టైటిల్ స్పాన్సర్షిప్ కోసం బిడ్లను ఆహ్వానించిన బీసీసీఐ | BCCI invites bids for title sponsorship | Sakshi
Sakshi News home page

టైటిల్ స్పాన్సర్షిప్ కోసం బిడ్లను ఆహ్వానించిన బీసీసీఐ

Published Tue, Aug 5 2014 4:13 PM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

టైటిల్ స్పాన్సర్షిప్ కోసం బిడ్లను ఆహ్వానించిన బీసీసీఐ

టైటిల్ స్పాన్సర్షిప్ కోసం బిడ్లను ఆహ్వానించిన బీసీసీఐ

ముంబై: అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ మ్యాచ్లకు టైటిల్ స్పాన్సర్షిప్ కోసం భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) బిడ్లను ఆహ్వానించింది. 2014 సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ మధ్య కాలానికి బిడ్లను కోరుతున్నట్టు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పారు.

ఈ మధ్య కాలంలో భారత్ మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఓ టి-20 మ్యాచ్ ఆడనుంది. ఇక ఇరానీ కప్, రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, విజయ్ హజారే, దేవ్దర్ ట్రోఫీ వంటి దేశవాళీ క్రికెట్ టోర్నీలకు కూడా స్పాన్షర్ షిప్ హక్కులు వర్తిస్తాయి. ఈ నెల 6 నుంచి 28 వరకు బిడ్లను స్వీకరిస్తారు. ఆ తర్వాత వీటిని తెరుస్తారు. అధిక ధరకు కోట్ చేసిన వారికి హక్కులు దక్కుతాయి. గత సీజన్లో స్టార్ ఇండియా హక్కులు కైవసం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement