Anushka Sharma Teases Virat Kohli In Puma Exclusive Event Jam With Fam - Sakshi
Sakshi News home page

Kohli-Anushka: 'బయట 'కింగ్‌' కావొచ్చు.. భార్య ముందు మాత్రం పిల్లే'

Published Sat, May 27 2023 7:09 PM | Last Updated on Sat, May 27 2023 7:57 PM

Anushka Sharma Teases Virat Kohli In Puma Exclusive Event Jam With Fam - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ లీగ్‌ దశకే పరిమితమైంది. అయితే సీజన్‌లో కొన్ని మంచి విజయాలు అందుకున్నప్పటికి ప్లేఆఫ్‌ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేసింది. దీంతో టైటిల్‌ సాధించాలన్న కోరిక అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. ఇక కోహ్లి మళ్లీ టీమిండియా తరపున వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో లండన్‌కు వెళ్లిన కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటిఫుల్‌ డే అంటూ స్టోరీ షేర్‌ చేశాడు.

ఇక కోహ్లికి బయట ఎంత పెద్ద ఫాలోయింగ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి కోహ్లిని భార్య అనుష్క శర్మ అందరిముందు టీజ్‌ చేయడం ఆసక్తి కలిగించింది. కోహ్లి లండన్‌కు వెళ్లడానికి ముందు భార్య అనుష్కతో కలిసి పుమా కంపెనీ ఈవెంట్ లో పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన వీడియో బిట్స్ బిట్స్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిగతా వాటి సంగతేమో గానీ ఒక్కటి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ వీడియోలో భాగంగా యాంకర్ గా ఉన్న వ్యక్తి, కోహ్లీ సెలబ్రేషన్స్ ని ఇమిటేట్ చేసి చూపించమని అనుష్కని అడిగారు. దీంతో అవతల జట్టు వికెట్ పడ్డప్పుడు కోహ్లీ ఎలా బిహేవ్ చేస్తాడనేది అనుష్క ఉన్నది ఉన్నట్లుగా చేసి చూపించింది. కోహ్లీ చూసి నవ్వుకున్నాడు. చెప్పాలంటే ఈ ఈవెంట్ లో అందరిముందే విరాట్ కోహ్లీని అనుష్క ర్యాగింగ్ చేసిందనే చెప్పాలి.

ఇది చూడటానికి చాలా ఫన్నీగా ఉంటూనే మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తోంది. ఆ తర్వాత కోహ్లి అనుష్క నటించిన బాండ్‌ బజా బరాత్‌ సినిమాలోని రణ్‌వీర్‌సింగ్‌ డైలాగులు చెప్పి అందరిని నవ్వించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు కోహ్లి బయట కింగ్‌ కావొచ్చు.. కానీ భార్య అనుష్క ముందు మాత్రం పిల్లే అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: సచిన్‌తో గిల్‌ ముచ్చట.. పండగ చేసుకున్న గాసిప్‌ రాయుళ్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement