puma
-
సింగిల్ బ్రాండ్‌తో 100 కోట్ల డీల్ కుదుర్చుకున్న తొలి ఇండియన్ క్రికెటర్ ఎవరో తెలుసా?
ఇండియాలో రిచెస్ట్ క్రికెటర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి సంబంధించి ఒక విషయం మళ్లీ వార్తల్లో నిలిచింది. 2017లో ఎనిమిదేళ్లకు గాను రూ. 100 కోట్లకు పైగా ఒప్పందంపై సంతకం చేసిన తొలి భారత క్రికెటర్‌గా (అప్పటికి భారత కెప్టెన్) రికార్డ్ దక్కించుకున్నాడు. స్పోర్ట్స్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్యూమాతో రూ.110 కోట్ల ఒప్పందం చేసుకోవడం ఇపుడు మళ్లీ విశేషంగా చర్చల్లో నిలుస్తోంది. ఈ డీల్ ద్వారా ప్యూమాకు గ్లోబల్ అంబాసిడర్లు జమైకన్ స్ప్రింటర్లు ఉసేన్ బోల్ట్ , అసఫా పావెల్ , ఫుట్‌బాల్ క్రీడాకారులు థియరీ హెన్రీ , ఆలివర్ గిరౌడ్ సరసన చేరాడని క్రికెట్ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో క్రికెట్ స్టార్లకు ఎండార్స్మెంట్ డీల్స్ ఒక రేంజ్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని , రోహిత్ శర్మ లాంటి వాళ్లు కోట్ల విలువైన పలు ఎండార్స్మెంట్ ఒప్పందాలను కుదర్చుకున్నారు. వీరిలో రూ.1,000 కోట్లకు పైగా నికర విలువతో భారత ధనిక క్రికెటర్‌గా గుర్తింపు పొందిన కోహ్లికి రూ.110 కోట్ల ప్యూమా డీల్ చాలా కీలకం. అయితే బ్రాండ్ విలువలో మాత్రం కోహ్లి మొదటి వాడు కాదు. 2001 లోనే లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ రూ. 100 కోట్ల డీల్ మార్కును సాధించాడు. అపారమైన బ్రాండ్ వాల్యూతో మెగాస్టార్లుగా మారుతున్న ట్రెండ్‌కు ఆద్యుడు సచిన్ అనే చెప్పాలి. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ వరల్డ్‌టెల్‌తో సచిన్ రూ.100 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. సచిన్‌ను గ్లోబల్ బ్రాండ్‌గా క్రియేట్ చేసిన ఘనత మార్కెటింగ్ నిపుణుడు మార్క్ మస్కరెన్హాస్ నేతృత్వంలోనేదే ఈ సంస్థ. ఈ డీల్ అప్పట్టో సంచలనమే కాదు, ఇది భారత క్రికెట్లో బ్రాండింగ్, ఎండార్స్మెంట్ల రూపాన్ని మార్చేసిందని క్రీడా పండితుల భావన. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పుణ్యమా అని క్రికెటర్ల బ్రాండ్ విలువ పెరుగుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. -
'బయట 'కింగ్' కావొచ్చు.. భార్య ముందు మాత్రం పిల్లే'
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ లీగ్ దశకే పరిమితమైంది. అయితే సీజన్లో కొన్ని మంచి విజయాలు అందుకున్నప్పటికి ప్లేఆఫ్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేసింది. దీంతో టైటిల్ సాధించాలన్న కోరిక అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. ఇక కోహ్లి మళ్లీ టీమిండియా తరపున వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో లండన్‌కు వెళ్లిన కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటిఫుల్ డే అంటూ స్టోరీ షేర్ చేశాడు. ఇక కోహ్లికి బయట ఎంత పెద్ద ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి కోహ్లిని భార్య అనుష్క శర్మ అందరిముందు టీజ్ చేయడం ఆసక్తి కలిగించింది. కోహ్లి లండన్‌కు వెళ్లడానికి ముందు భార్య అనుష్కతో కలిసి పుమా కంపెనీ ఈవెంట్ లో పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన వీడియో బిట్స్ బిట్స్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిగతా వాటి సంగతేమో గానీ ఒక్కటి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోలో భాగంగా యాంకర్ గా ఉన్న వ్యక్తి, కోహ్లీ సెలబ్రేషన్స్ ని ఇమిటేట్ చేసి చూపించమని అనుష్కని అడిగారు. దీంతో అవతల జట్టు వికెట్ పడ్డప్పుడు కోహ్లీ ఎలా బిహేవ్ చేస్తాడనేది అనుష్క ఉన్నది ఉన్నట్లుగా చేసి చూపించింది. కోహ్లీ చూసి నవ్వుకున్నాడు. చెప్పాలంటే ఈ ఈవెంట్ లో అందరిముందే విరాట్ కోహ్లీని అనుష్క ర్యాగింగ్ చేసిందనే చెప్పాలి. ఇది చూడటానికి చాలా ఫన్నీగా ఉంటూనే మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తోంది. ఆ తర్వాత కోహ్లి అనుష్క నటించిన బాండ్ బజా బరాత్ సినిమాలోని రణ్‌వీర్‌సింగ్ డైలాగులు చెప్పి అందరిని నవ్వించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు కోహ్లి బయట కింగ్ కావొచ్చు.. కానీ భార్య అనుష్క ముందు మాత్రం పిల్లే అంటూ కామెంట్ చేశారు. Fun moments between Virat Kohli and Anushka Sharma. Anushka imitating Virat's celebration was the best! pic.twitter.com/e3ono4oXlG — Mufaddal Vohra (@mufaddal_vohra) May 27, 2023 చదవండి: సచిన్‌తో గిల్ ముచ్చట.. పండగ చేసుకున్న గాసిప్ రాయుళ్లు -
పీలే క్రేజ్‌కు ఉదాహరణ.. షూ లేస్ కట్టుకున్నందుకు రూ.కోటి
బ్రెజిల్‌కి మూడు ఫిఫా వరల్డ్ కప్స్ (1958, 1962, 1970) అందించిన పీలే... బ్రాండ్స్‌కి మార్కెటింగ్ చేయడంలోనూ తన మార్కు చూపించారు. రెండు ప్రపంచ కప్స్ గెలిచిన తర్వాత పీలే ఫిఫా వరల్డ్‌లో తిరుగులేని సూపర్ స్టార్‌గా వెలుగొంతున్న సమయంలో ఆయనతో బ్రాండ్ ప్రమోషన్ చేయించాలని కంపెనీలన్నీ క్యూ కట్టాయి. 1970లో స్పోర్ట్స్ షూస్ కంపెనీ పూమా, పీలేతో బ్రాండ్ ప్రమోషన్‌కి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సాధారణంగా ప్రమోట్ చేస్తే కుదురదని బ్రాండ్ ప్రమోషన్ కోసం ఓ వినూత్న ప్లాన్‌ను వాడింది పూమా. 1970 వరల్డ్ కప్ సమయంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో పూమా, తన షూ లేస్‌ని కట్టుకోవడం మొదలెట్టాడు.. అంతే కంపెనీకి కోట్ల రూపాయాల్లో టర్నోవర్ వచ్చింది. కేవలం మ్యాచ్ ఆరంభానికి ముందు షూ లేస్ కట్టుకున్నందుకు 120000 డాలర్లు (దాదాపు కోటి రూపాయల వరకూ) పీలేకి ముట్టచెప్పింది పూమా కంపెనీ. మ్యాచ్ సమయంలో పీలే షూ లేస్ కట్టుకోవడం వల్ల పూమా కంపెనీకి కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. అప్పట్లో పీలేకి ఎంతటి క్రేజ్ ఉండేదో చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే... తన సుదీర్ఘ కెరీర్లో తిరుగులేని రికార్డులెన్నో క్రియేట్ చేసిన పీలే... 1363 మ్యాచులు ఆడి 1283 గోల్స్ సాధించాడు. బ్రెజిల్ తరుపున 77 అంతర్జాతీయ గోల్స్ సాధించిన పీలే.. 1959లో ఒకే ఏడాదిలో 127 గోల్స్ సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. చదవండి: పీలే టాప్-10 స్టన్నింగ్ గోల్స్‌పై లుక్కేయాల్సిందే 'పీలే'.. ఆ పేరు ఎలా వచ్చింది; అసలు పేరేంటి? -
వీడెవడో అచ్చం నాలాగే ఉన్నాడే? : విరాట్ కోహ్లి
ఈ లోకంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారన్న సామెత చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. తాజాగా టీమిండియా రన్‌మెషిన్ కింగ్ కోహ్లికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. విరాట్ కోహ్లి పుమాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అచ్చం కోహ్లిని పోలిన ఒక వ్యక్తి తనలా షార్ట్, టీషర్ట్ వేసుకొని పుమా ప్రొడక్ట్స్ అమ్మాడు. అంతేకాదు అక్కడికి వచ్చిన వాళ్లతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ కనిపించాడు. ఇది గమనించిన కోహ్లి పుమాను హెచ్చరించాడు. ''హే పుమా ఇండియా. అచ్చం నన్ను పోలిన ఒక వ్యక్తి ముంబైలోని లింక్‌రోడ్డు దగ్గర పుమా ప్రొడక్ట్స్ అమ్ముతున్నాడు. దయచేసి ఈ విషయంపై కాస్త దృష్టి పెట్టండి'' అంటూ కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టి పుమా కంపెనీకి ట్యాగ్ చేశాడు. బ్లాక్ ఫ్రైడే కార్యక్రమంలో భాగంగానే పుమా కంపెనీ స్వయంగా ఇదంతా ప్లాన్ చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయం కోహ్లికి తెలియక తన ఇన్‌స్టాలో మెసేజ్ చేశాడు. ఇంతకముందు కూడా పుమా తమ కంపెనీ ప్రచారకర్తలుగా ఉన్న కరీనా కపూర్, సునీల్ ఛెత్రీ, యువరాజ్ సింగ్‌లను పోలిన వ్యక్తులతో ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్‌లో ఇలాంటి కార్యక్రమాలనే నిర్వహించింది. ఇక పుమా అనేది జర్మనీకి చెందిన కంపెనీ. -
చీతా.. చిరుత.. జాగ్వార్.. ఒకటే మోడల్ దేనికదే స్పెషల్!
ప్రధాని మోదీ నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో వదిలినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఆ చీతాలను చూస్తున్న జనం దాదాపు అలాగే కనిపించే చిరుత పులులుగా భ్రమపడటం, మన దగ్గర ఉన్నాయిగా అనుకోవడం కూడా కనిపిస్తోంది. నిజానికి పిల్లి నుంచి పెద్దపులి దాకా అన్నీ ఒకే ప్రధాన జాతికి చెందిన జీవులు. ఇందులోనే చీతాలు, చిరుత పులులు, జాగ్వార్లు, పుమాలు వంటివి ఉప జాతులుగా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ప్రత్యేకమైన చారలు, గుర్తులు, ముఖ కవళికలు, పాదముద్రలతో ఉంటాయి. వాటి ఆకారం, పరిమాణం కూడా వేర్వేరుగా ఉంటాయి. జాగ్వార్లు పెద్దగా బరువు ఎక్కువగా ఉంటాయి. చీతాలు సన్నగా ఉండి, అత్యంత వేగంగా కదులుతాయి. చిరుతలు అయితే చెట్లు కూడా సులభంగా ఎక్కగలవు. జూలలో ఉన్నవి పరిగణనలోకి తీసుకోరు. భారత్‌లో 70ఏళ్ల క్రితమే చీతాలు అంతరించిపోయాయి. అయితే మన హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్కు సహా మరికొన్ని జూలలో చీతాలు ఉన్నాయి. ఇలా జూలలో ఉన్న జంతువులను అధికారిక లెక్కల్లో పరిగణనలోకి తీసుకోరు. అడవులు, సహజ సిద్ధ ఆవాసాల్లో ఉండే వాటినే లెక్కల్లోకి తీసుకుంటారు. 1952 తర్వాత మన దేశంలోని అడవుల్లో ఎక్కడా చీతాలు కనిపించకపోవడంతో అంతరించిపోయినట్టు ప్రకటించారు. చీతాలు.. చిన్నవైనా వేగంగా.. ►ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జంతువులు చీతాలు. కేవలం మూడు సెకన్లలోనే గంటకు 60 మైళ్ల (సుమారు 100 కిలోమీటర్ల) వేగాన్ని అందుకోగలవు. ►ఇవి 70 కేజీల వరకు బరువు.. 112 సెంటీమీటర్ల నుంచి 150 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటాయి. ►శరీరం, కాళ్లు పొడవుగా ఉంటాయి. లేత గోధుమ రంగు శరీరంపై.. నలుపు రంగులో గుండ్రంగా, చిన్నవిగా మచ్చలు ఉంటాయి. ►రాత్రిపూట కళ్లుగా సరిగా కనబడవు. అందుకే ఉదయం, సాయంత్రం సమయాల్లోనే వేటాడుతాయి. ►3, 4 రోజులకు ఒకసారి నీళ్లు తాగుతాయి. ►చాలా వరకు ఒంటరిగా వేటాడుతాయి. అరుదుగా రెండుమూడు కలిసి వేటాడుతాయి. ►ఒకప్పుడు మన దేశంలో విస్తృతంగా ఉండేవి. ప్రస్తుతం ఆసియా దేశాల్లోనూ ఉన్నాయి. ఎక్కువగా దక్షిణ, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఉన్నాయి. ఉష్ణ మండల అరణ్యాలు, గడ్డి భూములను ఆవాసాలుగా చేసుకుంటాయి. మనుషులకు మరీ ప్రమాదకరమేమీ కావు. పెద్ద జంతువుల జోలికి కూడా వెళ్లవు. చిరుతలు.. మధ్యస్థం, ప్రమాదకరం.. ►ఈ జాతి జీవుల్లో మధ్యస్థమైన పరిమాణంలో ఉంటాయి. పొడవు మాత్రం ఎక్కువ. ►నాజూకుగా కనిపించే శరీరం, పొట్టి కాళ్లు, మందమైన తోక ఉంటాయి. వీటి కంటిచూపు అత్యంత చురుకైనది. చెట్లు కూడా ఎక్కగలవు. ►ఏడాది పొడవునా, ప్రధానంగా వానాకాలంలో పిల్లలను కంటాయి. అందుకే వీటి సంఖ్య గణనీయంగా ఉంటుంది. ►ఇవి భారత ఉప ఖండం, ఆగ్నేయాసియా, సబ్ సహరన్ ఆఫ్రికా, పశ్చిమ, సెంట్రల్ ఆసియా ప్రాంతాల్లో ఎక్కువ. ►తమ ఆవాసాలు, ప్రాంతాలను బట్టి వీటి రంగులో కొంత తేడా ఉంటుంది. గడ్డి మైదానాల్లోని చిరుతలు లేత పసుపు రంగులో.. దట్టమైన అడవుల్లో ఉండేవి ముదురు పసుపు రంగులో ఉంటాయి. మచ్చలు ఎక్కువగా, పెద్దవిగా ఉంటాయి. ►ఇవి క్రూరంగా వ్యవహరిస్తాయి. మనుషులు కనిపిస్తే దాడి చేస్తాయి. మన దేశంలోని చాలాచోట్ల చిరుతలు మనుషులపై దాడిచేసిన ఘటనలు ఉన్నాయి. జాగ్వార్లు.. భారీ పరిమాణంలో.. ►ఇవి బరువైన, పెద్ద శరీరాన్ని.. పదునైన గోళ్లు, పళ్లు, పంజా కలిగి ఉంటాయి. ఈ జాతిలో సింహం, పెద్దపులి తర్వాత జాగ్వార్‌ను మూడో పెద్ద జంతువుగా పరిగణిస్తారు. 65 కేజీల నుంచి 140 కేజీల దాకా బరువుంటాయి. ►చిన్న చిన్న జంతువుల నుంచి పెద్ద జంతువులపైనా దాడి చేస్తుంది. ►ముదురు ఎరుపు, గోధుమ వర్ణంతోపాటు పసుపు (టానీ ఎల్లో కలర్) రంగులోనూ ఉంటాయి. వీటిపై మచ్చలు పెద్దగా భిన్నంగా ఉంటాయి. ఇవి రాత్రీపగలు వేటాడగలవు. కంటిచూపు చురుగ్గా ఉంటుంది. జాగ్వార్లు నీళ్లలో సులభంగా ఈదగలవు. మన దేశంలో జాగ్వార్లు లేవు. -
ప్యూమా సంచలన నిర్ణయం.. ఇండియాలో తొలిసారిగా..
జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమా సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇతర యూరప్ దేశాలను కాదని తొలిసారిగా ఆన్లైన్ షాపింగ్ కోసం ఇండియాలో యాప్ రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్యూమాకు అనేక దేశాల్లో ఈ కామర్స్ కోసం ఆన్లైన్ పోర్టల్స్ ఉన్నాయి కానీ యాప్ లేదు. మొబైల్ యూజర్ల గణనీయంగా పెరగడంతో యాప్ రిలీజ్ చేయాలని ప్యూమా నిర్ణయించుకుంది. ఇందుకు ఇండియాను వేదికగా చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్యూమాకు ఉన్న అతి పెద్ద మార్కెట్లలో ఇండియా ఒకటి. 2021 డిసెంబరు వరకు ప్యూమా ఇండియాలో రూ.2,044 రెవెన్యూ సాధించింది. అంతకు ముందు ఏడాది 2020తో పోల్చితే ఇది 68 శాతం అధికం. ఇండియాలో తమ బ్రాండ్‌కి ఉన్న ఆదరణ గమనించిన ప్యూమా ఇక్కడే తమ యాప్‌ను రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్యూమాకి దేశశ్యాప్తంగా 450 స్టోర్లు ఉన్నాయి. ఇందులో 51 స్టోర్లు గతేడాదే ప్రారంభం అయ్యాయి. ఇండియాలో తమ ప్యూమా నంబర్ వన్ స్పోర్ట్స్ బ్రాండ్‌గా ఉందని ఆ కంపెనీ సీఈవో జార్న్ గుల్డెన్ అన్నారు. అందుకే ఇండియాలో భారీ ఎత్తున విస్తరించే యోచనలో ప్యూమా ఉన్నట్టు తెలిపారు. యాప్ ప్రారంభమైతే ప్యూమా ఉత్పత్తలు మరింత వేగంగా వినియోగదారులకు అందుతాయని ప్యూమా ఇండియా హెడ్ అభిషేక్ గంగూలీ అన్నారు. చదవండి: ‘అవమానాలు భరించలేక కిటికిలోంచి దూకేద్దాం అనుకున్నా’ -
వాషింగ్టన్, పడిక్కల్‌లకు బంపర్ ఆఫర్..
ముంబై: ఇటీవలి కాలంలో జరిగిన అన్ని క్రికెట్ ఫార్మాట్లలో విశేషంగా రాణించిన వాషింగ్టన్ సుందర్, దేవ్‌దత్ పడిక్కల్‌లు బంపర్ ఆఫర్ కొట్టేశారు. ప్రముఖ జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమా.. ఈ యువ క్రికెటర్లతో దీర్ఘకాల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. కాగా, ప్యూమా ఇదివరకే టీమిండియా స్టార్ క్రికెటర్లను తమ సంస్థ ప్రచారకర్తలుగా నియమించుకుంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, యువరాజ్‌సింగ్ లాంటి స్టార్ క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్ సుష్మా వర్మతో ప్యూమా ఒప్పందం కుదుర్చుకుంది. 'ప్యూమా ఫరెవర్ ఫాస్టర్ స్పిరిట్' అనే నినాదానికి ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు సరిగ్గా సరిపోతారని, అందుకే వారిని ఎంపిక చేసుకున్నట్లు ప్యూమా ఇండియా ఎండీ అభిషేక్ గంగూలీ వెల్లడించారు. స్టార్ ఆటగాళ్లనే కాకుండా యువ క్రికెటర్లను కూడా ప్రోత్సహించాలనే ఉద్ధేశంతో ఈ ఇద్దరు క్రికెటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. ప్యూమాతో ఒప్పందం కుదుర్చుకోవడంపై ఈ ఇద్దరు క్రికెటర్లు స్పందించారు. ప్యూమా లాంటి సంస్థతో డీల్ కుదుర్చుకోవడం తమ అదృష్టమని, ప్రపంచ అత్యుత్తమ అథ్లెట్ల సరసన చేరడం నిజంగా గొప్ప అనుభూతి అని ఇద్దరు క్రికెటర్లు తెలిపారు. కాగా, గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో విశేషంగా రాణించిన వాషింగ్టన్ సుందర్.. ఆతరువాత ఇంగ్లండ్‌తో జరిగిన సిరస్లోనూ ఆకట్టుకున్నాడు. సుందర్ ప్రస్తుతం ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరోవైపు గత ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన పడిక్కల్.. ఈ ఏడాది జరిగిన దేశవాళీ పరిమిత ఓవర్ల టోర్నీల్లో పరుగుల వరద పారించాడు. ప్యూమా ఎంచుకున్న ఈ ఇద్దరు క్రికెటర్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లే కావడం విశేషం. చదవండి: సీఎస్కే అసలుసిసలైన ఆల్‌రౌండర్ అతనే.. -
కిట్ స్పాన్సర్ బరిలో పూమా
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్షిప్ రేసులో జర్మనీకి చెందిన ప్రముఖ సంస్థ పూమా నిలిచింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. బిడ్‌లో పాల్గొనేందుకు అవసరమైన ఇన్విటేషన్ టు టెండర్ (ఐటీటీ) పత్రాన్ని పూమా సంస్థ ప్రతినిధులు కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. పూమాతో పాటు జర్మనీకే చెందిన మరో సంస్థ అడిడాస్ కూడా టీమిండియా కిట్ స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకొనేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. భారత జట్టు కిట్ స్పాన్సర్‌గా 14 ఏళ్ల పాటు కొనసాగుతూ వస్తోన్న నైకీ కాంట్రాక్టు వచ్చే నెలతో ముగియనుంది. కరోనా నేపథ్యంలో బిడ్డింగ్ కనీస ధరను బీసీసీఐ భారీగా తగ్గించింది. గతంలో మ్యాచ్‌కు రూ. 88 లక్షలుగా ఉండగా... ప్రస్తుతం అది రూ. 61 లక్షలకు తగ్గింది. -
సరస్వతీ దేవి నిన్ను వదిలిపెట్టదు..
అమెరికన్ పాప్ సింగర్ సెలెనా గోమెజ్ తాను చేసిన పొరపాటుకు విమర్శలపాలైంది. సెలెనా తాజాగా ప్రఖ్యాత స్పోర్ట్స్ కంపెనీ ‘పూమా’ వాణిజ్య ప్రకటనలో కనిపించింది. ఇందులో పూమా కంపెనీకి చెందిన స్పోర్ట్స్ దుస్తులు ధరించి మంచి ఔట్ఫిట్తో కనిపించింది. చుట్టూరా పుస్తకాలున్న లైబ్రరీలో ఫొటోలు దిగిన సెరెనా పనిలో పనిగా పుస్తకాల దొంతరలపైనా నిలబడి ఫొటోలకు ఫోజిచ్చింది. ఈ చర్యే నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. జ్ఞానాన్ని అందించే పుస్తకాలపై నిలబడటాన్ని పలువురు తీవ్రంగా దుయ్యబట్టారు. ‘భారతీయ సంస్కృతిలో పుస్తకాలకు ప్రత్యేక గౌరవం ఉంది. వాటిని కళ్లకద్దుకుని పూజిస్తారే తప్పితే కాలికిందేసి అవమానించరు’.. ‘తనకు వేరే ప్రదేశమే దొరకలేదా? ఎందుకు ఆ పుస్తకాలపై నిల్చుంది’.. ‘నువ్వు చేసిన తప్పుకు సరస్వతీ దేవీ నిన్ను వదిలిపెట్టదు.. తప్పుకుండా శిక్షించి తీరుతుంది’ అంటూ నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పుస్తకాలు జ్ఞాన సంపదలని, వాటిని అగౌరవపర్చవద్దని మరో నెటిజన్ వేడుకున్నాడు. ప్రస్తుతం సెలెనా పూమా యాడ్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. -
క్రికెట్ పిచ్‌పై..గోల్డ్ షూ
సాక్షి, సిటీబ్యూరో: రానున్న వరల్డ్‌కప్ క్రికెట్ ఫీవర్‌ను పురస్కరించుకుని ప్రముఖ షూ తయారీ బ్రాండ్ ప్యూమా వన్8 క్రికెట్ షూస్ పేరిట సరికొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను రూపొందించింది. ఈ విషయాన్ని సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. బంగారపు రంగులో ప్రత్యేకంగా క్రికెట్ అభిమానుల కోసం తయారైన ఈ గోల్డెన్ షూ మొత్తం 150 జతలు మాత్రమే అందుబాటులోకి తెచ్చామని, భారత క్రికెట్ కెప్టెన్ వీటిని ధరించి మైదానంలో కనువిందు చేయనున్నట్లు తెలిపారు. -
ఆఫీసులో ఆ సీన్ చూసి అవాక్కు!
