హక్కులు ఇవ్వడం తమను బాధించిందని ఈ సమాఖ్య అభిప్రాయ పడింది. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి సీఏఐటీ లేఖ రాసింది. ‘డ్రీమ్ 11లో చైనాకు చెందిన టెన్సెంట్ గ్లోబల్ కంపెనీ ప్రధాన వాటాదారుగా ఉంది. చైనాను తీవ్రంగా వ్యతిరేకించే భారత అభిమానుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఇలా దొడ్డి దారిన హక్కులు కేటాయించడం సరైంది కాదు. ఇది భారత ప్రయోజనాలను పణంగా పెట్టడమే’ అని సీఏఐటీ తమ లేఖలో పేర్కొంది. -
ఐపీఎల్ 2020 : బిడ్డింగ్ రేసులో పతంజలి
సాక్షి,న్యూఢిల్లీ : మెగా స్పోర్ట్స్ ఈవెంట్ ఐపీఎల్-2020 టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి వివో నిష్క్రమించిన తరువాత, యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి రేసులో ముందుకు వచ్చింది. తన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చే వ్యూహంలో పంతాంజలి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం ప్రయత్నిస్తోంది. ఈ అంశాన్ని తాము పరిశీలిస్తున్నామంటూ ప్రతినిధి ఎస్ కె టిజరవాలా ధృవీకరించారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆగస్టు 14 లోగా తన ప్రతిపాదనను సమర్పించాల్సి ఉందని చెప్పారు. (‘వివో’ లేకుంటే నష్టమేం లేదు: గంగూలీ ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)13 వ ఎడిషన్ టైటిల్ స్పాన్సర్ల వివాదం నేపథ్యంలోస్వదేశీ బ్రాండ్ పతంజలి రంగంలోకి దిగింది. తద్వారా తమ బ్రాండ్ కు అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావాలని భావిస్తోంది. హరిద్వార్‌కు చెందిన పతంజలి గ్రూప్ టర్నోవర్ సుమారు10,500 కోట్ల రూపాయలు. అదానీ గ్రూపుతో పోటీ పడి పరీ భారీ అప్పుల్లో కూరుకుపోయిన రుచీ సోయాను కొనుగోలు చేసింది. అయితే ఇటీవల ఆయుర్వేద మందు కరోనిల్ కరోనా నివారణకు విజయవంతంగా పనిచేస్తుందని ప్రకటించి వివాదంలో పడింది. (ఐపీఎల్ : ఒమర్ అబ్దుల్లా సెటైర్లు) కాగా చైనా-ఇండియా సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా కంపెనీలతో సహా అన్న స్పాన్సర్ షిప్ లను కొనసాగిస్తూ బీసీసీఐ తీసుకున్ననిర్ణయం విమర్శలకు దారితీసింది. ఇప్పటికే అమెజాన్, బైజూస్, డ్రీమ్ 11 వంటి టాప్ బ్రాండ్స్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ రేసులో ఉన్న సంగతి తెలిసిందే. -
‘పేటీఎం’కే టైటిల్ స్పాన్సర్షిప్
ముంబై: భారత్‌లో జరిగే అన్ని క్రికెట్ మ్యాచ్‌ల టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థ ‘పేటీఎం’ తిరిగి దక్కించుకుంది. స్వదేశంలో భారత జట్టు ఆడే అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లతో (టెస్టులు, వన్డేలు, టి20లు) పాటు మహిళల క్రికెట్ సహా బీసీసీఐ నిర్వహించే దేశవాళీ టోర్నీలు అన్నింటికీ ‘పేటీఎం’ టైటిల్ స్పాన్సర్‌గా ఉంటుంది. స్పాన్సర్‌షిప్‌పై ‘పేటీఎం’ యాజమాన్యం వన్ 97 కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో 2019–2023 మధ్య నాలుగేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇందు కోసం ‘పేటీఎం’ రూ.326.80 కోట్లు చెల్లించ నుంది. భారత్‌లో జరిగే మ్యాచ్‌ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే సుమారుగా ఒక్కో మ్యాచ్‌కు పేటీఎం రూ. 3.80 కోట్లు చెల్లిస్తుంది. గత ఏడాది రూ. 2.4 కోట్లతో పోలిస్తే ఇది 58 శాతం ఎక్కువ. సెప్టెంబర్ 15న దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టి20తో భారత్ స్వదేశీ సీజన్ మొదలవుతుంది. -
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం బిడ్స్ ఆహ్వానం
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్షిప్ హక్కుల కోసం బీసీసీఐ బిడ్లను ఆహ్వానించింది. ఆగస్టు 1 నుంచి జూలై 31, 2022 వరకు ఉండే ఈ ఒప్పందం కోసం ఆసక్తిగల కంపెనీలు టెండర్లు దాఖలు చేయాలని సూచించింది. జూన్ 1 నుంచి 21 వరకు అందుబాటులో ఉండే ఈ టెండర్ల కోసం రూ.3 లక్షలు నాన్ రిఫండబుల్ కింద జమ చేయాల్సి ఉంటుంది. జూన్ 27 మధ్యాహ్నం 12 గంటల్లోపు పూర్తి చేసిన టెండర్లను సమర్పించాలి. బిడ్డింగ్‌లో విజేతగా నిలిచిన కంపెనీ వచ్చే సీజన్ నుంచి 2022 వరకు టైటిల్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తుంటుంది. ప్రస్తుతం రెండేళ్ల వ్యవధి (2016–17) కోసం రూ.100 కోట్ల చొప్పున చైనీస్ మొబైల్ కంపెనీ వీవో కుదుర్చుకున్న ఒప్పందం ముగిసింది. -
టైటిల్ స్పాన్సర్షిప్ కోసం బిడ్లను ఆహ్వానించిన బీసీసీఐ
ముంబై: అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లకు టైటిల్ స్పాన్సర్షిప్ కోసం భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) బిడ్లను ఆహ్వానించింది. 2014 సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ మధ్య కాలానికి బిడ్లను కోరుతున్నట్టు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పారు. ఈ మధ్య కాలంలో భారత్ మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఓ టి-20 మ్యాచ్ ఆడనుంది. ఇక ఇరానీ కప్, రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, విజయ్ హజారే, దేవ్‌దర్ ట్రోఫీ వంటి దేశవాళీ క్రికెట్ టోర్నీలకు కూడా స్పాన్షర్ షిప్ హక్కులు వర్తిస్తాయి. ఈ నెల 6 నుంచి 28 వరకు బిడ్లను స్వీకరిస్తారు. ఆ తర్వాత వీటిని తెరుస్తారు. అధిక ధరకు కోట్ చేసిన వారికి హక్కులు దక్కుతాయి. గత సీజన్లో స్టార్ ఇండియా హక్కులు కైవసం చేసుకుంది. -
బీసీసీఐ స్పాన్సర్షిప్ హక్కులు ఈఎస్పీఎన్కు
బీసీసీఐ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను ఈఎస్పీఎన్ స్టార్ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. వీటికోసం ఏకైక బిడ్ దాఖలు చేసిన ఈఎస్పీఎన్ ప్రాథమిక ధర రెండు కోట్ల రూపాయలకే కైవసం చేసుకోవడం విశేషం. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం 1.5 కోట్ల రూపాయలు తక్కువ కావడం విశేషం. 2013-14 ఏడాదికి గాను భారత్‌లో జరిగే అన్ని దేశవాళీ, అంతర్జాతీయ టోర్నమెంట్లకు ఈ ఒప్పందం వర్తిస్తుంది. బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ గురువారం ఈ విషయం వెల్లడించారు. ముంబైలో జరిగిన బోర్డు మార్కెటింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పటేల్ తెలిపారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఒప్పందం అమల్లో ఉంటుంది. ఈ మధ్య కాలంలో భారత్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లతో రెండు అంతర్జాతీయ సిరీస్‌లను టీమిండియా ఆడనుంది. -
ప్రతీ ఫార్మాట్‌కు వేర్వేరుగా హక్కులు
ముంబై : భారత్‌లో జరిగే అన్ని అంతర్జాతీయ, దేశవాళీ టోర్నీలకు టైటిల్ స్పాన్సర్షిప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టెండర్లు పిలిచింది. ఎయిర్టెల్ తప్పుకోవడంతో కొత్త స్పాన్సర్ కోసం బిడ్లను ఆహ్వానించాలని బోర్డు మార్కెటింగ్ కమిటీ నిర్ణయించింది. ఫరూక్ అబ్దుల్లా గైర్హాజరు కావడంతో శ్రీనివాసన్ నేతృత్వంలో కమిటీ గురువారం సమావేశమైంది. వచ్చే అక్టోబర్ 1నుంచి మార్చి 31, 2014 వరకు భారత్‌లో జరిగే మ్యాచ్‌ల కోసం టైటిల్ హక్కులు ఇవ్వనున్నారు. వీటిలో అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఇరానీ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ తదితర దేశవాళీ టోర్నీలు, విదేశీ జట్ల ‘ఎ’ టీమ్ తదితర మ్యాచ్‌లు కూడా ఉంటాయి. గతంతో పోలిస్తే ఈ సారి కూడా ఒక్కో మ్యాచ్ కనీస ధరలో బోర్డు ఎలాంటి మార్పూ చేయలేదు. ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్ కోసం దానిని రూ. 2 కోట్లుగానే ఉంచింది. అయితే ఇప్పుడు ఒక్కో ఫార్మాట్ కోసం (టెస్టు, వన్డే, టి20) కోసం వేర్వేరుగా టెండర్లు వేసే అవకాశం కల్పిస్తోంది. ఒక సంస్థ టెస్టు, టి20లకు ఒకే మొత్తం కోట్ చేసినప్పుడు, మరో సంస్థ అంతకంటే ఎక్కువగా కేవలం టి20ల కోసమే టెండర్లు వేస్తే వారికి విడిగా టి20 మ్యాచ్‌ల స్పాన్సర్షిప్ హక్కులు అందజేస్తారు. ఇప్పటి వరకు ఎయిర్ టెల్ ఫార్మాట్ ఏదైనా మ్యాచ్‌కు రూ. 3.33 కోట్ల చొప్పున చెల్లించింది. ఈసారి బోర్డు ఈ హక్కులను కేవలం ఆరు నెలల కోసమే ఇస్తోంది. మాంద్యం కారణంగా హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉండటంతో ఆరు నెలల తర్వాత దానిని మరో సారి సవరించాలన్న శ్రీనివాసన్ ఆలోచనను కమిటీ ఆమోదించింది.