![Ayodhya Ram Temple Sanctum Sanctorum Photo Released - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/9/Ayodhya-Ram-Mandir.jpg.webp?itok=c-K3OnR8)
ఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఆలయ గర్భగుడి ఫోటోలను రామ్ మందిర్ ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ ట్విట్టర్(ఎక్స్)లో ఫొటోలు పోస్ట్ చేశారు.
రామాలయ ప్రారంభోత్సవ వేడుక జనవరి 22న అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామ మందిర నిర్మాణం శరవేగంగా నిర్మాణం జరిగింది. దీంతో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది.
प्रभु श्री रामलला का गर्भ गृह स्थान लगभग तैयार है। हाल ही में लाइटिंग-फिटिंग का कार्य भी पूर्ण कर लिया गया है। आपके साथ कुछ छायाचित्र साझा कर रहा हूँ। pic.twitter.com/yX56Z2uCyx
— Champat Rai (@ChampatRaiVHP) December 9, 2023
వేద మంత్రాల నడుమ కన్నుల పండువగా జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి దేశంలోని 8వేల మంది ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నారు.
ఇదీ చదవండి: అయోధ్య రామాలయం రెడీ
Comments
Please login to add a commentAdd a comment