ప్రపంచంలోకెల్లా సంపన్నమైన క్రికెట్ బోర్డుకు జెర్సీ స్పాన్సర్ చేసే నాథుడే కరువయ్యాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ కోసం బీసీసీఐ టీమిండియా జెర్సీ స్పాన్సర్‌ను దొరకబట్టలేకపోయింది. ప్రపంచ క్రికెట్‌కు పెద్దన్నలా వ్యవహరించే బీసీసీఐకి ఇది ఘోరమైన అవమానంగా చెప్పాలి. ప్రస్తుతం టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా బైజూస్ కంపెనీ వ్యవహరిస్తుంది.
అయితే బైజూస్ కాంట్రాక్ట్ నుంచి అర్ధంతరంగా తప్పుకోవడంతో భారత క్రికెట్ బోర్డు కొత్త స్పాన్సర్ వేటలో పడింది. కొత్త స్పాన్సర్‌తో డీల్ కుదుర్చుకునేందుకు తగిన సమయం లేకపోవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ప్లేన్ జెర్సీతోనే (బీసీసీఐ, అడిడాస్ లోగో ఉంటాయి) బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కాగా, బీసీసీఐ ఇటీవలే భారత టూల్ కిట్ స్పాన్సర్‌గా అడిడాస్‌తో డీల్ చేసుకున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇదివరకే ఓవల్ మైదానంలో కఠోరంగా శ్రమిస్తున్నాయి. ఐపీఎల్ సక్సెస్‌తో గిల్, కోహ్లి, షమీ లాంటి టీమిండియా క్రికెటర్లు ఉరకలేస్తున్నారు. మరోవైపు ఆసీస్ టీమ్ సైతం విజయంపై ధీమాగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment