ఉద్యోగులు ఇంటికెళ్లాక.. మస్క్‌ గురించి ఆసక్తికర విషయం! | Elon Musk Never Aimed To Be CEO X User post | Sakshi
Sakshi News home page

ఉద్యోగులు ఇంటికెళ్లాక.. మస్క్‌ గురించి ఆసక్తికర విషయం!

Published Sat, Jun 1 2024 4:21 PM | Last Updated on Sat, Jun 1 2024 5:04 PM

Elon Musk Never Aimed To Be CEO X User post

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు, టెస్లా, స్పేస్ ఎక్స్‌ల బిగ్ బాస్ ఎలాన్ మస్క్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆటోమొబైల్‌, అంతరిక్షం, అంతర్జాలం (ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా) రంగాల్లో విజయవంతమైన కంపెనీలను ఆయన నడుపుతున్నారు.

అయితే ఎలాన్‌ మస్క్‌ గురించి తాజాగా ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో ఓ యూజర్ మస్క్ శ్రద్ధగా పనిచేస్తున్న త్రోబ్యాక్ ఫోటోను పంచుకున్నాడు. "జిప్‌2 (మస్క్‌ స్థాపించిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ)లో పనిచేసే ఇంజనీర్లు ఇళ్లకు వెళ్లగానే వారు రాసిన కోడ్‌ను తిరిగి రాసేవాడు. అలా వారానికి 120 గంటలు పనిచేసేవాడు. ఒక సీఈఓలా ఉండాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు" అని రాసుకొచ్చారు.  

నిజమే..
ఎక్స్‌ యూజర్‌ తన గురించి పెట్టిన పోస్టుపై ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. 'నిజమే' అంటూ ఆ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ పోస్ట్‌కు 2.3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. విపరీతంగా కామెంట్లు, రీ పోస్టులు, లైక్‌లతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement