ఈ లోకంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారన్న సామెత చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. తాజాగా టీమిండియా రన్‌మెషిన్ కింగ్ కోహ్లికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. విరాట్ కోహ్లి పుమాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అచ్చం కోహ్లిని పోలిన ఒక వ్యక్తి తనలా షార్ట్, టీషర్ట్ వేసుకొని పుమా ప్రొడక్ట్స్ అమ్మాడు. అంతేకాదు అక్కడికి వచ్చిన వాళ్లతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ కనిపించాడు.
ఇది గమనించిన కోహ్లి పుమాను హెచ్చరించాడు. ''హే పుమా ఇండియా. అచ్చం నన్ను పోలిన ఒక వ్యక్తి ముంబైలోని లింక్‌రోడ్డు దగ్గర పుమా ప్రొడక్ట్స్ అమ్ముతున్నాడు. దయచేసి ఈ విషయంపై కాస్త దృష్టి పెట్టండి'' అంటూ కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టి పుమా కంపెనీకి ట్యాగ్ చేశాడు.
బ్లాక్ ఫ్రైడే కార్యక్రమంలో భాగంగానే పుమా కంపెనీ స్వయంగా ఇదంతా ప్లాన్ చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయం కోహ్లికి తెలియక తన ఇన్‌స్టాలో మెసేజ్ చేశాడు. ఇంతకముందు కూడా పుమా తమ కంపెనీ ప్రచారకర్తలుగా ఉన్న కరీనా కపూర్, సునీల్ ఛెత్రీ, యువరాజ్ సింగ్‌లను పోలిన వ్యక్తులతో ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్‌లో ఇలాంటి కార్యక్రమాలనే నిర్వహించింది. ఇక పుమా అనేది జర్మనీకి చెందిన కంపెనీ.
Comments
Please login to add a commentAdd a comment