టీమిండియా క్రికెట్‌కు త్వరలోనే కొత్త స్పాన్సర్‌షిప్ రానుంది. ఈ మేరకు బీసీసీఐ టీమిండియా లీడ్ స్పాన్సర్స్ హక్కుల కోసం రూ. 350 కోట్ల బేస్‌ప్రైస్‌తో టెండర్లకు ఆహ్వానించింది. బీసీసీఐ జూన్ 14న టెండర్లను రిలీజ్ చేసింది. పోటీకి వచ్చే సంస్థలకు జూన్ 26 వరకు టెండర్లను దక్కించుకునే అవకాశం ఇచ్చింది. ఇటీవలే టీమిండియా టూల్ కిట్ స్పాన్సర్‌గా ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ ఆదిదాస్‌తో బీసీసీఐ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది.
ఈ క్రమంలోనే లీడ్ స్పాన్సర్‌గా కూడా ఎక్కువ కాలం ఉండే సంస్థతోనే ఒప్పందం చేసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే రూ. 350 కోట్లను బేస్‌ప్రైస్‌గా బీసీసీఐ నిర్ణయించడం ఆసక్తి కలిగించింది. గతంలో బైజూస్ సంస్థ టీమిండియాకు స్పాన్సర్స్‌గా వ్యవహరించినప్పుడు భారత జట్టు స్వదేశంలో ఆడే ఒక్కో మ్యాచ్‌కూ రూ.5.07 కోట్లను బైజూస్ చెల్లించేది. అదే ఐసీసీ, ఏసీసీకి సంబంధించిన టోర్నీల్లో అయితే మ్యాచ్‌కు రూ.1.56 కోట్లు చెల్లించేది. కానీ ఈసారి మాత్రం స్పాన్సర్ షిప్ హక్కుల కనీస ధరను బీసీసీఐ బాగా తగ్గించినట్లు తెలుస్తోంది. మరి ఈ హక్కులు ఎవరికి దక్కుతాయో చూడాలి.
కాగా టీమిండియా ఇటీవలే ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎలాంటి స్పాన్సర్స్ లేకుండానే బరిలోకి దిగింది. బీసీసీఐ తక్కువ ధరకే స్పాన్సర్‌షిప్ కోసం టెండర్లను పిలవడం వెనుక ఒక కారణం ఉన్నట్లు సమాచారం. ఖర్చును తగ్గించుకునే పనిలోనే బీసీసీఐ స్పాన్సర్‌షిప్ కొనుగోలు విషయంలో తెలివైన నిర్ణయం తీసుకుందని నిపుణులు అంటున్నారు.
''లీడ్ స్పాన్సర్ హక్కులకు చాలా రియలిస్టిక్‌గా కనీస ధరను బీసీసీఐ నిర్ణయించింది. ఇంతకాలం క్రికెట్‌పై భారీగా ఖర్చు పెట్టిన చాలా మంది స్పాన్సర్లు తమ ఖర్చును భారీగా తగ్గించేసుకుంటున్నారు'' అంటూ అభిప్రాయపడ్డారు.
చదవండి: హరారే స్పోర్ట్స్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం.. ఐసీసీ కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment