సాక్షి, సిటీబ్యూరో: రానున్న వరల్డ్‌కప్ క్రికెట్ ఫీవర్‌ను పురస్కరించుకుని ప్రముఖ షూ తయారీ బ్రాండ్ ప్యూమా వన్8 క్రికెట్ షూస్ పేరిట సరికొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను రూపొందించింది. ఈ విషయాన్ని సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. బంగారపు రంగులో ప్రత్యేకంగా క్రికెట్ అభిమానుల కోసం తయారైన ఈ గోల్డెన్ షూ మొత్తం 150 జతలు మాత్రమే అందుబాటులోకి తెచ్చామని, భారత క్రికెట్ కెప్టెన్ వీటిని ధరించి మైదానంలో కనువిందు చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment