
క్రికెట్ కిట్ పంపిణీ
క్రీడలను ప్రోత్సహించి యువతకు చేయూతనివ్వాలని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు.
హిందూపురం అర్బన్ : క్రీడలను ప్రోత్సహించి యువతకు చేయూతనివ్వాలని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. ఆదివారం ఆయన స్వగృహంలో లేపాక్షి మండలం తిరుమలదేవరపల్లికి చెందిన క్రికెట్ జట్టుకు కిట్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత క్రీడాకారులుగా ఎదిగి గ్రామంతో పాటు నియోజకవర్గానికి వన్నె తేవాలని కోరారు.
కార్యక్రమంలో లేపాక్షి మండల కన్వీనర్ నారాయణస్వామి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నారాయణస్వామి, బీసీ సెల్ నాయకులు ప్రభాకర్, శ్రీన, వేణు, క్రికెట్ జట్టు సభ్యులు వెంకటేష్, నాగరాజు, కిష్టప్ప, నరసింహమూర్తి, గిడ్డు శ్రీన, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.