ESPN
-
తీవ్ర ఒత్తిళ్లు.. ఐసీసీ సీఈవో రాజీనామా
తీవ్ర ఒత్తిళ్ల నడుమ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీఈవో మను సాహ్నే(56) తన పదవికి రాజీనామా చేశారు. గత నాలుగు నెలలుగా సస్పెన్షన్‌లో ఉన్న ఆయనపై అంతర్గత దర్యాప్తు కొనసాగుతోంది కూడా. ఈ నేపథ్యంలో గురువారం ఆయన తన రాజీనామా సమర్పించాడు. దుబాయ్: ఐసీసీ సీఈవో మను సాహ్నే రాజీనామాను వెంటనే ఆమోదించింది ఐసీసీ బోర్డు. ఇక తాత్కాలిక సీఈవోగా జియోఫ్ అలార్డైస్‌ను కొనసాగించనుంది. ఐసీసీ బోర్డు సభ్యులతో మను ప్రవర్తనపై గత కొన్ని నెలలుగా విమర్శలు వినవస్తున్నాయి. 56 ఏళ్ల మను.. సహచరులను లెక్కచేయకపోవడం, దూకుడు స్వభావం లాంటి చేష్టలతో బోర్డులో అసంతృప్తిని రాజేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో కిందటి ఏడాది ఎన్నికల సమయంలో ఇంటీరియమ్ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజాను కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు బలపరిచాయి కూడా. అలాగే వచ్చే సీజన్లకు సంబంధించిన ఈవెంట్ల ఫీ కూడా ఇప్పుడే చెల్లించాలని ఆయన తీసుకున్న నిర్ణయం బోర్డుల్లో ఆయన పట్ల వ్యతిరేకతను రాజేశాయి. 2019 వరల్డ్‌కప్ తర్వాత డేవ్ రిచర్డ్సన్ పదవీ కాలం ముగియడంతో సీఈవోగా ష్వానేను ఐసీసీ ఎంచుకుంది. పదవీ కాలపరిమితి 2022 వరకు ఉన్నా.. ఆయనపై వ్యతిరేకతతో బలవంతంగా రాజీనామా చేయించింది ఐసీసీ బోర్డు. ఈఎస్పీఎన్ ఎదుగుదలకు.. మను ష్వానే.. ఐసీసీకి ఐదో సీఈవో. ఇంతకు ముందు సింగపూర్ స్పోర్ట్స్ హబ్ కోసం, ఈఎస్పీఎన్ స్టార్‌స్పోర్ట్స్‌కు 22 ఏళ్లపాటు ఎండీగా పనిచేశాడు. ఆయన స్వస్థలం ఢిల్లీ. ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్స్కూల్లో చదివిన ష్వానే.. బిట్స్ పిలానీలో బీఈ మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. ఐఐఎఫ్‌టీ(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్)లో ఎంబీఏ చదివాడు. -
టీవీ లైవ్ షోలో షాకింగ్ ఘటన : వైరల్ వీడియో
సాక్షి,న్యూఢిల్లీ: టీవీ లైవ్ షోలు, చర్చలు సందర్బంగా గెస్ట్‌ల మధ్య వివాదాలు, తీవ్ర ఘర్షణ, ఒక్కోసారి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం లాంటి అనేక వింత వింత ఘటనలు చోటు చేసుకున్న ఉదంతాలను గతంలో అనేకం చూశాం. తాజాగా కొలంబియాలోని ఓ వార్తా ఛానెల్లో లైవ్ షో సందర్భంగా అనూహ్య ఘటన జరిగింది. ఈ ఊహించని పరిణామానికి అక్కుడున్నవారూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అంతా ఊరట చెందారు. లైవ్ ప్యానెల్ చర్చ సందర్భంగా అనుకోని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఈఎస్పీఎన్ కొలంబియాకు చెందిన జర్నలిస్ట్ కార్లోస్ ఓర్డుజ్ లైవ్ షోలో ప్యానెలిస్టులలో ఒకరు. చర్చా కార్యక్రమం నడుస్తుండగానే అకస్మాత్తుగగా టీవీ సెట్ కార్లోస్‌పై పడింది. దీంతో అతను ముందున్న టేబుల్‌ను వేగంగా ఢీకొన్నాడు. ఈ సమయంలో ఎటూ కదల్లేని పరిస్థితుల్లో స్క్రీన్ కిందే చిక్కుకుపోయాడు. దీంతో యాంకర్‌తోపాటు అక్కడున్నవారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. దీంతో యాంకర్.. షోకు కాసేపు విరామం ప్రకటించక తప్పలేదు. అయితే గాయపడిన జర్నలిస్టు క్షేమంగానే ఉన్నాడని, అతడి ముక్కుకు చిన్న గాయమైందంటూ టీవీ యాంకర్ తెలిపారు. మొత్తానికి జర్నలిస్టు స్వల్ప గాయాలతో తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. నెటిజన్లు ఈ ఘటనపై విభిన్నంగా సందిస్తున్నారు. మరోవైపు తాను క్షేమంగానే ఉన్నానంటూ కార్లోస్ కూడా ట్వీట్ చేశారు. అలాగే తనపై అభిమానం ప్రకటించిన, తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యావాదాలు తెలిపారు. UPDATE: ESPN anchor Carlos Orduz reassures viewers he is fine after being hit by falling set piece: “I must tell you I am fine, thank God, after a medical check-up and examination, any issue was ruled out, only a bruise and blow to the nose (no fracture).” — Mike Sington (@MikeSington) March 10, 2021 Shocking video. ESPN anchor crushed live on the air by falling set piece. Thankfully he was uninjured. pic.twitter.com/CeFxy8AksY — Mike Sington (@MikeSington) March 10, 2021 UPDATE: ESPN anchor Carlos Orduz reassures viewers he is fine after being hit by falling set piece: “I must tell you I am fine, thank God, after a medical check-up and examination, any issue was ruled out, only a bruise and blow to the nose (no fracture).” pic.twitter.com/JbtIIOlUmf — Carlos Orduz (@orduzrubio) March 10, 2021 -
ఆ టేస్ట్ షమీకి లేదు: సాహా
న్యూఢిల్లీ : భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా టెస్టు ఫార్మాట్లో బెస్ట్ వికెట్‌కీపర్‌గా ఇప్పటికే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. వికెట్ల వెనుక వేగంగా కదులుతూ బంతి కోసం అతను చేసే విన్యాసాలు అందరిని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో సాహా పలుమార్లు డైవ్ చేస్తూ క్యాచ్‌లు అందుకున్న సంగతి ఎవరు మరిచిపోలేరు. అయితే సాహా ఆటలో ఎంత చురుకుదనం ప్రదర్శిస్తాడో మైదానం బయట అంతే చలాకీగా ఉంటాడు. తాజాగా ఈఎస్పీఎన్ నిర్వహించిన ఇంటర్యూలో వృద్ధిమాన్ సాహా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ప్రస్తుత టీమిండియా జట్టులో సంగీతం మీద అవగాహన లేకుండా ఎవరైనా ఉన్నారా అని సాహాను అడగగా.. అతను తడుముకోకుండా మహ్మద్ షమీ పేరు వెల్లడించాడు. ప్రస్తుత టీమిండియా జట్టులో అందరికి సంగీతం మీద అంతో ఇంతో ఇష్టం ఉంది. కానీ షమీకి మాత్రం సంగీతం మీద ఏ మాత్రం అవగాహన లేదన్నాడు. అయితే మైదానంలో మాత్రం షమీ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పతిప్పలు పెడుతూ వికెట్లను కొల్లగొడుతాడని తెలిపాడు. ఈ సందర్భంగా రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తాను, పుజారా కలిసి ఆస్ట్రేలియన్స్పై స్లెడ్జింగ్‌కు దిగామని గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ల స్లెడ్జింగ్నే తాము కాపీ కొట్టామని సాహా పేర్కొన్నాడు. కోల్‌కతాలో బంగ్లాతో జరిగిన పింక్ బాల్ టెస్టులో ఉమేశ్ యాదవ్ వేసిన ఓవర్లో ఓపెనర్ షాదమన్ ఇస్లామ్ క్యాచ్‌ను అందుకోవడం ద్వారా సాహా టెస్టుల్లో భారత్ తరపున 100 డిస్మిల్స్ చేసిన ఐదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో సాహా ప్రదర్శనకు ముగ్దుడైన కెప్టెన్ విరాట్ కోహ్లి 'ప్రస్తుత ఉపఖండపు పరిస్థితుల్లో సాహా ఒక ఉత్తమ వికెట్ కీపర్' అంటూ అప్పట్లో ప్రశంసలతో ముంచెత్తాడు. -
టాప్-10లో విరాట్ ఒక్కడే..
ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో తరచు వార్తల్లో నిలుస్తున్న ఆటగాడు విరాట్ కోహ్లి. వన్డేల్లో వేగంగా 7000 పరుగులు, వేగంగా 25 సెంచరీలు, అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సగటు, ఐపీఎల్ లో ఒకే సీజన్లో నాలుగు శతకాలు, ఒకే సీజన్లో అత్యధిక పరుగులు. ఇలా తనదైన ముద్రతో చెలరేగిపోతున్న విరాట్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. తాజాగా ఈఎస్పీఎన్ విడుదల చేసిన 'ఫేమ్-100' ర్యాంకింగ్స్ లో విరాట్ ఎనిమిదో స్థానం దక్కించుకున్నాడు. తద్వారా టాప్-10 లో నిలిచిన ఏకైక క్రికెటర్ గా విరాట్ గుర్తింపు సాధించాడు. క్రీడాకారుల జీతభత్యాలు,ఎండోర్స్మెంట్స్, సోషల్ మీడియాలో ఫాలోయింగ్, గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఆటగాళ్ల పాపులారిటీ పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా ఆటగాళ్ల ర్యాంకులను ప్రకటిస్తారు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి 14వ స్థానం దక్కగా, భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు 41 ర్యాంక్‌లో నిలిచింది. టాప్-10 ఆటగాళ్లు 1.క్రిస్టియానో రొనాల్డో(ఫుట్ బాల్) 2.లీ బ్రాన్ జేమ్స్(బాస్కెట్ బాల్) 3.లియోనల్ మెస్సీ(ఫుట్ బాల్) 4.నెయమార్(ఫుట్ బాల్) 5. రోజర్ ఫెదరర్(టెన్నిస్) 6. కెవిన్ దురంత్(బాస్కెట్ బాల్) 7. టైగర్ వుడ్స్(గోల్ఫ్) 8. విరాట్ కోహ్లి(క్రికెట్) 9. జేమ్స్ రోడ్రిగ్యూస్(ఫుట్ బాల్) 10. రఫెల్ నాదల్(ఫుట్ బాల్) -
బీసీసీఐ స్పాన్సర్షిప్ హక్కులు ఈఎస్పీఎన్కు
బీసీసీఐ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను ఈఎస్పీఎన్ స్టార్ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. వీటికోసం ఏకైక బిడ్ దాఖలు చేసిన ఈఎస్పీఎన్ ప్రాథమిక ధర రెండు కోట్ల రూపాయలకే కైవసం చేసుకోవడం విశేషం. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం 1.5 కోట్ల రూపాయలు తక్కువ కావడం విశేషం. 2013-14 ఏడాదికి గాను భారత్‌లో జరిగే అన్ని దేశవాళీ, అంతర్జాతీయ టోర్నమెంట్లకు ఈ ఒప్పందం వర్తిస్తుంది. బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ గురువారం ఈ విషయం వెల్లడించారు. ముంబైలో జరిగిన బోర్డు మార్కెటింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పటేల్ తెలిపారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఒప్పందం అమల్లో ఉంటుంది. ఈ మధ్య కాలంలో భారత్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లతో రెండు అంతర్జాతీయ సిరీస్‌లను టీమిండియా ఆడనుంది. -
అలాంటి వేగం అవసరం ఉంది!
సాక్షి, హైదరాబాద్: ఈఎస్పీఎన్ దేశవ్యాప్తంగా నిర్వహించిన స్పీడ్‌స్టార్ పోటీల ద్వారా అత్యంత వేగవంతమైన బౌలర్‌గా పర్వీందర్ అవానా తొలి సారి వెలుగులోకి వచ్చాడు. సీనియర్ స్థాయిలో కూడా అతను అదే వేగాన్ని నమ్ముకున్నాడు. తొలిసారి ఇంగ్లండ్‌తో రెండు టి20 మ్యాచుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది దేశవాళీలో రాణించి మళ్లీ జట్టులోకి వస్తానని అవానా విశ్వాసంతో ఉన్నాడు. ఢిల్లీ తరఫున మొయినుద్దౌలా టోర్నీలో ఆడేందుకు నగరానికి వచ్చిన అవానా చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే... సన్నాహకాలు, ఫిట్నెస్: ఐపీఎల్లో రెండేళ్లు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడం సంతృప్తినిచ్చింది. అయితే ఆ టోర్నీ తర్వాత మ్యాచ్‌లకు విరామం వచ్చింది. ఈ కాలంలో నేను తీవ్రంగా సాధన చేశాను. బౌలింగ్‌తో పాటు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి సీజన్‌కు ముందు అన్ని రకాలుగా సన్నద్ధమయ్యాను. ఇప్పుడు మొయినుద్దౌలాలో మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుందని భావిస్తున్నా. భారత్ తరఫున విఫలం కావడం: నా ఐపీఎల్ ప్రదర్శనతో పాటు గత ఏడాది కర్ణాటకపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత జట్టులో అవకాశం కల్పించింది. అయితే ఇంగ్లండ్‌తో రెండు టి20ల్లో 100 శాతం కష్టపడినా వికెట్ దక్కకపోవడం నిరాశ కలిగించింది. టీమిండియాతో ఉన్న ఆ కొన్ని రోజులు చాలా నేర్చుకున్నాను. జట్టులో పునరాగమనం: ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడేటప్పుడు భారత్‌కు ఎంపిక కావాలనే ఏకైక లక్ష్యం స్ఫూర్తినిచ్చేది. ఇప్పుడు ఒక సారి మళ్లీ చోటు దక్కించుకోవాలంటే అంతకు రెట్టింపు శ్రమించాలి. రంజీల్లో నిలకడగా ఆడితే భారత జట్టులో మళ్లీ స్థానం లభిస్తుందని విశ్వాసం ఉంది. సాధ్యమైనన్ని ఎక్కువ వికెట్లు తీయడమే నా పని. పేసర్లలో తీవ్రమైన పోటీ ఉండటం: నిజమే, ప్రస్తుతం భారత పేసర్లు చాలా బాగా రాణిస్తున్నారు. బ్రెట్‌లీని విపరీతంగా అభిమానించే నా ప్రధాన బలం వేగమే. గంటకు 140 కి.మీ.కు పైగా వేగంతో నిలకడగా బౌలింగ్ చేస్తున్న ఆటగాళ్లు ఇప్పటికీ భారత్‌లో ఒకరిద్దరే ఉన్నారు. నాలాంటి ఫాస్ట్ బౌలర్ అవసరం టీమ్‌కు ఉందనేది నా నమ్మకం. నా ప్రధాన లక్ష్యం కూడా టెస్టులో చోటు దక్కించుకోవడమే.