India's Cricket Board Invites Bids For Title Sponsor Rights For Its Events - Sakshi
Sakshi News home page

భారీ ఆదాయంపై బీసీసీఐ కన్ను.. టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ టెండర్లకు పిలుపు

Published Tue, Aug 1 2023 9:45 PM | Last Updated on Wed, Aug 2 2023 10:42 AM

India-Cricket Board Invites Bids For Title Sponsor Rights Its Events - Sakshi

బోర్డు ఆఫ్‌ కంట్రోల్‌ క్రికెట్‌ ఇండియా(బీసీసీఐ) మ‌రోసారి భారీ ఆదాయంపై క‌న్నేసింది. టైటిల్ స్పాన్స‌ర్ రైట్స్‌కు బీసీసీఐ ఈరోజు టెండర్ల‌ను ఆహ్వానించింది. ప్ర‌ముఖ‌ కంపెనీల నుంచి ద‌రఖాస్తులు కోరుతున్న‌ట్టు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. జీఎస్టీతో క‌లిపి రూ. ల‌క్ష చెల్లించిన వాళ్ల‌కు మాత్ర‌మే  ఇన్విటేష‌న్ టు టెండ‌ర్ ఫామ్ ఓపెన్ అవుతుంద‌ని వెల్ల‌డించింది.

ఒక‌వేళ టెండ‌ర్ ద‌క్క‌కుంటే క‌ట్టిన డబ్బులు వాప‌సు ఇవ్వ‌బోమ‌ని, ఈ టెండ‌ర్ ద‌ర‌ఖాస్తు ఆగ‌స్టు 21 వ‌ర‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంద‌ని నోటిఫికేష‌న్‌లో బీసీసీఐ స్ప‌ష్టంగా పేర్కొంది. ఆస‌క్తిక‌ల కంపెనీలు పేమెంట్ వివ‌రాల‌ను titlesponsor.itt@bcci.tv మెయిల్‌కు చేయాల‌ని సూచించింది. స్పాన్స‌ర్‌షిప్ ద‌క్కించుకున్న కంపెనీ ఇక‌నుంచి బీసీసీఐ అన్ని కార్య‌క్ర‌మాల‌కు టైటిల్ స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది.

చదవండి: Ishan Kishan: హ్యాట్రిక్‌ అర్థసెంచరీలు.. ఇషాన్‌ కిషన్‌ అరుదైన రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement