న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్‌షిప్ రేసులో జర్మనీకి చెందిన ప్రముఖ సంస్థ పూమా నిలిచింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. బిడ్‌లో పాల్గొనేందుకు అవసరమైన ఇన్విటేషన్ టు టెండర్ (ఐటీటీ) పత్రాన్ని పూమా సంస్థ ప్రతినిధులు కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. పూమాతో పాటు జర్మనీకే చెందిన మరో సంస్థ అడిడాస్ కూడా టీమిండియా కిట్ స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకొనేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. భారత జట్టు కిట్ స్పాన్సర్‌గా 14 ఏళ్ల పాటు కొనసాగుతూ వస్తోన్న నైకీ కాంట్రాక్టు వచ్చే నెలతో ముగియనుంది. కరోనా నేపథ్యంలో బిడ్డింగ్ కనీస ధరను బీసీసీఐ భారీగా తగ్గించింది. గతంలో మ్యాచ్‌కు రూ. 88 లక్షలుగా ఉండగా... ప్రస్తుతం అది రూ. 61 లక్షలకు తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment