BCCI Announce Adidas as New Kit Sponsor for Indian Team - Sakshi
Sakshi News home page

టీమిండియా కొత్త కిట్ స్పాన్సర్‌గా అడిడాస్‌

May 22 2023 1:37 PM | Updated on May 22 2023 1:51 PM

BCCI announce Adidas as new kit sponsor for Indian team - Sakshi

PC: IPL.com

ఆస్ట్రేలియాతో వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా కొత్త కిట్ స్పాన్సర్‌గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్‌తో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకు బైజూస్ సంస్థ భారత జట్టుకు కిట్‌ను స్పాన్సర్‌ చేస్తుండగా.. ఇకపై ఆ స్ధానంలో అడిడాస్‌ కిట్స్‌ను అందించనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

అడిడాస్‌ సుదీర్ఘకాలం పాటు భారత జట్టు కిట్ స్పాన్సర్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. "భారత జట్టు కిట్‌ స్పాన్సర్‌గా అడిడాస్‌తో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది.  పంచంలో నెం1 స్పోర్ట్స్ గూడ్స్ సంస్థ అడిడాస్‌తో జతకట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. భారత క్రికెట్‌ను మరింత అభివృద్ది చేసేందుకు ప్రయత్నిస్తున్నాం" అని జైషా ట్విటర్‌లో పేర్కొన్నారు.
చదవండి: Virat Kohli: వరుస సెంచరీలు! గొప్పగా అనిపిస్తోంది.. వాళ్లకేం తెలుసు?: కోహ్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement