టీవీ లైవ్‌ షోలో షాకింగ్‌ ఘటన : వైరల్‌ వీడియో | The moment when part of TV set collapses on journalist | Sakshi
Sakshi News home page

టీవీ లైవ్‌ షోలో షాకింగ్‌ ఘటన : వైరల్‌ వీడియో

Published Fri, Mar 12 2021 11:19 AM | Last Updated on Fri, Mar 12 2021 11:28 AM

The moment when part of TV set collapses on journalist - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: టీవీ లైవ్‌ షోలు, చర్చలు సందర్బంగా  గెస్ట్‌ల మధ్య  వివాదాలు,  తీవ్ర ఘర్షణ, ఒక్కోసారి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం లాంటి అనేక వింత వింత ఘటనలు చోటు చేసుకున‍్న ఉదంతాలను గతంలో అనేకం చూశాం. తాజాగా  కొలంబియాలోని ఓ వార్తా ఛానెల్‌లో లైవ్ షో సందర్భంగా అనూహ్య ఘటన  జరిగింది. ఈ ఊహించని పరిణామానికి అక‍్కుడున్నవారూ  ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.  అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి  ప్రమాదం లేకపోవడంతో అంతా ఊరట చెందారు.

లైవ్ ప్యానెల్ చర్చ సందర్భంగా అనుకోని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో  ఈఎస్‌పీఎన్‌ కొలంబియాకు చెందిన జర్నలిస్ట్‌ కార్లోస్ ఓర్డుజ్ లైవ్ షోలో ప్యానెలిస్టులలో ఒకరు.  చర్చా కార్యక్రమం నడుస్తుండగానే అకస్మాత్తుగగా  టీవీ సెట్‌  కార్లోస్‌పై పడింది. దీంతో  అతను ముందున్న టేబుల్‌ను వేగంగా ఢీకొన్నాడు. ఈ సమయంలో ఎటూ కదల్లేని పరిస్థితుల్లో స్క్రీన్ కిందే  చిక్కుకుపోయాడు.  దీంతో  యాంకర్‌తోపాటు అక్కడున్నవారంతా  దిగ్భ్రాంతికి లోనయ్యారు.  దీంతో యాంకర్.. షోకు కాసేపు విరామం ప్రకటించక తప్పలేదు.  అయితే గాయపడిన జర్నలిస్టు క్షేమంగానే ఉన్నాడని, అతడి ముక్కుకు చిన్న గాయమైందంటూ టీవీ యాంకర్ తెలిపారు. మొత్తానికి జర్నలిస్టు స్వల్ప గాయాలతో తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్‌ అవుతోంది. నెటిజన్లు ఈ ఘటనపై విభిన్నంగా స‍ందిస్తున్నారు. మరోవైపు తాను క్షేమంగానే ఉన్నానంటూ కార్లోస్‌ కూడా ట్వీట్‌ చేశారు. అలాగే తనపై అభిమానం ప్రకటించిన, తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యావాదాలు తెలిపారు.

UPDATE: ESPN anchor Carlos Orduz reassures viewers he is fine after being hit by falling set piece: “I must tell you I am fine, thank God, after a medical check-up and examination, any issue was ruled out, only a bruise and blow to the nose (no fracture).”

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement