Cricket Kit
-
టీమిండియా కొత్త కిట్ స్పాన్సర్‌గా అడిడాస్
ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా కొత్త కిట్ స్పాన్సర్‌గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్‌తో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకు బైజూస్ సంస్థ భారత జట్టుకు కిట్‌ను స్పాన్సర్ చేస్తుండగా.. ఇకపై ఆ స్ధానంలో అడిడాస్ కిట్స్‌ను అందించనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్ వేదికగా వెల్లడించారు. అడిడాస్ సుదీర్ఘకాలం పాటు భారత జట్టు కిట్ స్పాన్సర్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. "భారత జట్టు కిట్ స్పాన్సర్‌గా అడిడాస్‌తో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. పంచంలో నెం1 స్పోర్ట్స్ గూడ్స్ సంస్థ అడిడాస్‌తో జతకట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. భారత క్రికెట్‌ను మరింత అభివృద్ది చేసేందుకు ప్రయత్నిస్తున్నాం" అని జైషా ట్విటర్లో పేర్కొన్నారు. చదవండి: Virat Kohli: వరుస సెంచరీలు! గొప్పగా అనిపిస్తోంది.. వాళ్లకేం తెలుసు?: కోహ్లి I'm pleased to announce @BCCI's partnership with @adidas as a kit sponsor. We are committed to growing the game of cricket and could not be more excited to partner with one of the world’s leading sportswear brands. Welcome aboard, @adidas — Jay Shah (@JayShah) May 22, 2023 -
బీసీసీఐ ఇలా అస్సలు ఊహించి ఉండదు!
ముంబై: ఎంతటి కరోనా కాలమైనా సరే... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇలాంటి స్పందన మాత్రం అస్సలు ఊహించి ఉండదు! భారత క్రికెట్ జట్టుకు ఉన్న పాపులార్టీ, ఆటగాళ్లు గర్వంగా ధరించే టీమ్ జెర్సీ, కిట్లను స్పాన్సర్ చేసేందుకు పెద్ద పెద్ద సంస్థలే ‘క్యూ’ కడతాయని భావించిన బోర్డుకు తిరస్కరణ ఎదురైంది. మరో భారీ స్పాన్సర్షిప్ వేటలో ప్రతిష్టాత్మక ‘నైకీ’ సంస్థకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వడానికి అంగీకరించకుండా బిడ్లు కోరిన బోర్డుకు గట్టి దెబ్బ తగిలింది. కిట్ స్పాన్సర్షిప్ కోసం పోటీ పడిన నాలుగు సంస్థల్లో ఒక్కరు కూడా ‘ఫైనాన్షియల్ బిడ్’ వేయలేదు. 14 ఏళ్లు భారత కిట్‌ను స్పాన్సర్ చేసిన నైకీతో పాటు అడిడాస్, ప్యూమాలాంటి దిగ్గజ స్పోర్టింగ్ కంపెనీలు, డ్రీమ్ ఎలెవన్‌కే చెందిన ఫ్యాన్ కోడ్ సంస్థ ప్రాధమికంగా ఆసక్తి చూపించి బిడ్లు కొనుగోలు చేశాయి. అయితే అసలు సమయానికి వీరంతా వెనక్కి తగ్గడం విశేషం. నిజానికి ఇప్పటి వరకు నైకీ ప్రతీ అంతర్జాతీయ మ్యాచ్‌కు బీసీసీఐ రూ. 85 లక్షల చొప్పున చెల్లిస్తూ వచ్చింది. దీనికి తగ్గించి బేస్ బ్రైస్‌ను రూ. 65 లక్షలకు చేసినా సరే... ఎవరూ ముందుకు రాకపోవడం పరిస్థితిని సూచిస్తోంది. రాబోయే రోజుల్లో బ్రాండింగ్ ప్రమోషన్ విషయంలో బీసీసీఐ తమకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో వీరంతా స్పాన్సర్షిప్ నుంచి దూరం జరిగినట్లు సమాచారం. నిజానికి ఐపీఎల్ తర్వాత ఏమిటనే విషయంలో బోర్డు వద్దే సరైన ప్రణాళిక కొరవడిన ఫలితమే ఇది. -
కిట్ స్పాన్సర్ బరిలో పూమా
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్షిప్ రేసులో జర్మనీకి చెందిన ప్రముఖ సంస్థ పూమా నిలిచింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. బిడ్‌లో పాల్గొనేందుకు అవసరమైన ఇన్విటేషన్ టు టెండర్ (ఐటీటీ) పత్రాన్ని పూమా సంస్థ ప్రతినిధులు కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. పూమాతో పాటు జర్మనీకే చెందిన మరో సంస్థ అడిడాస్ కూడా టీమిండియా కిట్ స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకొనేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. భారత జట్టు కిట్ స్పాన్సర్‌గా 14 ఏళ్ల పాటు కొనసాగుతూ వస్తోన్న నైకీ కాంట్రాక్టు వచ్చే నెలతో ముగియనుంది. కరోనా నేపథ్యంలో బిడ్డింగ్ కనీస ధరను బీసీసీఐ భారీగా తగ్గించింది. గతంలో మ్యాచ్‌కు రూ. 88 లక్షలుగా ఉండగా... ప్రస్తుతం అది రూ. 61 లక్షలకు తగ్గింది. -
క్రికెట్‌పై పిచ్చితో.. తాత ఇంటికే కన్నం
సాక్షి, కృష్ణా : క్రికెట్‌పై ఉన్న మక్కువ అతన్ని దొంగగా మార్చింది. తన కల సాకారం చేసుకొనేందుకు తాతగారి ఇంటికే కన్నం వేసాడు. రూ.10 లక్షలతో ఉడాయించాడు. తాత ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నాలుగు రోజుల్లోనే ఛేదించి.. ఇంటి దొంగను పట్టేసారు. ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. వివరాలు.. సుభాని కృష్ణా జిల్లా కంచికచర్ల నివాసి. క్రికెట్ అంటే ప్రాణం. దానికి తోడు వరల్డ్ కప్ ఫీవర్. ఇంకేముంది అకాడమీలో చేరి పెద్ద క్రికెటర్ అయిపోవాలని కలలు కనేవాడు. ఆ సమయంలోనే తాత భాష పొలం అమ్మాడు. పది లక్షల రూపాయల నగదు బీరువాలో భద్రపరిచి తన భార్యతో పాటు ఇంటి పైన నిద్రించాడు. ఇంట్లో డబ్బు ఉన్న విషయం తెలియటంతో సుభానీలోని కొరిక నిద్రలేచింది. భాషా కుమార్తె కొడుకైన సుభాని డాబాపై నిద్రిస్తున్న తాత వద్ద తాళాలు దొంగిలించి ఇంట్లోకి ప్రవేశించాడు. అందుబాటులో ఉన్న స్క్రూడ్రైవర్ ద్వారా బీరువా తలుపులు తెరిచి తన తాత భాషా దాచుకున్న రూ.10 లక్షల నగదుతో ఇంటి నుంచి పరారయ్యాడు. దొంగిలించిన 10 లక్షల సొమ్ములో తనకు ఇష్టమైన లక్షా 30 వేల రూపాయల విలువైన ఐఫోన్ కొన్నాడు. ఆ తర్వాత క్రికెట్ అకాడమీలో చేరేందుకు 25 వేల రూపాయల విలువైన క్రికెట్ కిట్ కొనుగోలు చేశాడు. మిగిలిన డబ్బుతో అకాడమీలో జాయిన్ అయ్యేందుకు వెళుతుండగా కంచికచర్ల బస్టాండ్ వద్ద నందిగామ రూరల్ సీఐ సతీష్, కంచికచర్ల ఎస్ ఐ శ్రీ హరి బాబు పట్టుకున్నారు. సుభాని వద్ద నుంచి 8 లక్షల ఏడు వేల రూపాయల నగదు, ఐఫోన్, క్రికెట్ కిట్ స్వాధీనం చేసుకున్నారు. -
క్రికెట్ కిట్ పంపిణీ
హిందూపురం అర్బన్ : క్రీడలను ప్రోత్సహించి యువతకు చేయూతనివ్వాలని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. ఆదివారం ఆయన స్వగృహంలో లేపాక్షి మండలం తిరుమలదేవరపల్లికి చెందిన క్రికెట్ జట్టుకు కిట్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత క్రీడాకారులుగా ఎదిగి గ్రామంతో పాటు నియోజకవర్గానికి వన్నె తేవాలని కోరారు. కార్యక్రమంలో లేపాక్షి మండల కన్వీనర్ నారాయణస్వామి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నారాయణస్వామి, బీసీ సెల్ నాయకులు ప్రభాకర్, శ్రీన, వేణు, క్రికెట్ జట్టు సభ్యులు వెంకటేష్, నాగరాజు, కిష్టప్ప, నరసింహమూర్తి, గిడ్డు శ్రీన, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
ఇక సచిన్ క్రికెట్ కిట్
లండన్: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ త్వరలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. క్రికెట్ వస్తువులను తయారు చేసే ‘స్పార్టన్ ఇంటర్నేషనల్’తో మాస్టర్ చేతులు కలిపాడు. సంస్థలో పెట్టుబడితో పాటు సలహాదారుల బోర్డులో సభ్యుడిగా చేరాడు. దీంతో హెల్మెట్స్, గ్లోవ్స్, లెగ్ గార్డ్స్‌తో పాటు ఇతర క్రికెటింగ్ ఉత్పత్తుల్లో ఇక నుంచి మాస్టర్ మార్క్ కనబడనుంది. ఫీల్డింగ్, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తాను ఎన్నోసార్లు గాయపడ్డానని గుర్తు చేసిన మాస్టర్... ఇప్పుడు కొత్త రకం గ్లౌవ్స్‌ను ఉత్పత్తి చేస్తున్నామన్నాడు. ఓవరాల్‌గా మాస్టర్ మార్క్‌తో రూపు దిద్దుకునే క్రికెటింగ్ వస్తువులు అక్టోబర్ 1 నుంచి మార్కెట్లోకి రానున్నాయి. 1953లో జలంధర్‌లో ఫుట్‌బాల్‌లను తయారు చేసే చిన్న కంపెనీ స్పార్టన్ నేడు ప్రపంచ వ్యాప్తంగా క్రీడావస్తువులను రూపొందిస్తోంది. -
లైట్ 4 క్రికెట్
సిటీకి చెందిన ఏడీపీ సాఫ్ట్వేర్ కంపెనీ ఓ యువకుడికి క్రికెట్ కిట్ కొనిచ్చింది. నగరంలోని సాయి జానియర్ కాలేజ్ మరో కుర్రాడికి ప్రయాణపు ఖర్చులు అందివ్వడమే కాకుండా పాస్‌పోర్ట్ సైతం సిద్ధం చేసి ఇచ్చింది. ఇంకో అబ్బాయికి అవసరమైన సాయాన్ని ఐ అండ్ ఐ అనే ఎన్జీఓ సమకూర్చగా, మరో యంగ్‌స్టర్‌కి కిరణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయూతని అందించాడు. ఆ సాయం చేసిన వారికి అది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ ఆ నలుగురు కుర్రాళ్లూ సాధించిన విజయం మాత్రం ఆషామాషీ కాదు. అవును మరి ఆ విజయం పేరు బై ్లండ్ క్రికెట్లో వరల్డ్‌కప్. -ఎస్.సత్యబాబు చూపులేనివాళ్లూ క్రికెట్ ఆడతారు. దేశానికి పేరు తెస్తారు. కొన్నాళ్ల కిందటే సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో బ్లైండ్ క్రికెట్ వరల్డ్‌కప్ జరిగింది. అందులో మనవాళ్లు కప్ గెలిచారు. అదీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ మీద. అంతటి ఘన విజయాన్ని మనకు దక్కించిన క్రికెట్ వీరుల్లో నలుగురు మన తెలుగోళ్లే. వరల్డ్‌కప్ విజయం తర్వాత ఇటీవల స్వస్థలాలకు వెళుతూ హైదరాబాద్‌లో ఆగిన వీరిని సిటీప్లస్ పలకరించింది. కంటి చూపు లోపానికి దుర్భర దారిద్య్రం తోడైనా.. వెలుగు బాటలు పరచుకుంటూన్న ఈ క్రీడారత్నాలు తమ అనుభవాలను ఇలా వివరించారు. వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్‌ని.. మాది గుంటూరు జిల్లా, మాచర్ల. నాన్నది వ్యవసాయం. నాలుగేళ్ల వయసులో తలుపు గొళ్లెం తగిలి ఒక కన్ను పోయింది. వయసు పెరిగేకొద్దీ ఇన్ఫెక్షన్ కారణంగా రెండో కంటి చూపు మందగించింది. నరసరావుపేట షిఫ్టయ్యాక నాన్న ఇడ్లీ, దోసె అమ్మి మమ్మల్ని పోషించారు. స్కూల్‌డేస్‌లో క్రికెట్ ఆడేవాడ్ని. పదో తరగతిలో ఉండగా ఏపీ టీమ్‌కి.. అలా ఇండియన్ టీమ్‌కి కూడా వైస్ కెప్టెన్ అయ్యాను. ఇంటర్ చదువు, క్రికెట్ హైదరాబాద్‌కి రప్పించాయి. నిజాం కాలేజ్‌లో బీఏ ఆర్ట్స్ పూర్తి చేశాను. ఆల్‌రౌండర్‌ని. వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్‌ని. ఈ ఏడాది జరిగిన వరల్డ్‌కప్‌లో కెరీర్ బెస్ట్ స్కోరు 94 బంతుల్లో 158 రన్స్ చేశాను. 2008 దాకా మా ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. మా బ్రదర్ ఆంజనేయరెడ్డి ఎస్సై అయ్యాక పరిస్థితిలో మార్పు వచ్చింది. జనరల్ కోటాలోనే 2011లో ఎస్బీహెచ్లో క్లర్క్పోస్ట్కు సెలక్టయ్యా. కొంత నా స్పోర్ట్స్ నేపథ్యం కూడా ఉపయోగపడింది. ఆర్థిక సమస్యలు తీరడంతో క్రికెట్‌పై మరింత దృష్టి పెట్టాను. ప్రాక్టీస్‌లో కాళ్లు ఫ్రాక్చర్స్ అయ్యాయి. పళ్లు విరిగాయి. చాలా సార్లు దెబ్బలు తగిలాయి. అయినా పట్టు విడవలేదు. ఈ కష్టాలన్నీ మరపించిందీ వరల్డ్ కప్ విజయం. తొలిసారి స్పోర్ట్స్ మినిస్ట్రీ రూ.5 లక్షలు ఇచ్చింది. అలాగే ప్రధాని మోదీ మాతో అరగంట గడపడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. - అజయ్‌కుమార్‌రెడ్డి వైజాగ్ టు వరల్డ్‌కప్ మాది శ్రీకాకుళం జిల్లా. వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం రామకృష్ణాపురం. నాన్న వ్యవసాయకూలీ. అమ్మ ఇంట్లో ఉండేది. తమ్ముడు వెల్డింగ్ లేబర్. ఐదేళ్లున్నప్పుడు కుడి కన్నుకు క్రికెట్ బాల్ తగిలింది. రక్తం రాలేదు చిన్నదెబ్బే అనుకుంటే మళ్లీ అక్కడే తగిలింది. ఒక నెలలోనే చూపు పూర్తిగా పోయింది. అంతేకాకుండా ఎడమ కంటికి ఇన్ఫెక్షన్ సోకింది. విశాఖపట్నంలోని మోడల్ స్కూల్ ఫర్ ది బ్లైండ్‌లో పదో తరగతి వరకూ చదివాను. అక్కడే క్రికెట్ కంటిన్యూ చేశాను. టెన్త్‌క్లాస్‌లో స్కూల్ కెప్టెనయ్యా. విశాఖపట్నం నుంచి వైజాగ్ చాలెంజర్స్ టీమ్‌కు సారథిగా స్థానిక క్రికెట్ పోటీ ల్లో పాల్గొన్నాను. ఆ తర్వాత స్టేట్ టీమ్‌లో తీసుకున్నారు. 2011 నవంబర్లోఇండియన్ క్రికెట్ టీమ్‌కు సెలెక్ట్ అయ్యాను. ఈ ఏడాది వరల్డ్‌కప్‌ను అందుకున్న టీమ్‌లో ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పటికీ నాకు సరైన ఉద్యోగం లేదు. జిల్లా కలెక్టర్‌ను కలిస్తే కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పించారు. రూ.4,500 జీతం. టోర్నమెంట్స్‌కి వెళితే అందులోనూ కోత. తమ్ముడికి హెల్త్ బాగోలేదు. నాన్న వెల్డింగ్ పని మీద ఇతర దేశాలు వెళ్లారు.హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ ఉద్యోగి కిరణ్ సాయంతో క్రికెట్‌ను కొనసాగించగలిగాను. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పుకోదగ్గ ఆర్థిక సాయం చేసింది. మంచి జాబ్ వస్తే లైఫ్‌లో కొంత తేరుకుంటాను. - వెంకట్ యంగెస్ట్.. ఫీల్డింగ్‌లో బెస్ట్.. మాది శ్రీకాకుళం జిల్లా కొప్పరవలస. చిన్నప్పుడే నాన్న చనిపోతే... అమ్మ రెక్కల కష్టం మీద నన్ను, తమ్ముడ్ని పెంచింది. నా చిన్నప్పుడు ఏదో కర్రపుల్ల తగిలి కుడి కంటి చూపు దెబ్బతింది. సరిగా గమనించకపోవడంతో.. ఎడమ కంటికీ ఇన్ఫెక్షన్ సోకింది. పదో తరగతి వరకు బొబ్బిలిలోని బ్లైండ్ స్కూల్లో చదివా. తర్వాత హైదరాబాద్‌లోని సాయి జూనియర్ కాలేజ్‌లో ఇంటర్లో చేరా. 2011 నుంచి క్రికెట్ ఆడుతున్నాను. 2013లో తొలిసారి రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆడి, వెంటనే ఇండియన్ టీమ్‌కి సెలక్టయ్యా. ప్రస్తుతం వరల్డ్‌కప్ ఆడిన టీమ్‌లో నేనే యంగెస్ట్. నా ఫీల్డింగ్‌కు మంచి పేరుంది. ఏడుగురిని రన్ అవుట్ చేశాను. 4 క్యాచ్‌లు పట్టాను. పేదరికంలో ఉన్న నాకు పాస్‌పోర్ట్ వర్క్, రాకపోకల ఖర్చులు అంతా మా కాలేజ్ వాళ్లే చూసుకున్నారు. ప్రిన్సిపాల్ రాజేశ్వరి బాగా ప్రోత్సహిస్తున్నారు. మాకు ఉపాధి పరంగా సరైన ఆసరా లభిస్తే క్రికెట్లో మరింతగా సత్తా చాటుతా. - దుర్గారావు ఆల్‌రౌండర్‌ని.. మాది నల్లగొండ జిల్లా మల్లాపురం గ్రామం. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ హైదరాబాద్‌లోని చంపాపేటలో కాంట్రాక్ట్ ఉద్యోగి. నెలకు రూ.2 వేల జీతం. ఊర్లో ఉండగా, ఏడెనిమిదేళ్ల వయసనుకుంటా.. బాణం పుల్ల కుడికన్ను లోపల గుచ్చుకుంది. హైదరాబాద్ సరోజని కంటి ఆస్పత్రిలో చూపించినా చూపు దక్కలేదు. ఎడమ కంటి చూపు 40 శాతం దెబ్బతింది. దారుల్ షిఫా బాయ్స్ హైస్కూల్ ఫర్ ది బ్లైండ్‌లో టెన్త్ దాకా చదివా. క్రికెట్లోనూ సక్సెస్‌ఫుల్‌గా ఆడి, 2008లో సౌత్‌జోన్‌కు సెలక్టయ్యాను. ఆ తర్వాత ఇండియన్ టీమ్‌కు సెలక్టయ్యాను. ఐ ఆండ్ ఐ ఎన్జీఓ నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ చే సింది. డిసెంబర్లో జరిగిన వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండర్‌గా రాణించా. ప్రస్తుతం మెహదీపట్నంలోని సాలార్జంగ్ కాలనీలో ఉన్న హోమ్ ఫర్ ద బ్లైండ్ ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ ఉస్మానియాలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ చేస్తున్నాను. కాల్ సెంటర్లో జాబ్ చేసేవాడ్ని. ఇండియన్ టీమ్‌కి సెలక్టయ్యాక లీవ్ ఇవ్వడం కుదరదన్నారని రిజైన్ చేశాను. ప్రస్తుతం జాబ్ కూడా లేదు. నాకు అవసరమైన క్రికెట్ కిట్‌ను బంజారాహిల్స్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీ ఏడీపీ కొని ఇచ్చింది. వరల్డ్‌కప్ గెలిచాక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహం అందింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆసరా అందిస్తే మరింతగా క్రికెట్లో రాణించగలనన్న నమ్మకం ఉంది. - మధు -
క్రికెట్ కిట్ కొనివ్వలేదని ...