సావ్‌పాలో: పొద్దున్నే ఆఫీసుకు వచ్చి తాళం తీసిన సిబ్బంది.. డెస్క్వైపు చూసి అవాక్కయ్యారు. కంప్యూటర్ మీద పనిచేసి అలిసిపోయానన్నంత రేంజ్లో డెస్క్ కింద జారబడిన చిరుతపులి(ప్యూమా).. సిబ్బందిని పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఉద్యోగులు.. ఫైర్ డిపార్ట్మెంట్కు ఫోన్‌చేశారు. వలలు, మత్తుఇంజక్షన్, తుపాకి.. తదితర సామాగ్రితో వచ్చిన ఫైర్ ఫైటర్లు.. గంటలపాటు శ్రమించి, చిరుతను ప్రాణాలతో పట్టుకున్నారు. అనంతరం దానిని వణ్యప్రాణి సంరక్షణా కేంద్రానికి తరలించారు. బ్రెజిల్‌లోని అతిపెద్ద నగరం సావ్పా శివారు పట్టణం ఇటాపెసిరికా డా సెర్రాలో సోమవారం చోటుచేసుకుంది. చిరుతను బంధించినప్పటి దృశ్యాలను ఫైర్ డిపార్ట్మెంట్వారి ఫేస్బుక్ పేజీలో పోస్ట్చేయగా వైరల్ అయ్యాయి. -
ఆఫీసులో ఆ సీన్ చూసి అవాక్కు!
-
సచిన్, ధోనీలను మించిన కోహ్లి..
-
సచిన్, ధోనీలను మించిన కోహ్లి..
ముంబై: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటతోనే కాకుండా ప్రచారకర్తగా కూడా దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ప్రముఖ స్పోర్ట్స్ లైఫ్ స్టైల్ బ్రాండ్ పూమాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. దేశంలో ఒకే బ్రాండ్‌తో వంద కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న తొలి క్రీడాకారుడిగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డులకెక్కాడు. ఎనిమిది సంవత్సరాలకు రూ.110 కోట్లతో ప్రచారకర్తగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో కోహ్లి ప్రసిద్ధ క్రీడాకారులు జమైకా పరుగుల వీరులు ఉసెన్‌బోల్ట్, అసఫా పోవెల్, ఫుట్‌బాల్ ఆటగాళ్లు థీయరీ హెన్రీ, ఆలివర్ గిరౌడ్‌ల సరసన చేరాడు. ఒప్పందం ప్రకారం కోహ్లికి పూమా సంవత్సరానికి రూ.12 నుంచి రూ.14 కోట్లు ఇవ్వనుంది. పూమాతో చాలకాలం ఒప్పందం కుదుర్చుకున్నానని, పూమా భారత్‌లో అతి తక్కువ కాలంలో పాపులారిటీ పొందడం తనను ఆకట్టుకుందని, గొప్ప చరిత్ర కలిగిన ఆటగాళ్లు పూమాకు ప్రచారకర్తలుగా ఉండటం సంతోషంగా ఉందని కోహ్లి తెలిపాడు. సచిన్, ధోని, వివిధ స్పోర్ట్స్, ఏజెన్సీల ఒప్పందాలతో రూ.100 కోట్ల క్లబ్లో చేరారు. సచిన్ 24 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 50కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరించాడు. సచిన్ 1995లో వరల్డ్‌టెల్‌తో అత్యధికంగా రూ.30 కోట్లకుపైగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2001లో ఇదే ఒప్పందాన్ని డబుల్ రేటుతో పునరుద్ధరించుకున్నాడు. సాచి, సాచిస్ కంపెనీలకు ప్రచారకర్తగా 2006లో సచిన్ మూడు సంవత్సరాలకు రూ.175 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. సచిన్ తర్వాత అంత స్థాయిలో ప్రచారాల ద్వారా లబ్ధి పొందిన క్రికెటర్ ధోనినే. ప్రచారకర్తగా సుమారు రూ.180 కోట్లు ఆర్జించాడు. ధోని దెబ్బతో 2013లో 20 కంపెనీలకు ప్రచారకర్తగా ఉన్న నటుడు షారుక్‌ఖాన్ అతని ఒప్పందం విరమించుకోవాల్సి వచ్చింది. కోహ్లి 2013లో అడిడాస్‌తో ఏడాదికి రూ.10 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం గత ఏడాది డిసెంబర్ వరకూ కొనసాగింది. తర్వాత ఈ ఒప్పందం పునరుద్దరించకపోవడంతో పూమాతో తాజాగా ఒప్పందం కుదుర్చుకున్నాడు.