Link Road
-
వీడెవడో అచ్చం నాలాగే ఉన్నాడే? : విరాట్ కోహ్లి
ఈ లోకంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారన్న సామెత చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. తాజాగా టీమిండియా రన్‌మెషిన్ కింగ్ కోహ్లికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. విరాట్ కోహ్లి పుమాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అచ్చం కోహ్లిని పోలిన ఒక వ్యక్తి తనలా షార్ట్, టీషర్ట్ వేసుకొని పుమా ప్రొడక్ట్స్ అమ్మాడు. అంతేకాదు అక్కడికి వచ్చిన వాళ్లతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ కనిపించాడు. ఇది గమనించిన కోహ్లి పుమాను హెచ్చరించాడు. ''హే పుమా ఇండియా. అచ్చం నన్ను పోలిన ఒక వ్యక్తి ముంబైలోని లింక్‌రోడ్డు దగ్గర పుమా ప్రొడక్ట్స్ అమ్ముతున్నాడు. దయచేసి ఈ విషయంపై కాస్త దృష్టి పెట్టండి'' అంటూ కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టి పుమా కంపెనీకి ట్యాగ్ చేశాడు. బ్లాక్ ఫ్రైడే కార్యక్రమంలో భాగంగానే పుమా కంపెనీ స్వయంగా ఇదంతా ప్లాన్ చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయం కోహ్లికి తెలియక తన ఇన్‌స్టాలో మెసేజ్ చేశాడు. ఇంతకముందు కూడా పుమా తమ కంపెనీ ప్రచారకర్తలుగా ఉన్న కరీనా కపూర్, సునీల్ ఛెత్రీ, యువరాజ్ సింగ్‌లను పోలిన వ్యక్తులతో ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్‌లో ఇలాంటి కార్యక్రమాలనే నిర్వహించింది. ఇక పుమా అనేది జర్మనీకి చెందిన కంపెనీ. -
ప్రత్యామ్నాయమే శరణ్యం
♦ తిరుమలకు లింకు రోడ్డు నుంచి నాలుగులేన్ల విస్తరణ ♦ యోచిస్తున్న టీటీడీ యాజమాన్యం సాక్షి,తిరుమల : ఎడతెరిపిలేని వర్షాల కారణంగా కొండ చరియలు కూలిపడి తిరుమల రె ండో ఘాట్‌రోడ్డు ధ్వంసమైన నేపథ్యంలో టీడీడీ ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తోంది. 13వ కిలోమీటరు నుంచి లింక్‌రోడ్డును నాలుగులేన్లుగా విస్తరించి రాకపోకలను వేరు చే యడమే సరైన ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తోంది. అలిపిరి నుంచి తిరుమలకు 16 కిలోమీటర్ల మేర రెండో ఘాట్‌రోడ్డును 1973లో నిర్మించారు. ఈ మార్గంలో రెండేళ్లుగా ఏడో కిలోమీటరు నుంచి 16వ కిలోమీటరు వరకు కొండ చరియలు కూలిపడుతున్నాయి. అలిపిరి నుంచి 12వ కిలోమీటరు వద్ద హరిణి వరకు, అక్కడి నుంచి 13వ కిలోమీటరు లింక్‌రోడ్డు వరకు, అక్కడి నుంచి 16వ కిలోమీటరు తిరుమల వరకు.. ఇలా ఈ రోడ్డును మొత్తంగా మూడు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. లింకురోడ్డు నుంచి తిరుమలకు వెళ్లే మూడు కిలోమీటర్ల ప్రాంతం దెబ్బతింది. లింక్‌రోడ్డు విస్తరణతో సమస్యకు పరిష్కారం.. గత అనుభవాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా రెండో ఘాట్‌రోడ్డులోని 13వ కిలోమీటరు నుంచి మొదటి ఘాట్‌రోడ్డుకు అనుసంధానంగా మూడు వందల మీటర్ల లింకురోడ్డు నిర్మించారు. ప్రస్తుతం ఈ మార్గం నుంచే వాహనాలను తిరుమలకు మళ్లించారు. ఇక్కడి నుంచి జీఎన్సీ వరకు మూడు కిలోమీటర్ల దూరంలో వాహనాలను అరగంటపాటు ఇటుఅటుగా ఆపేసి పంపుతున్నారు. భవిష్యత్‌లో ఇదే మార్గాన్ని వినియోగించుకోవాలంటే మూడు కిలోమీటర్ల దూరాన్ని నాలుగులేన్లుగా విస్తరించి రాకపోకలు వేరు చేయవచ్చు. నిపుణులు ఓకే అంటే.. : ఈవో సాంబశివరావు లింక్ రోడ్డు నుంచి తిరుమల జీఎన్సీ వరకు ఉండే మార్గాన్ని నాలుగు లేన్లగా విస్తరించాలని నిపుణులు సూచిస్తే తప్పనిసరిగా నిర్మిస్తాం. నిపుణుల బృందం సందర్శన కొండ చరియలు కూలుతున్న తిరుమల రెండో ఘాట్‌రోడ్డును గురువారం ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. టీటీడీ జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు నేతృత్వంలో న్యూ ఢిల్లీకి చెందిన కేఎస్ రావు, చెన్నయ్‌కు చెందిన నరసింహారావు, ఎల్అండ్టీ అధికారుల బృందం ఆ ప్రాంతాలను పరిశీలించింది. దాన్ని బాగు చేసేందుకు సుమారు 15 రోజులపైబడి పడుతుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. అడ్డుగోడతోపాటు ఆధునిక పద్ధతుల్లో గ్రౌటింగ్ చేయాలని సూచించారు. కూలిన ప్రాంతాల్లో ఎక్కడికక్కడ అడ్డుగోడలు నిర్మించాలని, కూలేందుకు సిద్ధంగా ఉన్న ప్రాంతాల్లోనూ రాళ్లను పరిశీలించాలని చెప్పారు. భవిష్యత్‌లో భాష్యకార్ల సన్నిధి రోడ్డు బాగా దెబ్బతినే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని లింక్‌రోడ్డును పూర్తి స్థాయిలో విస్తరించాలని సూచించారు. వర్షం పూర్తిగా నిలిచిన తర్వాత మరమ్మతులు చేపట్టాలని సూచించారు.ఘాట్‌రోడ్డులో శాశ్వత స్థాయి మరమ్మతులను ఎల్అండ్టీ ద్వారా చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. -
జవాబుదారీతనంగా జెడ్పీ
సాక్షి, గుంటూరు : జిల్లా పరిషత్ పాలనను గాడిలో పెట్టేందుకు ప్రత్యేక కసరత్తు జరుగుతోంది. తొలుత కార్యాలయంలో ఫైళ్ల నిర్వహణపై దృష్టి సారించిన జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో) బి. సుబ్బారావు సెక్షన్ ఆఫీసర్లతో సమావేశమయ్యారు. ఫైళ్ల నిర్వహణ సక్రమంగా లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఫైలూ జవాబుదారీతనంగా ఉండాలని తేడా వస్తే ఉపేక్షించేది లేదని ఆదేశిస్తూ ఈ సందర్భంగా కొంత మంది సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఫైళ్ల నిర్వహణపై పలు సూచనలు చేశారు. మార్చి 31వ తేదీ లోపు పనులు అన్నీ పూర్తి చేసి బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. జిల్లాలో మట్టి, గ్రావెల్, లింక్ రోడ్లకు సంబంధించి రూ. నాలుగు కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. తాగునీటికి సంబంధించి కోటి రూపాయల పనులు సాగుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతం వెల్దుర్తి, దుర్గి, దాచేపల్లి మండలాల్లో ఇప్పటికే తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. బాపట్ల, తెనాలి, అమరావతి ప్రాంతాల్లో మంచి నీటి పథకాలకు ఫిల్టర్ బెడ్లు మార్చాల్చి ఉంది. ఈ పనులు సకాలంలో పూర్తి అయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని సిబ్బందిని సీఈవో ఆదేశించారు. ఇంజనీరింగ్ విభాగం పై సమీక్ష.. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఇంజనీరింగ్ విభాగంపై సీఈవో దృష్టి సారించారు. ఇప్పటికే ఓ సారి జిల్లాలో ఉన్న అన్ని రకాల ఇంజనీరింగ్ విభాగాల సిబ్బందితో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఐదేళ్లుగా జిల్లాలో ఏ పనులు చేశారు. ఏ ఏ పద్దుల కింద వచ్చిన నిధులు ఎన్ని, వాటిని ఏ ఏ పనులకు వినియోగించారు. ఓ పద్ధతి ప్రకారం రికార్డులు తయారు చేసుకుకొని మళ్లీ సోమవారం జరిగే సమావేశానికి తీసుకురావాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఇదిలావుంటే, జెడ్పీలో నిధుల వినియోగం ఓ పద్ధతి ప్రకారం జరగకపోవడంతో సిబ్బందిలో గుబులు మొదలైంది. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలని తలలు పట్టుకుంటున్నారు. నిధుల వినియోగంలో తేడా వస్తే చర్యలు తప్పవని సీఈవో చేసిన హెచ్చరికలు ఏ పరిణామానికి దారితీస్తాయోనని సిబ్బంది ఆందోళనచెందుతున్నారు. జిల్లాకు 19 మండల రిసోర్స్ సెంటర్లు మంజూరయ్యాయని సీఈవో తెలిపారు. ఒక్కో కేంద్రం నిర్వహణకు రూ. 10 లక్షలు కేటాయించామని, త్వరితగతిన వీటికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని కూడా ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశిం చారు. అలాగే జిల్లాలో ఉన్న ఎనిమిది అతిథి గృహాల మరమ్మతులు, భవనాల నిర్వహణ కోసం మరో రూ. 25 లక్షలు కేటాయించామన్నారు. ప్రత్యేక కసరత్తు ... జిల్లా పరిషత్ కార్యాలయంలో ఫైళ్ల నిర్వహణపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నాం. తొలుత ఇంజనీరింగ్ విభాగంపై దృష్టి సారించాం. ఐదేళ్ల కాలంలో జరిగిన పనుల వివరాలు తెలియజేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఇప్పటికే ఆదేశించాం. బడ్జెట్ రూప కల్పనపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నాం. త్వరలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. - బి. సుబ్బారావు, జెడ్పీ సీఈవో -
బేగంపేట-బల్కంపేట లింక్ రోడ్ ప్రారంభం
హైదరాబాద్ : బేగంపేట-బల్కంపేట లింక్ రోడ్డు ఎట్టకేలకు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఈ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఆయన ఐడీహెచ్ కాలనీలో మోడల్ హౌసింగ్ కాలనీకి శంకుస్థాపన చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చాక జీహెచ్ఎంసీకి సంబంధించి సీఎం తొలిసారి పాల్గొన్న అధికార కార్యక్రమాలు ఇవి. ఇక బేగంపేట-బల్కంపేట లింకు రోడ్డు వల్ల కూకట్పల్లి, బాలానగర్, ఫతేనగర్, బల్కపేటల నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి రెండు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. బల్కంపేట, బృందావన్ కాలనీ, ఫతేనగర్ మధ్య లింక్ ఏర్పడుతుంది. బ్రాహ్మణవాడి, బేగంపేట, నేచర్ క్యూర్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఇందిరాగాంధీపురం, రేణుకానగర్ ప్రజలకు ఎంతో సౌలభ్యం కలుగుతుంది. సికింద్రాబాద్, మారేడ్‌పల్లి ప్రాంతాల నుంచి రాజీవ్ సర్కిల్, గ్రీన్‌ల్యాండ్ ఫ్లై ఓవర్ల వైపు వెళ్లేవారికి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గనున్నాయి. అమీర్‌పేట నుంచి సనత్‌నగర్, కూకట్పల్లి వెళ్లే వారికి కూడా ఇబ్బందులు తగ్గుతాయి. ఈ రోడ్డును 1.41 కి.మీ. పొడవు, 18 మీ.(నాలుగు లేన్లు) వెడల్పుతో రూ.45 కోట్లుతో నిర్మించారు. కాగా ఈ లింక్ రోడ్డు ప్రజలకు అందుబాటులోకి రావటానికి సుమారు ఏడేళ్ల సమయం పట్టింది. -
గోరేగావ్-ములుండ్ మధ్య లింకురోడ్డు
సాక్షి, ముంబై: నగరానికి తూర్పు, పశ్చిమాన ఉన్న గోరేగావ్-ములుండ్ ఉప నగరాలను అనుసంధానించేందుకు లింకు రోడ్డు నిర్మించాలని ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయించింది. ఈ భారీ ప్రాజెక్టును వచ్చే మూడు లేదా నాలుగు సంవత్సరాల్లో పూర్తిచేయాలని సంకల్పించింది. గోరేగావ్-ములుండ్ మధ్య దాదాపు 17 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందులో సాకీవిహార్-భాండుప్ మధ్య ఎనిమిది కిలోమీటర్ల రహదారిని ఎలివేటెడ్ మార్గంగా నిర్మించాలని బీఎంసీ ప్రతిపాదించింది. ఇది కొంత ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ వ్యయాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీఎంసీ ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ రహదారి నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్న వివిధ ప్రాంతాల్లో ఆరే కాలనీ సమస్య కూడా పరిష్కరమయింది. ఈ స్థలం బీఎంసీకి చెందినది కావడంతో వెంటనే అడ్డంకులు తొలగిపోయాయి. మిగతా చోట్ల ఎదురవుతున్న అడ్డంకులను తొలగించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. అందుకు సంబంధించిన మ్యాపులు, డిజైన్లు రూపొందిస్తున్నారు. రెండు, మూడు నెలల్లో టెండర్లను ఆహ్వానించి వెంటనే ఈ రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని బీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.వి.ఆర్.శ్రీనివాసన్ చెప్పారు. పనులు ప్రారంభమైన మూడు లేదా నాలుగు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. నగరం, శివారు ప్రాంతాల్లో రోజురోజుకు జటిలమవుతున్న ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెమ్మార్డీయే, ఎమ్మెస్సార్డీసీ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. అందులో భాగంగా వర్లీ-బాంద్రా సీ లింకు, వంతెనలు, శివార్లలో బైపాస్‌లు, మెట్రో, మోనోరైలు వంటి సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నారు. అదేవిధంగా వర్లీ-శివ్డీ ఎలివేటెడెట్ రోడ్డు, శివ్డీ-నవశేవా సీలింకు ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. గోరేగావ్-ములుండ్ మార్గంలో ఎన్ని నిర్మాణాలు చేపట్టినా ట్రాఫిక్ జామ్ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. అందుకే దీని నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నామని బీఎంసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇది కొన్ని కీలకమైన ప్రాంతాలను కలుపుతుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు.......... ఈ ప్రాజెక్టు రహదారి మొత్తం 17 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో ఎలివేటెడ్ రహదారి ఎనిమిది కిలోమీటర్ల ఉంటుంది. దీనిపై నాలుగు లేన్లు ఉంటాయి. ఉపరితల రహదారిపై ఆరు లేన్లు ఉంటాయి. {పారంభంలో కేవలం నాలుగు లేన్లను వినియోగించేందుకు అనుమతినిస్తారు. ఈ రహదారి మార్గమధ్యలో ఆరే కాలనీలో పర్యాటక ఆకర్షణలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు చెట్లకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.