క్రికెట్ ఆటపై ఉన్న మమకారం ఓ బాలుడిని హంతకుడిని చేసింది. క్రికెట్ కిట్ కొనివ్వలేదని మహిళను హత్య చేసిన బాలుడు (15)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం మహాలక్ష్మి కాలనీలో మహిళ హత్యకు గురైన విషయం తెల్సిందే. గనులు, భూ విజ్ఞాన శాఖలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మంజుల (42) హత్యకు గురైంది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుడిని రెండు రోజుల్లోనే అదుపులోకి తీసుకున్నారు. వివరాలు... అవివాహితురాలైన మంజుల కొద్ది రోజుల క్రితమే గౌరిపేట నుంచి మహాలక్ష్మి కాలనీలోని ఓ ఇంటిలో అద్దెకు దిగింది. అద్దె డబ్బుల కోసం సదరు ఇంటి యజమానురాలు ప్రతి నెల తన కుమారుడిని మంజుల వద్దకు పంపించేంది. ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఈ బాలుడికి క్రికెట్ ఆటపై ఆసక్తి ఉంది. దీంతో బాలుడు మంజులను అద్దె డబ్బుల కోసం వచ్చినప్పుడల్లా క్రికెట్ కిట్ కోసం డబ్బులు డిమాండ్ చేసేవాడు. ఆదివారం రాత్రి కూడా డబ్బు ఇవ్వాలని బాలుడు మంజులపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. ఆమె ససేమిరా అనడంతో తీవ్ర ఆవేశానికి లోనైన బాలుడు కత్తిపీట తీసుకుని గొంతు కోశాడు. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే మంజుల ప్రాణాలు విడిచింది. ఇంత జరిగినా ఏమి తెలియని అమాయకుడిలా, ఎటువంటి భయం కనిపించకుండా ఇంటికి వచ్చేశాడు. మరుసటి రోజు ఈ హత్య నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కొన్ని గంటల్లో చేధించారు. సంఘటన స్థలంలో చేతి గుర్తుల ఆధారంగా నిందితుడిని మైనర్ బాలుడిగా తేల్చారు. ఆదివారం మంజుల ఇంటికి ఎవరెవరు వెళ్లారో విచారణ చేసిన పోలీసులు బాలుడిని ట్రేస్ చేశారు. హంతకుడు మైనర్ కావడంతో బుధవారం జిల్లా కోర్టులో హాజరు పరిచిన అనంతరం బాలుడిని ఎక్కడ ఉంచాలనే విషయంపై జడ్జి ఆదేశాల జారీ చేస్తారు. -
హుష్...‘సార్వత్రిక’ ప్రచారానికి తెర
ఇక ప్రలోభాలకు ఎర మద్యం, క్రికెట్ కిట్లు, నగదు పంపిణీకి రంగం సిద్ధం అడ్డుకట్ట వేసేందుకు అధికారుల సన్నద్ధం ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: గత 15 రోజులుగా హోరెత్తిన సార్వత్రిక ప్రచార పర్వానికి తెరపడింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం గడువు ముగియడంతో మైకులు మూగబోయాయి. దీంతో ఇప్పటి వరకు ప్రచారంలో మునిగి తేలిన అభ్యర్థులు, అన్ని పార్టీల నేతలు క్యాంపు కార్యాలయాల్లో సమీకరణలు సాగిస్తున్నారు. ఇంటింటికి తిరిగి ప్రజలను కలుసుకున్న అభ్యర్థులు ఇప్పుడు అధిక ఓట్లు సాధించడమే లక్ష్యంగా మంత్రాంగం నెరుపుతున్నారు. ఈనెల 30వ తేదీన అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుండగా... 48 గంటలు ముందుగా ప్రచార పర్వానికి ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఇప్పటి వరకు నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ అభ్యర్థుల గెలుపు కోసం మండుటెండల్లో సైతం ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా అభ్యర్థుల ఫొటోలతో ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలు దర్శనమిస్తున్నాయి. ఆటోలు, వాహనాలపై మైకులతో ప్రచార హోరు సాగించారు. ఇలా నెలరోజులుగా నెలకొన్న సందడి ఒక్కసారిగా ఆగిపోవడంతో పల్లెలు, పట్టణాల్లో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. జిల్లాలో పోటీ చేస్తు న్న వారిలో ఎక్కువ మంది హేమాహేమీలు ఉండడంతో ఇక్కడి రాజకీయలపై రాష్ట్ర వ్యా ప్తంగా చర్చ జరుగుతోంది. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ అభ్యర్థిగా కంకణాల నారాయణ, టీడీపీ అభ్యర్థిగా నామానాగేశ్వరారవు బరిలో ఉండడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఆయా పార్టీల నేతలు తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అలా గే పలు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న వారిలో ఏళ్ల తరబడి మంత్రులుగా పనిచేసిన వారు ఉండడంతో రాజకీయం వేడెక్కుతోంది. పోలింగ్ సమయం ముంచుకొస్తుండడంతో జిల్లా రాజకీయాలపై ఓటర్లు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక నోటుతో ఎర... మైకు ప్రచారానికి తెరపడటంతో ఆయా పార్టీల నాయకులు, అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. బహిరంగంగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు, నా యకులు ఇక తెరచాటు రాజకీయానికి వ్యూహా లు పన్నుతున్నారు. నోట్ల కట్టలు, మద్యం బాటిళ్లు, యువతకు క్రికెట్ కిట్లతోపాటు వివిధ రకాల బహుమతులతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన సామగ్రిని ఇప్పటికే వారి కార్యాలయాల్లో, కార్యకర్తలు, అనుచరుల ఇళ్లలో నిల్వ ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. పోలింగ్‌కు రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఆఖరి అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారు. పార్లమెంట్ అభ్యర్థి రూ.70 లక్షలు, అసెంబ్లీ అభ్యర్థులు రూ.28 లక్షల వరకే ఖర్చు చేయాలని ఎన్నికల నిబంధన ఉన్నప్పటికీ, ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.కోట్లలోకి చేరిందని అధికారులు భావిస్తున్నారు. యువతను ఆకట్టుకునేందుకు ఎత్తులు.. ఈ ఎన్నికల్లో యువత ఓట్లే కీలకం కానుండటంతో రాజకీయ పార్టీల అభ్యర్థులు వారిని ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. క్రికెట్ కిట్లు, మద్యం బాటిళ్లను పెద్ద ఎత్తున సేకరించి సిద్ధం చేసుకున్నారు. ఖమ్మం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌కు చెందిన మమత మెడికల్ కళాశాలలో పంచేందుకు సిద్ధంగా ఉంచిన క్రికెట్ కిట్లు, మద్యం బాటిళ్లను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు గత ఐదారు రోజులుగా పలువురి వాహనాల్లో నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ అభ్యర్థుల అనుచరుల నుంచి కూడా గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇలా పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు రూ.1.23 కోట్లకు చేరుకుందని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో డబ్బు ఎంత విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారో ఊహించవచ్చు. అడ్డుకట్ట వేసేందుకు అధికారుల వ్యూహం... డబ్బు పంపకం, మద్యం, క్రికెట్ కిట్ల పంపిణీలతో ఓటర్లను ప్రభావితం చేస్తుంటడంతో వీటికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం సరికొత్త పద్ధతిలో వ్యూహాలు పన్నుతున్నారు. మండలాలతోపాటు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను వేశారు. అలాగే ఎన్నికల వ్యయ పరిశీలకులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్ తదితర బృందాలతో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం ఉన్న వాహనాలతోపాటు అభ్యర్థులు, వారి అనుచరుల ఇళ్లపై కూడా దాడులు చేసేందుకు దృష్టి సారించారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటినుంచి పోలీసులు వివిధ ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. బస్టాండ్లు, కూడళ్ల వద్ద కూడా భారీ స్థాయిలో నగదు తీసుకెళ్తున్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లెక్కలు చూపని వాటిని సీజ్ చేస్తున్నారు. పోలింగ్ రోజున అభ్యర్థులు ఎటువంటి ప్రచారం నిర్వహించవద్దని, జెండాలు ప్రదర్శించవద్దని, ఓటరు స్లిప్‌లను పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.