బీసీసీఐ స్పాన్సర్షిప్ హక్కులు ఈఎస్పీఎన్కు | ESPN gets BCCI sponsorship rights | Sakshi
Sakshi News home page

బీసీసీఐ స్పాన్సర్షిప్ హక్కులు ఈఎస్పీఎన్కు

Oct 3 2013 6:32 PM | Updated on Sep 1 2017 11:18 PM

బీసీసీఐ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను ఈఎస్పీఎన్ స్టార్ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకుంది.

బీసీసీఐ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను ఈఎస్పీఎన్ స్టార్ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. వీటికోసం ఏకైక బిడ్ దాఖలు చేసిన ఈఎస్పీఎన్ ప్రాథమిక ధర రెండు కోట్ల రూపాయలకే కైవసం చేసుకోవడం విశేషం. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం 1.5 కోట్ల రూపాయలు తక్కువ కావడం విశేషం. 2013-14 ఏడాదికి గాను భారత్లో జరిగే అన్ని దేశవాళీ, అంతర్జాతీయ టోర్నమెంట్లకు ఈ ఒప్పందం వర్తిస్తుంది. బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ గురువారం ఈ విషయం వెల్లడించారు.

ముంబైలో జరిగిన బోర్డు మార్కెటింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పటేల్ తెలిపారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఒప్పందం అమల్లో ఉంటుంది. ఈ మధ్య కాలంలో భారత్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్లతో రెండు అంతర్జాతీయ సిరీస్లను టీమిండియా ఆడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement