అడికి...అజిత్‌ బ్రో లాజిక్కే! ఆనంద్‌ మహీంద్ర హిల్లేరియస్‌ ట్వీట్‌ వైరల్‌ | Shoe Brand Adidas Brother Ajitdas Anand Mahindra hilarious post going viral | Sakshi
Sakshi News home page

అడికి...అజిత్‌ బ్రో లాజిక్కే! ఆనంద్‌ మహీంద్ర హిల్లేరియస్‌ ట్వీట్‌ వైరల్‌

Published Tue, Nov 22 2022 2:34 PM | Last Updated on Tue, Nov 22 2022 3:02 PM

Shoe Brand Adidas Brother Ajitdas Anand Mahindra hilarious post going viral - Sakshi

సాక్షి, ముంబై: ఏదైనా ఒక బ్రాండ్‌ పాపులర్‌ కాగానే దానికి  సంబంధించి నకిలీలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తాయి. అసలేదో నకిలీ ఏదో గమనించలేనంత పకడ్బందీగా లోగో, బ్రాండ్‌పేరుతో సహా నకిలీ ఉత్పత్తులు మార్కెట్లో హల్‌ చల్‌ చేస్తుంటాయి.  ఈ విషయంపైనే పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర తనదైన శైలిలో స్పందించారు. స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్ బ్రాండింగ్‌ను పోలి ఉన్న ప్రొడక్ట్‌ను ట్వీట్‌ చేశారు. హిలేరియస్‌ కామెంట్‌ జత చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. (Google Layoffs ఉద్యోగులకు షాకింగ్‌ న్యూస్‌: 10 వేలమంది ఇంటికే!)

లోగో, ట్రేడ్‌మార్క్‌తో అడిడాస్  షూస్‌ ను పోలిఉన్న  పోస్ట్‌ను మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ట్విటర్‌లో షేర్‌ చేశారు. నిశితంగా పరిశీలిస్తే తప్ప నకిలీ షూపై అడిడాస్‌కు  బదులుగా "అజిత్‌దాస్" అని ఉండటాన్ని మనం గమనించవచ్చు. దీంతో ఇది లాజిక్కే... అడికి అజిత్ అనే సోదరుడు ఉన్నాడని అర్థం. వసుధైక కుటుంబం అంటూ చేసిన ఆనంద్‌ మహీంద్ర ట్విట్‌ వైరల్‌గా మారింది. (Twitter Hirings ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మస్క్‌: ఇండియన్‌ టెకీలకు గుడ్‌ న్యూస్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement