Adidas
-
60 వేలమందికి మొబైల్ నెంబర్ ఇచ్చిన సీఈఓ - ఎందుకంటే?
సాధారణంగా ఒక కంపెనీ సీఈఓను కలవాలన్నా.. లేదా మాట్లాడాలన్నా పర్మిషన్ / అపాయింట్మెంట్ వంటి ప్రాసెస్ ఉంటాయి. కానీ ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ కంపెనీ అడిడాస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'బిజార్న్ గుల్డెన్' (Bjorn Gulden) ఇటీవల కంపెనీలో పనిచేసే 60000 మంది ఉద్యోగులకు తన మొబైల్ నెంబర్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. 2023 జనవరిలో అడిడాస్ కంపెనీ సీఈఓగా గుల్డెన్ బాధ్యతలు స్వీకరించిన సమయంలో సంస్థ కొన్ని ఆర్థిక నష్టాల్లో ఉండేది. అంతే కాకుండా అడిడాస్.. అమెరికన్ రాపర్ కాన్యే వెస్ట్‌తో సంబంధాలను తెంచుకుంది. అలాంటి ఒడిదుడుకులను దాటుకుంటూ కంపెనీ లాభాల్లో పయనించేలా చేసిన ఈయన పనిలో పారదర్శకతను పెంచడానికి తన మొబైల్ నెంబర్ ఇచ్చినట్లు వెల్లడించారు. గుల్డెన్ తన మొబైల్ నెంబర్ ఇచినప్పటి నుంచి 200 కాల్స్ వచ్చాయని.. వ్యాపారంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆ కాల్స్ ద్వారా వెల్లడించినట్లు తెలిపారు. 1990 తరువాత గుల్డెన్ అడిడాస్ వదిలి ప్యూమా కంపెనీలో చేరాడు. ఆ తరువాత 2023 జనవరిలో అడిడాస్‌కు తిరిగి వచ్చాడు. గుల్డెన్ తిరిగి కంపెనీయికి రావడంతో సంస్థ షేర్లు దాదాపు రెండింతలు పెరిగినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా కంపెనీ ప్రత్యర్థి నైక్ కంటే మెరుగైన పనితీరు కనబరిచింది. ఇదీ చదవండి: టెక్ దిగ్గజాల్లో అలజడి.. నాలుగు కంపెనీలలో 50000 మంది స్వతహాగా ఫుట్‌బాల్ ఆటగాడైన గుల్డెన్.. కంపెనీలో అనేక మార్పులు చేశారు. సంస్థ ఉత్పత్తులను క్రికెట్ రంగానికి మరింత దగ్గర చేశారు. 2023లో భారత క్రికెట్ జట్టుతో బ్రాండ్ స్పాన్సర్షిప్ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, సంస్థ మూడు నెలల్లో భారతదేశంలో 6,00,00 జెర్సీలను విక్రయించింది. రాబోయే రోజుల్లో అడిడాస్ మరింత వృద్ధి సాదిస్తుందని పలువురు ఆశిస్తున్నారు. -
టీమిండియా వరల్డ్‌కప్ జెర్సీలో మార్పులు.. తేడా గమనించారా..?
భారత క్రికెట్ జట్టు ఇటీవలే అన్ని ఫార్మాట్లలో జెర్సీలను మార్చిన విషయం తెలిసిందే. కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అడిడాస్ వచ్చాక భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టుకు కూడా మూడు ఫార్మాట్లలో వేర్వేరు జెర్సీలను రూపొందించింది. టీ20ల్లో కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్ జెర్సీ, వన్డేల్లో కాలర్‌తో లైట్ బ్లూ కలర్ జెర్సీ, టెస్ట్‌ల్లో వైట్ కలర్ జెర్సీలను అడిడాస్ ప్రవేశపెట్టింది. జెర్సీలపై కుడివైపు తమ (అడిడాస్) లోగోను, ఎడమవైపు టీమ్ లోగో, దానిపై మూడు నక్షత్రాలు, మధ్యలో లీడ్ స్పాన్సర్ డ్రీమ్ 11 పేరు, దాని కింద కాస్త పెద్ద అక్షరాలతో ఇండియా అని ఉంటుంది. జెర్సీపై భుజాల భాగంలో మూడు తెలుపు రంగు అడ్డ గీతలు ఉంటాయి. Indian team jersey for World Cup 2023. pic.twitter.com/q1EYsZebEK — Johns. (@CricCrazyJohns) September 20, 2023 కాగా, వరల్డ్‌కప్ నేపథ్యంలో అడిడాస్ కంపెనీ జెర్సీలో స్వల్ప మార్పులు చేసింది. భుజాలపై ఉన్న మూడు అడ్డ గీతలపై తెలుపు రంగు స్థానంలో తివర్ణ పతాకంలోని మూడు రంగులను (కాషాయం, తెలుపు, ఆకుపచ్చ) ముద్రించింది. అలాగే టీమ్ లోగోపై ఉన్న మూడు నక్షత్రాలను రెండుగా కుదించింది. రెండు నక్షత్రాలు భారత్ రెండు వన్డే వరల్డ్‌కప్‌లు (1983, 2011) గెలిచిన దానికి ప్రతీక అని పేర్కొంది. టీమిండియా కొత్త జెర్సీపై భారతీయత ఉట్టిపడటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తివర్ణంతో కూడిన జెర్సీతో టీమిండియా వరల్డ్‌కప్ గెలవడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. ఆటగాళ్లు కొత్త జెర్సీ ధరించి రూపొందించిన వీడియో అద్భుతమని అంటున్నారు. పాత జెర్సీతో పోలిస్తే, ఇది చాలా కలర్ఫుల్గా ఉందని అంటున్నారు. -
కనీస ధర 350 కోట్లేనా!.. బీసీసీఐ ఎందుకిలా?
టీమిండియా క్రికెట్‌కు త్వరలోనే కొత్త స్పాన్సర్షిప్ రానుంది. ఈ మేరకు బీసీసీఐ టీమిండియా లీడ్ స్పాన్సర్స్ హక్కుల కోసం రూ. 350 కోట్ల బేస్‌ప్రైస్‌తో టెండర్లకు ఆహ్వానించింది. బీసీసీఐ జూన్ 14న టెండర్లను రిలీజ్ చేసింది. పోటీకి వచ్చే సంస్థలకు జూన్ 26 వరకు టెండర్లను దక్కించుకునే అవకాశం ఇచ్చింది. ఇటీవలే టీమిండియా టూల్ కిట్ స్పాన్సర్‌గా ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ ఆదిదాస్‌తో బీసీసీఐ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. ఈ క్రమంలోనే లీడ్ స్పాన్సర్‌గా కూడా ఎక్కువ కాలం ఉండే సంస్థతోనే ఒప్పందం చేసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే రూ. 350 కోట్లను బేస్‌ప్రైస్‌గా బీసీసీఐ నిర్ణయించడం ఆసక్తి కలిగించింది. గతంలో బైజూస్ సంస్థ టీమిండియాకు స్పాన్సర్స్‌గా వ్యవహరించినప్పుడు భారత జట్టు స్వదేశంలో ఆడే ఒక్కో మ్యాచ్‌కూ రూ.5.07 కోట్లను బైజూస్ చెల్లించేది. అదే ఐసీసీ, ఏసీసీకి సంబంధించిన టోర్నీల్లో అయితే మ్యాచ్‌కు రూ.1.56 కోట్లు చెల్లించేది. కానీ ఈసారి మాత్రం స్పాన్సర్ షిప్ హక్కుల కనీస ధరను బీసీసీఐ బాగా తగ్గించినట్లు తెలుస్తోంది. మరి ఈ హక్కులు ఎవరికి దక్కుతాయో చూడాలి. కాగా టీమిండియా ఇటీవలే ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎలాంటి స్పాన్సర్స్ లేకుండానే బరిలోకి దిగింది. బీసీసీఐ తక్కువ ధరకే స్పాన్సర్షిప్ కోసం టెండర్లను పిలవడం వెనుక ఒక కారణం ఉన్నట్లు సమాచారం. ఖర్చును తగ్గించుకునే పనిలోనే బీసీసీఐ స్పాన్సర్షిప్ కొనుగోలు విషయంలో తెలివైన నిర్ణయం తీసుకుందని నిపుణులు అంటున్నారు. ''లీడ్ స్పాన్సర్ హక్కులకు చాలా రియలిస్టిక్‌గా కనీస ధరను బీసీసీఐ నిర్ణయించింది. ఇంతకాలం క్రికెట్‌పై భారీగా ఖర్చు పెట్టిన చాలా మంది స్పాన్సర్లు తమ ఖర్చును భారీగా తగ్గించేసుకుంటున్నారు'' అంటూ అభిప్రాయపడ్డారు. చదవండి: హరారే స్పోర్ట్స్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం.. ఐసీసీ కీలక ప్రకటన -
టీమ్ ఇండియాకు కొత్త జెర్సీ...అడిడాస్ కు 350 కోట్ల కాంట్రాక్టు..!
-
WTC Final: టీమిండియా కొత్త జెర్సీల ఆవిష్కరణ
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌కు ఆరు రోజుల ముందు టీమిండియా కొత్త జెర్సీ విడుదలైంది. భారత జట్టు అఫిషియల్ కిట్ స్పాన్సర్ అడిడాస్ సంస్థనే టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా కూడా వ్యవహరించింది. నైక్ కంపెనీ తర్వాత కిట్ స్పాన్సరే (అడిడాస్) జెర్సీని తయారు చేయడం ఇదే మొదటిసారి. మూడు ఫార్మట్లకు చెందిన భారత జట్టు జెర్సీలను అడిడాస్ సంస్థ ఇవాళ (జూన్ 1) సోషల్‌మీడియా ఖాతాల ద్వారా ఆవిష్కరించి, అభిమానులతో షేర్ చేసుకుంది. An iconic moment, An iconic stadiumIntroducing the new team India Jersey's #adidasIndia #adidasteamindiajersey#adidasXBCCI @bcci pic.twitter.com/CeaAf57hbd— Adidas India (@adidasindiaoffi) June 1, 2023 జెర్సీల ఆవిష్కరణకు సంబంధించి రూపొందించిన ప్రత్యేక యానిమేటెడ్ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తుంది. కొత్త జెర్సీలను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. టీమిండియా కొత్త జెర్సీలు బాగున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో పాత జెర్సీలకు కొత్త వాటికి తేడా లేదని పెదవి విరుస్తున్నారు. కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్లో ఉండే జెర్సీ టీ20లకు.. లైట్ బ్లూ కలర్లో కాలర్‌తో ఉన్న జెర్సీని వన్డేలకు.. వైట్ కలర్ జెర్సీని టెస్ట్‌లకు టీమిండియా ఆటగాళ్లు ధరించనున్నారు. ఇదిలా ఉంటే, జూన్ 7న ఆసీస్‌తో ప్రారంభంకాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఈ కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. పురుషుల క్రికెట్‌తో పాటు మహిళల క్రికెట్లోనూ భారత ఆటగాళ్లు ఇవే జెర్సీలు ధరించనున్నారు. బైజూస్ సంస్థ బీసీసీఐతో ఉన్న కాంట్రాక్ట్‌ను (జెర్సీ స్పాన్సర్) అర్ధంతరంగా రద్దు చేసుకోవడంతో అడిడాస్ కంపెనీ తప్పనిసరి పరిస్థితుల్లో జెర్సీ స్పాన్సర్‌గా కూడా వ్యవహరించింది.ఔ చదవండి: WTC Final: ఆసీస్‌కు అక్కడ అంత సీన్ లేదు.. గెలుపు టీమిండియాదే..! -
భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్‌గా అడిడాస్
చెన్నై: జర్మనీకి చెందిన ప్రముఖ క్రీడా ఉత్పాదనల సంస్థ అడిడాస్ భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ప్రస్తుత స్పాన్సర్ ‘కిల్లర్ జీన్స్’తో కాంట్రాక్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త స్పాన్సర్షిప్ ఇచ్చింది. దీనిపై బోర్డు కార్యదర్శి జై షా మాట్లాడుతూ ‘దేశంలో క్రికెట్ అభివృద్ధి అంచనాలను మించుతుంది. కాబట్టి ప్రపంచశ్రేణి సంస్థ మాతో జట్టు కట్టడంపై పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు’ అని అన్నారు. జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ అయిన అడిడాస్‌తో ఒప్పందం ఎన్నేళ్లు, ఎంత మొత్తానికి స్పాన్సర్షిప్ పొందిందనే వివరాలేవీ ఆయన వెల్లడించలేదు. విశ్వసనీయ వర్గాల ప్రకారం రూ. 350 కోట్లతో అడిడాస్ కిట్ స్పాన్సర్షిప్ దక్కించుకున్నట్లు తెలిసింది. టీమిండియా వచ్చే నెల 7 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడుతుంది. ఆ జెర్సీలపై అడిడాస్ లోగో కనిపించనుంది. టీమ్ స్పానర్ బైజుస్ కూడా మారుతున్నట్లు తెలిసింది. ఈ నవంబర్ వరకు గడువున్నప్పటికీ సదరు సంస్థ ముందుగానే వైదొలగనుండటంతో త్వరలోనే బిడ్లను ఆహ్వానిస్తారు. -
టీమిండియా కొత్త కిట్ స్పాన్సర్‌గా అడిడాస్
ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా కొత్త కిట్ స్పాన్సర్‌గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్‌తో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకు బైజూస్ సంస్థ భారత జట్టుకు కిట్‌ను స్పాన్సర్ చేస్తుండగా.. ఇకపై ఆ స్ధానంలో అడిడాస్ కిట్స్‌ను అందించనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్ వేదికగా వెల్లడించారు. అడిడాస్ సుదీర్ఘకాలం పాటు భారత జట్టు కిట్ స్పాన్సర్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. "భారత జట్టు కిట్ స్పాన్సర్‌గా అడిడాస్‌తో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. పంచంలో నెం1 స్పోర్ట్స్ గూడ్స్ సంస్థ అడిడాస్‌తో జతకట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. భారత క్రికెట్‌ను మరింత అభివృద్ది చేసేందుకు ప్రయత్నిస్తున్నాం" అని జైషా ట్విటర్లో పేర్కొన్నారు. చదవండి: Virat Kohli: వరుస సెంచరీలు! గొప్పగా అనిపిస్తోంది.. వాళ్లకేం తెలుసు?: కోహ్లి I'm pleased to announce @BCCI's partnership with @adidas as a kit sponsor. We are committed to growing the game of cricket and could not be more excited to partner with one of the world’s leading sportswear brands. Welcome aboard, @adidas — Jay Shah (@JayShah) May 22, 2023 -
BCCI: మరో కీలక మార్పు.. డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి అమల్లోకి!
Team India New Jersey: టీమిండియా జెర్సీ మరోసారి మారబోతోందా? అంటే అవుననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. ప్రఖ్యాత యూరోప్ బ్రాండ్ అడిడాస్ రూపొందించనున్న జెర్సీల్లో భారత ఆటగాళ్లు త్వరలోనే దర్శనమివ్వనున్నట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అడిడాస్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపాయి. కాగా 2016- 2020 మధ్య కాలంలో నైకీ టీమిండియా కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక నాలుగేళ్ల కాలానికి గానూ ఎంపీఎల్ స్పోర్ట్స్(మొబైల్ ప్రీమియర్ లీగ్) 370 కోట్ల రూపాయల భారీ ఒప్పందంతో టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అయితే, గతేడాది డిసెంబరులో తమ హక్కులను మరో సంస్థకు బదలాయించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎంపీఎల్ బీసీసీఐని కోరింది. మార్చి వరకు ఒప్పందం ఉన్న నేపథ్యంలో.. కేవల్ కిరణ్ క్లాతింగ్ లిమిటెడ్(కేకేసీఎల్) సీన్లోకి వచ్చింది. దీంతో.. శ్రీలంకతో సిరీస్‌నుంచి కేకేసీఎల్ తమ పాపులర్ బ్రాండ్ ‘కిల్లర్ జీన్స్’ లోగోను ప్రదర్శించింది. అయితే, ఈ కేకేసీఎల్ ఒప్పందం పూర్తైన తర్వాత ప్రముఖ బ్రాండ్ అడిడాస్‌తో చేతులు కలిపేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు న్యూస్18 వెల్లడించింది. ఈ క్రమంలో జూన్ 1 నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చే విధంగా ప్రణాళికలు రచిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో జూన్ 7 నుంచి జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో రోహిత్ సేన అడిడాస్ జెర్సీలో కనిపించనున్నట్లు తన కథనంలో పేర్కొంది. కాగా ఇప్పటికే ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ సహా ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌కు అడిడాస్ జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అంతేగాక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్‌లతో అడిడాస్‌కు గతంలో ఒప్పందం ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నాటింగ్హాంషైర్, సౌత్ ఈస్ట్ స్టార్స్, సర్రే జట్లకు జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న అడిడాస్.. త్వరలోనే టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా మారనున్నట్లు సమాచారం. చదవండి: Steve Smith: గిల్‌కు అంత సీన్ లేదు.. ప్రపంచ క్రికెట్‌ను శాసించబోయేది అతడే..! IND vs AUS: టీమిండియాను ఓడించడానికి సాయం చేస్తా.. ఒక్క రూపాయి కూడా వద్దు! -
అడికి...అజిత్ బ్రో లాజిక్కే! ఆనంద్ మహీంద్ర హిల్లేరియస్ ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: ఏదైనా ఒక బ్రాండ్ పాపులర్ కాగానే దానికి సంబంధించి నకిలీలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తాయి. అసలేదో నకిలీ ఏదో గమనించలేనంత పకడ్బందీగా లోగో, బ్రాండ్పేరుతో సహా నకిలీ ఉత్పత్తులు మార్కెట్లో హల్ చల్ చేస్తుంటాయి. ఈ విషయంపైనే పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర తనదైన శైలిలో స్పందించారు. స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్ బ్రాండింగ్‌ను పోలి ఉన్న ప్రొడక్ట్‌ను ట్వీట్ చేశారు. హిలేరియస్ కామెంట్ జత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. (Google Layoffs ఉద్యోగులకు షాకింగ్ న్యూస్: 10 వేలమంది ఇంటికే!) లోగో, ట్రేడ్‌మార్క్‌తో అడిడాస్ షూస్ ను పోలిఉన్న పోస్ట్‌ను మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ట్విటర్లో షేర్ చేశారు. నిశితంగా పరిశీలిస్తే తప్ప నకిలీ షూపై అడిడాస్‌కు బదులుగా "అజిత్‌దాస్" అని ఉండటాన్ని మనం గమనించవచ్చు. దీంతో ఇది లాజిక్కే... అడికి అజిత్ అనే సోదరుడు ఉన్నాడని అర్థం. వసుధైక కుటుంబం అంటూ చేసిన ఆనంద్ మహీంద్ర ట్విట్ వైరల్‌గా మారింది. (Twitter Hirings ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మస్క్: ఇండియన్ టెకీలకు గుడ్ న్యూస్) Completely logical. It just means that Adi has a brother called Ajit. Vasudhaiva Kutumbakam? 😊 pic.twitter.com/7W5RMzO2fB — anand mahindra (@anandmahindra) November 22, 2022 Here are more pic.twitter.com/DdBfTluKnt — Sir Kazam (@SirKazamJeevi) November 22, 2022 pic.twitter.com/2K9NvbFUqH — $€€£ (@deep_befriend) November 22, 2022 -
నీ గొడుగు సల్లగుండ..ధర లక్షరూపాయలంట! ఏముంది ఇందులో!
ట్రెండ్‌కు తగ్గట్లు నేటి యువత ప్యాషన్‌గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. నుదుటున పెట్టుకొనే కుంకుమ బొట్టు దగ్గర నుంచి సమ్మర్ సీజన్లో ఎండ వేడిమిని తట్టుకునేందుకు వినియోగించే గొడుగు వరకు..ఇలా ప్రతిదీ ఫ్యాషన్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లు ఫ్యాషన్ బ్రాండెడ్ సంస్థలు ప్రొడక్ట్‌లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. తాజాగా ఫ్యాషన్ లగ్జరీ బ్రాండ్ గుచీ, స్పోర్ట్స్ బ్రాండ్ సంస్థ అడిడాస్‌లు సంయుక్తంగా ఓ గొడుగును మార్కెట్లో విడుదల చేశాయి. ఇప్పుడీ గొడుగు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ⚠️warning!🤣⛽️ ☔️Umbrellas are not waterproof!#adidasxGucci @adidasoriginals @gucci #VirtualWorld #REALITY #Blockchain #CryptocurrencyNews #Metaverse #NFTCommunity #NFTcollectibles #NFTartist #nftcollector pic.twitter.com/xmudzHHxrW — cubist👽🐼🧛♂️🧟♂️🧚♀️🤖 (@cubist_pg) May 13, 2022 అడిడాస్ ఎక్స్ గూచీ కలెక్షన్ పేరుతో స్పెషల్‌గా తయారు చేసిన ఈ గొడుగును ఆన్లైన్లో అమ్మకానికి పెట్టింది.1,644 డాలర్లు(భారత కరెన్సీలో రూ1,27,407.12) చైనా గూచీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఈ గొడుగు స్పెషాలిటీ ఏంటో తెలుసా? వర్షం కురుస్తున్నప్పుడు తడవకుండా ఉండేందుకు గొడుగును వినియోగిస్తాం.కానీ ఈ ఫ్యాషన్ సంస్థలు అమ్మకానికి పెట్టిన ఈ గొడుగును వర్షంలో వినియోగించడానికి కాదంట. "దయచేసి గమనించండి, ఈ గొడుగు వర్షంలో తడవకుండా ఉండేందుకు కాదు. సూర్యుడి నుంచి రక్షణ లేదంటే అలంకరణ కోసమే ఉపయోగించుకోవచ్చని తెలిపింది. గొడుగు అమ్మకం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజట్లు తమదైన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు. వర్షంలో వినియోగించేందుకు పనిచేయని గొడుగును ఇంత ధరకు అమ్మడం ఏంటని మండి పడుతున్నారు. చదవండి👉‘35 వేలా? ఏముంది ఇందులో.. రూ.150కే దొరుకుతుంది’ -
అడిడాస్ సంచలన నిర్ణయం..! ఫేస్‌బుక్‌కు పెద్ద దెబ్బే..!
జపాన్ స్పోర్ట్స్ షూ మేకింగ్ దిగ్గజం అడిడాస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్‌తో పోటాపోటీగా సొంతంగా మెటావర్స్ టెక్నాలజీని డెవలప్ చేసే పనిలో పడింది. దీంతో పాటు అమెరికాకు చెందిన క్రిప్టో కరెన్సీ ఎక్ఛేంజ్ సంస్థ కాయిన్ బేస్‌తో చేతులు కలిపింది. ఈ ఒప్పొందంపై అడిడాస్ ట్విట్ చేయగా... కాయిన్ బేస్ స్పందించింది. హ్యాండ్ షేక్ ఎమోజీని రీట్వీట్ చేస్తూ డీల్‌ను కాన్ఫాం చేసింది. ఇకపై ఈ రెండు సంస్థలు కలిపి క్రిప్టో కరెన్సీపై ట్రేడింగ్ నిర్వహించనున్నాయి. ఫేస్బుక్(మెటా) అధినేత మార్క్ జుకర్ బెర్గ్ మెటావర్స్ టెక్నాలజీపై వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే టెక్నాలజీని పలు దిగ్గజ కంపెనీలు సైతం డెవలప్ చేసే పనిలో పడ్డాయి. తాజాగా కు చెందిన అడిడాస్ 'అడివెర్స్' పేరుతో మొబైల్ గేమింగ్ సంస్థ 'శాండ్ బాక్స్'తో కలిసి మెటావర్స్‌పై పనిచేస్తున్నట్లు నవంబర్ 22న ట్వీట్ చేసింది. ఇక అడిడాస్ రాకతో మెటావర్స్‌పై వర్క్ చేస్తున్న ఫేస్‌బుక్‌కు పోటీ పెరగనుంది. ఇప్పటికే మైక్రోసాప్ట్, గూగుల్, ఆలిబాబా వంటి సంస్థలు మెటావర్స్‌పై పనిచేస్తుండగా..ఆ కంపెనీల బాటలో అడిడాస్ చేరినట్లైంది. శాండ్బాక్స్ శాండ్బాక్స్ ప్లే టు ఎర్న్ బ్లాక్‌చెయిన్ గేమ్. డిజిటల్ ఆస్తులను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి అనుమతిస్తుంది. శాండ్ యుటిలిటీ టోకెన్ ప్లాట్‌ఫారమ్‌లో లావాదేవీలను సులభతరం చేస్తుంది. కాగా ఏడాది నుంచి ఇప్పటి వరకు శాండ్ బాక్స్ వ్యాల్యూ 15,000శాతానికి పైగా పుంజుకుంది. దీంతో మార్కెట్ క్యాపిటల్ వ్యాల్యూ $4.8 బిలియన్లకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
అమ్మకానికి రీబాక్.... ఆడిడాస్ సంచలన నిర్ణయం
స్పోర్ట్స్‌వేర్ ఉత్పత్తుల సంస్థ రీబాక్ అమ్మకానికి వచ్చింది. దాదాపు వందేళ్లకు పైబడి కొనసాగుతున్న ఈ ప్రముఖ బ్రాండ్ యాజమాన్యం మరోసారి మారనుంది. ఇందుకు సంబంధించిన చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. రీబాక్ బ్రాండ్ తెలియని యూత్, స్పోర్ట్స్ పర్సన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. దాదాపు నూట ఇరవై ఆరేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో పాదరక్షలు, స్పోర్ట్స్ వేర్, ఫిట్నెస్ కేర్‌లో రీబాక్ బ్రాండ్ ఉత్పత్తులకు ప్రత్యేక స్థానం ఉంది. అమెరికా బాస్కెట్‌బాల్ లీగ్ ఎన్బీఏతో రీబాక్కి ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రస్తుతం ఈ బ్రాండ్‌ని 2.5 బిలియన్ డాలర్లకు అథెంటిక్ బ్రాండ్స్ గ్రూప్ (ఏబీజీ) సొంతం చేసుకోనుంది. రీబాక్ బ్రాండ్‌ని మరో ప్రముఖ స్పోర్ట్స్ వేర్ సంస్థ అడిడాస్ 2006లో 3.8 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. నైక్‌కి పోటీగా రీబాక్‌ను తీర్చిదిద్దేంకు ప్రయత్నించింది. అయితే ఆడిడాస్ చేతిలోకి వెళ్లిన తర్వాత రీబాక్ వ్యాపారం బాగా దెబ్బతింది. దీంతో ఆడిడాస్లోని ఇన్వెస్టర్లు రీబాక్‌ను అమ్మాలంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో రీబాక్ బ్రాండ్‌ను వదిలించుకునేందుకు అడిడాస్ సిద్ధమైంది. -
