ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీల్లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.
‘ఎక్స్’ అమలు చేస్తున్న లేఆఫ్‌ల ప్రభావం ప్రధానంగా దాని ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులపై పడిందని సంస్థ వర్గాలు, వర్క్‌ప్లేస్ ఫోరమ్ బ్లైండ్‌లోని పోస్ట్‌లను ఉటంకిస్తూ ‘ది వెర్జ్’ నివేదిక పేర్కొంది. తొలగింపునకు గురైన ఉద్యోగుల సంఖ్య ఖచ్చితంగా తెలియరాలేదు. కంపెనీ కోసం మీరు చేసేందేంటో ఒక పేజీ సారాంశాన్ని సమర్పించాలని ఉద్యోగులను కోరిన రెండు నెలల తర్వాత లేఆఫ్‌లు వచ్చాయి.
దీనిపై మస్క్ కానీ, ‘ఎక్స్’ అధికారులు గానీ ఇంకా వ్యాఖ్యానించలేదు. స్టాక్ గ్రాంట్‌ల గురించి ఎంతగానో ఎదురుచూస్తున్న సిబ్బందికి ఇటీవల ఎలాన్ మస్క్ ఈమెయిల్ పంపినట్లు వార్తా నివేదికలు వచ్చాయి. ఉద్యోగుల పనితీరు, ప్రభావం ఆధారంగా వారికి స్టాక్ ఆప్షన్స్ కేటాయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే స్టాక్‌ను పొందడానికి కంపెనీకి తాము చేశామో తెలియజేస్తూ నాయకత్వానికి ఒక పేజీ సారాంశాన్ని సమర్పించాలని సిబ్బందిని ఆదేశించిట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పరిస్థితేంటి? కలవరపెడుతున్న గూగుల్ సీఈవో ప్రకటన!
ఎలాన్ మస్క్ యాజమాన్యంలో ఎంకెన్ని లేఆఫ్‌లు ఉంటాయోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 2022లో ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్ దాదాపు 80 శాతం అంటే 6,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించారు. డైవర్సిటీ, ఇన్‌క్లూషన్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, డిజైన్ వంటి అన్ని విభాగాల్లోనూ లేఆఫ్‌లు అమలు చేశారు. కంటెంట్ మోడరేషన్ టీమ్‌ను కూడా విడిచిపెట్టలేదు.
Comments
Please login to add a commentAdd a comment