ఆఫీసులో ఆ సీన్ చూసి అవాక్కు!
సావ్‌పాలో: పొద్దున్నే ఆఫీసుకు వచ్చి తాళం తీసిన సిబ్బంది.. డెస్క్‌వైపు చూసి అవాక్కయ్యారు. కంప్యూటర్ మీద పనిచేసి అలిసిపోయానన్నంత రేంజ్‌లో డెస్క్ కింద జారబడిన చిరుతపులి(ప్యూమా).. సిబ్బందిని పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఉద్యోగులు.. ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు ఫోన్‌చేశారు.
వలలు, మత్తుఇంజక్షన్, తుపాకి.. తదితర సామాగ్రితో వచ్చిన ఫైర్ ఫైటర్లు.. గంటలపాటు శ్రమించి, చిరుతను ప్రాణాలతో పట్టుకున్నారు. అనంతరం దానిని వణ్యప్రాణి సంరక్షణా కేంద్రానికి తరలించారు. బ్రెజిల్‌లోని అతిపెద్ద నగరం సావ్‌పా శివారు పట్టణం ఇటాపెసిరికా డా సెర్రాలో సోమవారం చోటుచేసుకుంది. చిరుతను బంధించినప్పటి దృశ్యాలను ఫైర్ డిపార్ట్‌మెంట్‌వారి ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్‌చేయగా వైరల్ అయ్యాయి.