sponsered
-
డిస్నీ స్టార్‌లో క్రికెట్ వరల్డ్ కప్ స్పాన్సర్‌గా మహీంద్రా
న్యూఢిల్లీ: డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల ప్రసారానికి అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరించనున్నట్లు ఆటోమేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ఒక ప్రకటనలో తెలిపింది. కీలక టార్గెట్ మార్కెట్లలోని వినియోగదారుల దృష్టిలో పడేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ వివరించింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ కోసం మహీంద్రా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఎస్‌యూవీలు, ట్రాక్టర్ బ్రాండ్లకు..భారతీయ క్రికెట్ స్ఫూర్తికి మధ్య పటిష్టమైన అనుబంధం ఉందని సంస్థ ఈడీ రాజేశ్ జెజూరికర్ చెప్పారు. అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. -
ప్రపంచంలోకెల్లా సంపన్నమైన క్రికెట్ బోర్డు.. జెర్సీ స్పాన్సర్ చేసే నాథుడే లేడా..?
ప్రపంచంలోకెల్లా సంపన్నమైన క్రికెట్ బోర్డుకు జెర్సీ స్పాన్సర్ చేసే నాథుడే కరువయ్యాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ కోసం బీసీసీఐ టీమిండియా జెర్సీ స్పాన్సర్‌ను దొరకబట్టలేకపోయింది. ప్రపంచ క్రికెట్‌కు పెద్దన్నలా వ్యవహరించే బీసీసీఐకి ఇది ఘోరమైన అవమానంగా చెప్పాలి. ప్రస్తుతం టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా బైజూస్ కంపెనీ వ్యవహరిస్తుంది. అయితే బైజూస్ కాంట్రాక్ట్ నుంచి అర్ధంతరంగా తప్పుకోవడంతో భారత క్రికెట్ బోర్డు కొత్త స్పాన్సర్ వేటలో పడింది. కొత్త స్పాన్సర్‌తో డీల్ కుదుర్చుకునేందుకు తగిన సమయం లేకపోవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ప్లేన్ జెర్సీతోనే (బీసీసీఐ, అడిడాస్ లోగో ఉంటాయి) బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కాగా, బీసీసీఐ ఇటీవలే భారత టూల్ కిట్ స్పాన్సర్‌గా అడిడాస్‌తో డీల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇదివరకే ఓవల్ మైదానంలో కఠోరంగా శ్రమిస్తున్నాయి. ఐపీఎల్ సక్సెస్‌తో గిల్, కోహ్లి, షమీ లాంటి టీమిండియా క్రికెటర్లు ఉరకలేస్తున్నారు. మరోవైపు ఆసీస్ టీమ్ సైతం విజయంపై ధీమాగా ఉంది. చదవండి: తండ్రికి ఇచ్చిన మాట కోసం సచిన్ ఏం చేశాడంటే..? -
భారత హాకీకి సంబంధించి ఒడిశా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం
భువనేశ్వర్: భారత సీనియర్, జూనియర్ పురుషుల, మహిళల హాకీ జట్లకు మరో పదేళ్లపాటు (2033 వరకు) స్పాన్సర్ షిప్ చేస్తామని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2018 నుంచి ఒడిశా జాతీయ హాకీ జట్లకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. 2018, 2023లలో పురుషుల ప్రపంచకప్ టోర్నీలకు ఒడిశా ఆతిథ్యమిచ్చింది. -
క్రికెట్ కిట్ పంపిణీ
హిందూపురం అర్బన్ : క్రీడలను ప్రోత్సహించి యువతకు చేయూతనివ్వాలని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. ఆదివారం ఆయన స్వగృహంలో లేపాక్షి మండలం తిరుమలదేవరపల్లికి చెందిన క్రికెట్ జట్టుకు కిట్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత క్రీడాకారులుగా ఎదిగి గ్రామంతో పాటు నియోజకవర్గానికి వన్నె తేవాలని కోరారు. కార్యక్రమంలో లేపాక్షి మండల కన్వీనర్ నారాయణస్వామి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నారాయణస్వామి, బీసీ సెల్ నాయకులు ప్రభాకర్, శ్రీన, వేణు, క్రికెట్ జట్టు సభ్యులు వెంకటేష్, నాగరాజు, కిష్టప్ప, నరసింహమూర్తి, గిడ్డు శ్రీన, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.