Anand Mahindra's Favourite Pic From 2021 With Powerful Message, Tweet Viral - Sakshi
Sakshi News home page

Anand Mahindra: 2021లో ఇష్టమైన ఫోటోను షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా..!

Published Sat, Jan 1 2022 9:08 PM | Last Updated on Tue, Jan 4 2022 8:47 AM

Anand Mahindra Favourite Pic From 2021 Has A Powerful Message See Viral Post - Sakshi

సోషల్‌ మీడియాలో తరచూ సమకాలిన అంశాలపై స్పందించే  బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్‌ మహీంద్రా కొత్త ఏడాది విషెస్‌ను  తనదైన స్టైల్‌లో చెప్పారు. దాంతో పాటుగా తనకు  2021లో  నచ్చిన ఫోటోను ట్విటర్‌లో పంచుకున్నారు.

విత్‌ పవర్‌ఫుల్‌ మెసేజ్‌..!
ఓ తండ్రి తన కుమారుడిని తోపుడు బండిపై తీసుకెళ్తున్న ఫోటోను ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేశారు. ఈ ఫోటోలో తోపుడు బండిపై సదరు వ్యక్తి  కుమారుడు పుస్తకంలో రాస్తూ కన్పించాడు. ఈ ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ... ‘ఈ ఏడాది నాకు నచ్చిన ఫొటో ఇది. క్షమించండి... దీన్ని ఎవరు తీశారో నాకు తెలీదు. ఇది నా ఇన్‌బాక్స్‌లో కనిపించింది. ఆశ, కృషి, ఆశావాదానికి ఈ చిత్రం నిలువెత్తు నిదర్శనం. మనం ఎందుకు జీవిస్తున్నామో ఈ ఒక్క దృశ్యం చూస్తే సరిపోతుంది' అంటూ షేర్‌ చేశారు. ఈ ఫోటో మనకు పవర్‌ఫుల్‌ మెసేజ్‌ను మనందరికీ ఇస్తోందని తెలిపారు.  ఈ పోస్ట్‌ సుమారు 90 వేల లైక్స్‌ను సంపాదించి వైరల్‌గా మారింది. 
 


చదవండి: రెక్కలు కట్టుకుని ఎగిరిపోదాం.. ఆనంద్ మహీంద్రా వెరైటీ విషెస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement