వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత పవర్‌ఫుల్ అనేది మరోసారి స్పష్టమైంది. ట్రంప్ టారిఫ్‌ల దెబ్బకు మరో దేశం దిగివచ్చింది. తమ దేశానికి చెందిన వలసదారులను మిలిటరీ విమానాల్లో తీసుకురావడాన్ని అనుమతించమని ప్రకటించిన కొద్ది గంటల్లోనే కొలంబియా వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
ట్రంప్ ఆంక్షల భయంతో అమెరికా మిలిటరీ విమానాలను అనుమతిస్తామని కొలంబియా తెలిపింది. ఈ విషయాన్ని వైట్‌హౌజ్ తాజాగా ఒక అధికార ప్రకటనలో వెల్లడించింది. ‘అక్రమ వలసదారుల విమానాలను మిలిటరీ విమానాలతో సహా అనుమతించడానికి కొలంబియా ఒప్పుకుంది. ఈ పరిణామాల ద్వారా ప్రపంచానికి అమెరికాను గౌరవించాలని స్పష్టమైంది.
అమెరికా సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ట్రంప్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అక్రమ వలసదారులను సాగనంపడాన్ని అన్ని దేశాలు ఒప్పుకుంటాయని ఆయన ఆశిస్తున్నారు’అని వైట్‌హౌజ్ తన ప్రకటనలో తెలిపింది.
కాగా, తమ దేశానికి చెందిన వలసదారులను మిలిటరీ విమానాల్లో పంపడాన్ని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తొలుత వ్యతిరేకించారు. విమానాలను వెనక్కి పంపారు. అయితే ట్రంప్ ఆంక్షల భయంతో ఆయన కొద్ది గంటల్లోనే వెనక్కు తగ్గి డిపోర్టేషన్ విమానాలను అంగీకరించారు. తమ దేశానికి చెందిన వలసదారులను పంపడం కోసం తన ప్రెసిడెన్షియల్ విమానాన్ని కూడా వాడుకునేందుకు ఒప్పుకున్నారు.
ఇదీ చదవండి: కొలంబియాపై ట్రంప్ కొరడా
Comments
Please login to add a commentAdd a comment