అజియో బిగ్ బోల్డ్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్
ట్రెండ్స్, సరికొత్త స్టైల్స్‌కు ఖ్యాతిగాంచిన భారతదేశంలోని ప్రముఖ ఆన్లైన్ ఫ్యాషన్ ఈ-రిటెయిలర్ అజియో జూలై 1, 2021 నుంచి జూలై 5, 2021 వరకు ఫ్యాషన్ శ్రేణి అమ్మకం బిగ్ బోల్డ్ సేల్ నిర్వహిస్తోంది. పేరుకు తగ్గట్టుగానే ఈ అజియో బిగ్ బోల్డ్ సేల్ ఫ్యాషన్‌కు సంబంధించి ఇప్పటి వరకు లేని భారీ, బోల్డెస్ట్ సేల్. 2500పైగా బ్రాండ్లకు చెందిన 6,00,000 స్టైల్స్‌పై 50 శాతం నుంచి 90 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. దేశంలోని ప్రతీ కస్టమర్ కొనుగోలు చేసేందుకు వీలుగా ఇప్పటి వరకు చూడని ధరలు, ప్రతీ గంటకు స్పెషల్ డీల్స్, రివార్డులు, పాయింట్లను అజియో బిగ్ బోల్డ్ సేల్ అందిస్తోంది. ప్రపంచ ఖ్యాతిగాంచిన బ్రాండ్లు నైకీ, ప్యూమా, అడిడాస్, లివైస్, యూనైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్కు చెందిన స్టైల్స్ అతి తక్కువ ధరలో పొందవచ్చు. ఈ మెగా ఈవెంట్ ద్వారా ఫ్యాషన్ ప్రపంచపు సుందరి సోనమ్ కపూర్, ఫ్యాషన్ ఐకాన్స్ గురు రణధావ, శృతి హాసన్, కాజల్ అగర్వాల్, మౌనీ రాయ్ అమ్మకాలను ఉత్తేజితం చేస్తారు. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒకటి అందించేలా పాపులర్ శ్రేణులైన టీ-షర్ట్స్, జీన్స్, కుర్తాలు, స్నీకర్స్పై 50 నుంచి 90 శాతం వరకు ఆఫ్ సహ అన్ని స్టైల్స్‌పై తగ్గింపు ధరలను చూడవచ్చు. ధరల తగ్గింపు మాత్రమే కాదు ఈ సేల్ సందర్భంగా అనేక ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌ను అజియో ప్రారంభిస్తోంది. దేశంలోని ఫ్యాషన్ ప్రియులకు సరైన వేదికగా నిలుస్తున్న అజియో, స్త్రీలు, పురుషుల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన దుస్తులు, యాక్సెసరీ కలెక్షన్స్ అందిస్తోంది. చదవండి: జూలై 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఇవే! -
అర్థరాత్రి బీభత్సం, మాజీమంత్రిని తాళ్లతో కట్టేసి మరీ
పారిస్ : ఫ్రెంచ్ వ్యాపారవేత్త , మాజీ మంత్రి, మిలియనీర్ బెర్నార్డ్ టాపీ(78)కి తృటిలో అతిపెద్ద ప్రమాదం తప్పింది. అడిడాస్ మాజీ యజమాని కూడా అయిన టాపీ ఇంటిపై దొంగలు చోరికి తెగబడ్డారు. ఈ సందర్భంగా టాపీ దంపతులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టాపీతోపాటు ఆయన భార్య డొమినిక్ కూడా గాయాల పాలయ్యారు. అయితే డొమినిక్ టాపీ ఎలాగోలా తప్పించుకుని పొరుగువారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. పారిస్ సమీపంలోని కాంబ్స్-లా-విల్లేలోని ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ కన్నుగప్పి విలాసవంతమైన "మౌలిన్ డి బ్రూయిల్" భవనం మొదటి అంతస్తులోని కిటికీ గుండా నలుగురు వ్యక్తులు ప్రవేశించారు. అనంతరం బెర్నార్డ్ టాపీ దంపతులను ఎలక్ట్రికల్ తాళ్ళతో కట్టేసి మరీ దాడికి పాల్పడ్డారు. అయితే ఇద్దరూ స్వల్ప గాయాలతో బయట పడ్డారని టాపీ మనువడు రోడోల్ఫ్ టాపీ చెప్పారు. అటు ఈ ఘటనను హింసాత్మక దోపిడీగా పోలీసులు భావిస్తున్నారు. అతి ఖరీదైన రోలెక్స్ వాచీలు,ఇత ఢైమండ్ ఆభరణాలను అపహకరించికు పోయినట్టు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు ప్రకటించారు. కాగా 1992 లో ఫ్రాంకోయిస్ మిట్టర్రాండ్ ప్రభుత్వంలో కొంతకాలం పట్టణ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన టాపీ కెరీర్ ప్రారంభంలో వివాదాల్లో చిక్కుకున్న సంస్థలను కొనుగోలు చేసి క్రీడా, మీడియా సామమ్రాజ్యాన్ని విస్తరించాడు. కానీ ఆ తరువాత అవినీతి, పన్ను మోసం, కార్పొరేట్ ఆస్తులను దుర్వినియోగం లాంటి కేసులలో దోషిగా తేలాడు. ఈ కేసు అప్పటి ఆర్థికమంత్రి క్రిస్టిన్ లాగార్డ్ మెడకు కూడా చుట్టుకోవడం ప్రకంపనలు రేపింది. ఈ కేసులో ఐదు నెలలు శిక్ష తరువాత 1997 లో జైలు నుండి విడుదలయ్యాడు. దీనికి తోడు 1993లో అడిడాస్ స్పోర్ట్స్ అపెరల్ కంపెనీలో తన వాటాను ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఫ్రెంచ్ బ్యాంక్ క్రెడిట్ లియోనైస్కు విక్రయించడం పెద్ద దుమారమే సృష్టించింది. ఈ ఆరోపణలు కొనసాగుతుండగానే 2012 లో దక్షిణ ఫ్రెంచ్ దినపత్రిక లా ప్రోవెన్స్ , ఇతర పత్రికలను స్వాధీనం చేసుకుని మీడియా బాస్‌గా అవతరించాడు. అనంతరం ఫ్రాన్స్ టాప్ ఫుట్‌బాల్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా 400 మిలియన్ యూరోల విలువైన (సుమారు 470 మిలియన్ డాలర్లు) అతిపెద్ద కుంభకోణం కేసులో విచారణను ఎదుర్కుంటున్నాడు. అయితే టాపీ (కడుపు క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్) అనారోగ్యం కారణంగా విచారణ వాయిదా పడింది. ఈ ఏడాది మేలో ఈ కుంభకోణంపై విచారణ తిరిగి ప్రారంభం కానుందని అంచనా. -
హిమ దాస్‌కు అడిడాస్ స్పాన్సర్షిప్
న్యూఢిల్లీ: భారత స్టార్ అథ్లెట్ హిమ దాస్‌కు ప్రముఖ క్రీడా పరికరాల సంస్థ అడిడాస్ స్పాన్సర్షిప్ చేస్తుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈ అస్సాం స్ప్రింటర్తో ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా 18 ఏళ్ల హిమకు అడిడాస్ కిట్ స్పాన్సర్ చేస్తుంది. ఫిన్ లాండ్లో జరిగిన ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచిన భారత అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆసియా క్రీడల్లో స్వర్ణంతో పాటు రెండు రజతాలు గెలిచింది. అందుకే అడిడాస్ కంపెనీ ఆమె కోసమే ప్రత్యేకంగా ప్రీమియం షూస్‌ను తయారు చేసి ఇచ్చింది. ఒక బూటుపై ప్రముఖంగా ‘హిమ దాస్’ అని... ఇంకోదానిపై ‘క్రియేట్ హిస్టరీ’ అని ముద్రించింది. ఈ సందర్భంగా ‘అడిడాస్ కుటుంబంలో చేరడం గర్వంగా ఉంది. అంతర్జాతీయ అథ్లెట్ల గ్రూపులో ఇప్పుడు నేను భాగమైనందుకు ఆనందపడుతున్నా. క్రీడా ప్రపంచంలో ఎంతో మందికి ఈ సంస్థ అండగానిలుస్తోంది. అడిడాస్ స్పాన్సర్‌షిప్‌తో నేను రెట్టించిన ఉత్సాహంతో రాణిస్తా. నా ప్రదర్శనను మెరుగుపర్చుకుంటా’ అని హిమ చెప్పింది. -
బయోస్టీల్ జోళ్లు!
వాడేసిన తరువాత కాలిజోళ్లు కుళ్లిపోయి... భూమిలోకి కలిసిపోయేందుకు ఎంతకాలం పడుతుందో మీకు తెలుసా? కొంచెం అటూ ఇటుగా 80 ఏళ్లు! ఈలోపు అక్కడి నేల, నీరు మొత్తం కలుషితమైపోవాల్సిందే. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఒక మార్గం మా కాలిజోళ్లు అంటోంది అడిడాస్. ఫొటోలో కనిపిస్తున్నాయే... అవి అలాంటివే. జర్మనీలోని ఓ కంపెనీ తయారు చేసిన పట్టు లాంటి బయోప్లాస్టిక్ పదార్థంతో ఇది తయారవుతుంది. బయోస్టీల్ అని పిలుస్తున్న ఈ పదార్థం పేరుకు తగ్గట్టుగానే ఉక్కు మాదిరిగా దృఢంగా ఉంటూనే.. వాడేసిన తరువాత వేగంగా కుళ్లిపోయి మట్టిలో కలిసిపోతుంది. అంతేకాకుండా ఇది సాధారణ షూలతో పోలిస్తే 15 శాతం తేలికగా ఉంటుందనీ, పైగా చౌక కూడా అనీ అంటోంది అడిడాస్. న్యూయార్క్‌లో ఇటీవల జరిగిన బయోఫ్యాబ్రికేట్ సదస్సులో ఈ సరికొత్త కాలిజోళ్లను అడిడాస్ అందరికీ పరిచయం చేసింది. అయితే ఎప్పుడు ఉత్పత్తి చేయడం మొదలుపెడతారు? ఖరీదు ఎంత ఉంటుంది? అన్నదానిపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. -
అదీదాస్
పేరులో నేముంది స్పోర్ట్స్ షూస్, దుస్తులు, యాక్సెసరీస్ తయారీలో ప్రపంచవ్యాప్తంగా చిరపరిచితమైన బ్రాండ్ ఇది. అమెరికాలో చాలాకాలం ఈ పేరును ‘అడీదస్’ అని పొరపాటుగా పలికేవారు. భారత్, పాకిస్థాన్ వంటి దేశాల్లోనైతే ‘ఆదిదాస్’ అని, ‘అడీడాస్’ అని పలికేవారు. ‘అదీదాస్’ కంపెనీని జర్మన్ పారిశ్రామికవేత్త అడాల్ఫ్ దాస్లెర్ 1949లో ప్రారంభించారు. ఆయన పేరులోని మొదటి పదంలోని తొలి మూడు అక్షరాలు, రెండో పదంలోని తొలి మూడు అక్షరాలు కలిపి కంపెనీకి ఈ పేరు పెట్టారు. జర్మనీలో ఈ పదానికి ప్రత్యేకంగా ఎలాంటి అర్థం లేకపోయినా, క్రీడా ప్రపంచంలో ఇది అచిరకాలంలోనే స్పోర్ట్స్ షూస్, యాక్సెసరీస్‌కి పర్యాయపదంగా మారింది. -
‘మెంటర్’గా మాస్టర్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన అనంతరం సచిన్ టెండూల్కర్ మరోసారి ఆటతో నేరుగా మమేకం కానున్నాడు. ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ ‘అడిడాస్’ రూపొందించిన కార్యక్రమంలో భాగంగా అతను కొత్త తరం యువ ఆటగాళ్లకు మెంటర్‌గా వ్యవహరించనున్నాడు. ఇందు కోసం దేశవ్యాప్తంగా 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఈ జాబితాలో జమ్మూ కాశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్, భారత అండర్-19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ ఉన్నారు. వీరు కాకుండా ఇప్పటికే భారత జట్టులో కీలక ఆటగాళ్లు అయిన కోహ్లి, రోహిత్ శర్మ, రైనాలతో కూడా అడిడాస్ గతంలోనే ఒప్పందం కుదుర్చుకుంది. ‘ఇదో కొత్త తరహా ఆలోచన. యువ ఆటగాళ్లు తమ లక్ష్యాలను చేరుకునేందుకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ క్రికెటర్లకు మెంటర్‌గా వ్యవహరించడం అంటే నాకెంతో ఇష్టమైన క్రికెట్‌కు చేరువగా ఉండటంతో పాటు...నా వైపునుంచి ఆటకు సేవ చేయడం కూడా’ అని సచిన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. ఈ కార్యక్రమం కోసం ‘అడిడాస్’ సంస్థ... ఉన్ముక్త్, రసూల్, విజయ్ జోల్, మనన్ వోహ్రా, మన్‌ప్రీత్ జునేజా, రుష్ కలారియా, చిరాగ్ ఖురానా, ఆకాశ్‌దీప్ నాథ్, వికాస్ మిశ్రా, సర్ఫరాజ్ ఖాన్, బాబా అపరాజిత్లను ఎంపిక చేసింది. -
ఆడినా.. ఆడకున్నా సచిన్‌తోనే..
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ.. ఆయన వెన్నంటే ఉంటామంటున్నాయి పలు కంపెనీలు. సచిన్ ఆడినా.. ఆడకున్నా బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయనతో తమ ఒప్పందాల్లో మార్పులేమీ ఉండబోవంటున్నాయి. రిటైర్మెంట్ తర్వాత కూడా దీర్ఘకాలం ఆయనతో అనుబంధం కొనసాగిస్తామని ఆ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం అడిడాస్, కోక కోలా, ఫ్యూచర్ గ్రూప్, తోషిబా, అవైవా ఇండియా, ఎస్ఏఆర్ గ్రూప్ వంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘సచిన్‌తో జీవితకాల అనుబంధం ఉంటుంది. తను ఆడినా, ఆడకున్నా ఈ అనుబంధంపై ప్రతికూల ప్రభావాలేమీ ఉండవు. తను చాలా స్పెషల్’ అని అడిడాస్ ఇండియా బ్రాండ్ డెరైక్టర్ తుషార్ గోకుల్దాస్ చెప్పారు. అటు కోక కోలా ఇండియా కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సచ్ బ్రాండ్ టూత్‌పేస్టులు వంటి ఉత్పత్తులకు సంబంధించి సచిన్‌తో అనుబంధం ఆయన రిటైర్మెంట్ తర్వాతా కొనసాగుతుందని ఫ్యూచర్ బ్రాండ్స్ ఎండీ సంతోష్ దేశాయ్ చెప్పారు. ఎండార్స్మెంట్ల సంఖ్య కాస్త తగ్గితే తగ్గొచ్చు కానీ.. రిటైరైనా సచిన్ బ్రాండ్ విలువకు ఢోకా ఉండబోదని దేశాయ్ అభిప్రాయపడ్డారు.