fake product
-
నకిలీల కట్టడిపై అమెజాన్ నజర్..
న్యూఢిల్లీ: కృత్రిమ మేథను ఉపయోగించుకుని నకిలీ ఉత్పత్తులను కట్టడి చేయడంపై ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరింతగా దృష్టి పెడుతోంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల పైగా ఇలాంటి ఉత్పత్తులను గుర్తించింది. కస్టమర్ల ప్రయోజనాలకు భంగం కలిగేలా, మరో విధంగా ఇంకెవరూ విక్రయించకుండా, వాటిని స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేసింది. నకిలీలు, మోసాల నుంచి కస్టమర్లు, బ్రాండ్లు, విక్రేతలకు రక్షణ కల్పించేందుకు బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేసినట్లు, వేల కొద్దీ సంఖ్యలో ఇన్వెస్టిగేటర్లు, మెషిన్ లెర్నింగ్ సైంటిస్టులు, సాఫ్ట్వేర్ డెవలపర్లలాంటి ఉద్యోగులను నియమించుకున్నట్లు బ్రాండ్ ప్రొటెక్షన్ రిపోర్ట్ 2024లో అమెజాన్ వెల్లడించింది. బ్రాండ్లు గుర్తించి, రిపోర్ట్ చేయడానికి ముందే తమ నియంత్రణ వ్యవస్థలు 99 శాతం సందేహాస్పద లిస్టింగ్స్‌ను బ్లాక్ చేసినట్లు వివరించింది. అమెజాన్ పారదర్శకత ప్రోగ్రాం ద్వారా 250 కోట్ల ఉత్పత్తుల యూనిట్లను సిసలైనవిగా ధృవీకరించినట్లు పేర్కొంది. ఫార్చూన్ 500 కంపెనీలు, గ్లోబల్ బ్రాండ్స్, అంకుర సంస్థలు, చిన్న వ్యాపార సంస్థలు సహా ప్రపంచవ్యాప్తంగా 88,000 బ్రాండ్ల ఉత్పత్తులు తమ దగ్గర లిస్టయినట్లు వివరించింది. భారత్ తమకు కీలక మార్కెట్ అని, కస్టమర్లు .. విక్రేతల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని అమెజాన్ డైరెక్టర్ కెబారు స్మిత్ తెలిపారు. 170 పైగా నగరాల్లో ఫ్రెష్.. దేశీయంగా నిత్యావసరాల సేవల సెగ్మెంట్ ఫ్రెష్‌ను విజయవాడ, చిత్తూరు తదితర 170 పైగా నగరాలు, పట్టణాలకు విస్తరించినట్లు అమెజాన్ తెలిపింది. 11,000 మంది పైచిలుకు రైతుల నుంచి తాజా పండ్లు, కూరగాయలను కొనుగోలు చేస్తున్నట్లు వివరించింది. 2023 ద్వితీయార్థంతో పోలిస్తే 2024 ద్వితీయర్ధంలో 50 శాతం వ్యాపార వృద్ధి నమోదు చేసినట్లు అమెజాన్ ఫ్రెష్ ఇండియా డైరెక్టర్ శ్రీకాంత్ శ్రీరామ్ తెలిపారు. -
అడికి...అజిత్ బ్రో లాజిక్కే! ఆనంద్ మహీంద్ర హిల్లేరియస్ ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: ఏదైనా ఒక బ్రాండ్ పాపులర్ కాగానే దానికి సంబంధించి నకిలీలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తాయి. అసలేదో నకిలీ ఏదో గమనించలేనంత పకడ్బందీగా లోగో, బ్రాండ్పేరుతో సహా నకిలీ ఉత్పత్తులు మార్కెట్లో హల్ చల్ చేస్తుంటాయి. ఈ విషయంపైనే పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర తనదైన శైలిలో స్పందించారు. స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్ బ్రాండింగ్‌ను పోలి ఉన్న ప్రొడక్ట్‌ను ట్వీట్ చేశారు. హిలేరియస్ కామెంట్ జత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. (Google Layoffs ఉద్యోగులకు షాకింగ్ న్యూస్: 10 వేలమంది ఇంటికే!) లోగో, ట్రేడ్‌మార్క్‌తో అడిడాస్ షూస్ ను పోలిఉన్న పోస్ట్‌ను మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ట్విటర్లో షేర్ చేశారు. నిశితంగా పరిశీలిస్తే తప్ప నకిలీ షూపై అడిడాస్‌కు బదులుగా "అజిత్‌దాస్" అని ఉండటాన్ని మనం గమనించవచ్చు. దీంతో ఇది లాజిక్కే... అడికి అజిత్ అనే సోదరుడు ఉన్నాడని అర్థం. వసుధైక కుటుంబం అంటూ చేసిన ఆనంద్ మహీంద్ర ట్విట్ వైరల్‌గా మారింది. (Twitter Hirings ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మస్క్: ఇండియన్ టెకీలకు గుడ్ న్యూస్) Completely logical. It just means that Adi has a brother called Ajit. Vasudhaiva Kutumbakam? 😊 pic.twitter.com/7W5RMzO2fB — anand mahindra (@anandmahindra) November 22, 2022 Here are more pic.twitter.com/DdBfTluKnt — Sir Kazam (@SirKazamJeevi) November 22, 2022 pic.twitter.com/2K9NvbFUqH — $€€£ (@deep_befriend) November 22, 2022 -
నకిలీ సెగ : బుక్కైన స్నాప్‌డీల్ ఫౌండర్స్
కోటా : ఆన్లైన్ షాపింగ్ సైట్ స్నాప్‌డీల్ చిక్కుల్లో పడింది. నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తోందన్నఆరోపణల నేపథ్యంలో కంపెనీ ఫౌండర్స్ అడ్డంగా బుక్కయ్యారు. రాజస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త ఇందర్‌మోహన్ సింగ్ హనీ ఫిర్యాదు మేరకు స్నాప్‌డీల్ సీఈవో కునాల్ బాల్, సీవోవో రోహిత్ బన్సల్ చీటింగ్ కేసు నమోదైంది. వ్యాపారవేత్త ఇంద్రమోహన్ సింగ్ హనీ జూలై 17న ఉడ్ ల్యాండ్ బెల్ట్, వాలెట్ లను స్నాప్‌డీల్‌లో ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేశాడు. ఈ బ్రాండెడ్ వస్తువులకు బదులుగా, నకిలీ వస్తువులు చేరడంతో, వాటిని ఉడ్‌ల్యాండ్ షోరూంకి వెళ్లి ఎంక్వయిరీ చేశాడు. అవి నకిలీవని ఉడ్‌ల్యాండ్ సిబ్బంది కూడా ధృవీకరించారు. దీంతో స్థానిక గుమన్‌పురా స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని ఆయన ఆరోపిస్తున్నారు. చేతి గడియారాన్ని ఆర్డర్ చేశా...డెలివరీ చేశామని కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది కానీ వాచ్ ఇంటికి చేరలేదని తెలిపారు. అయితే కంపెనీకి ఫిర్యాదు చేయడంతో తన డబ్బులను రిఫండ్ చేసిందంటూ గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఇంద్రమోహన్ ఫిర్యాదు ఆదారంగా సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారి మనోజ్ సింగ్ సికార్వాల్ తెలిపారు. చదవండి : స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం -
నకిలీ పొటాష్ కలవరం..!
త్రిపురాంతకం/ ఒంగోలు సబర్బన్: జిల్లాలో నకిలీ పొటాష్ వ్యవహారం కలవరం సృష్టిస్తోంది. వందల టన్నుల నకిలీ పొటాష్ నిల్వలు బయటపడుతుండటం రైతులను ఊపిరి పీల్చుకోనీయకుండా చేస్తున్నాయి. ఈ నకిలీ పొటాష్ అక్రమ నిల్వలు అటు జిల్లాలోని వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారుల పనితీరుకు దర్పంగా నిలిచింది. నకిలీ పొటాష్ కర్ణాటక రాష్ట్రం మైసూరు, బళ్ళారి ప్రాంతాల నుంచి విచ్చలవిడిగా జిల్లాకు వచ్చినట్లు అధికారులు పరిశీలనలో తేలింది. పొటాష్ ఎరువు క్వింటా ధర రూ.950 ఉండటంతో రైతులు తక్కువ ధరకు వచ్చే నకిలీ పొటాష్ కొనుగోలు చేసి నిలువునా మోసపోయారు. కొనసాగుతున్న దాడులు ఎరువుల దుకాణాల గోడౌన్లపై ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా దాడులను నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఏఎస్పీ రజనీ, వ్యవసాయశాఖ జేడీఏ శ్రీరామమూర్తి తెలిపారు. ప్రకాశం, గుంటూరు, రాయలసీమ జిల్లాల్లో ఈ నకిలీ పొటాష్ అమ్మకాలు భారీగా జరిగినట్లు గుర్తించారు. ఈ నకిలీ పొటాష్ కుంభకోణంలో రైతులు భారీగా నష్టపోయారు. తనిఖీల్లో నకిలీ పొటాష్‌ను విక్రయించిన త్రిపురాంతకంలోని సుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్, రాఘవేంద్ర ట్రేడర్స్ హోల్‌సేల్ డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. ఆరు షాపులపై కేసులు నమోదు చేసి ఎరువుల అమ్మకాలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 799 నకిలీ పొటాష్ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఐపీఎల్ కంపెనీ వారితో పాటు రసాయన పరీక్షల ద్వారా నిర్ధారించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మార్కాపురం, దోర్నాల, చీరాల తదితర ప్రాంతాల్లో ఇప్పటికే దాడులు నిర్వహించామని తెలిపారు. గుంటూరు జిల్లాలో అమ్మకాలు జరుగుతున్న పొటాష్‌ను ముందుగా గుర్తించడంతో అక్కడ డీలర్లు త్రిపురాంతకం నుంచి సరఫరా అయినట్లు నిర్ధారించారని, దీంతో ఈ ప్రాంతంలో దాడులు చేసినట్లు పేర్కొన్నారు. ప్రకాశం, గుంటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురంలో ఈ అమ్మకాలు జరగడంతో విజిలెన్స్ డీజీ ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయని వివరించారు. ఈ పొటాష్ కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ ప్రాంతం నుంచి సరఫరా అవుతున్నట్లు విచారణలో తెలిసిందని, వ్యవసాయ శాఖ కమిషనర్ ద్వారా ఆ రాష్ట్ర కమిషనర్‌తో చర్చించినట్లు అధికారులు తెలిపారు.నకిలీ పొటాష్ సరఫరా చేసిన వారి వివరాలు విచారణలో తేలుతాయన్నారు. దాడుల్లో విజిలెన్స్ సీఐలు బీటీ నాయక్, భూషణంలు, జాని, ఉమాపతి, ఏడీఏ సుదర్శనరాజు ,ఏఓ బాలాజీనాయక్, జవహర్ ఉన్నారు. పెద్దల ప్రమేయంపై విమర్శలు నకిలీ పొటాష్ ఎరువుల వ్యవహారంలో వ్యవసాయ శాఖ అధికారులపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎరువులు, పురుగుమందుల దుకాణాలను తరచూ తనిఖీ చేయాల్సిన అధికారులు నకిలీ ఎరువులు ఉన్నాయన్న సమాచారం వ్యవసాయ అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ప్రచారమూ సాగుతోంది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో నకిలీ పొటాష్ వ్యవహారం బయట పడటంతో త్రిపురాంతకం వ్యవసాయ అధికారితో పాటు పలువురు అధికారులపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. అక్రమ నిల్వలు ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో కాకుండా బయట గోడౌన్లు తీసుకొని అక్రమంగా నిల్వలు చేపట్టారు. కనీసం మండల వ్యవసాయాధికారులకు ఏఏ గ్రామంలో అక్రమ గోడౌన్లు ఉన్నాయి, రైతులు ఎక్కడెక్కడ ఎరువులు తీసుకెళుతున్నారన్న పూర్తి సమాచారం వ్యవసాయ అధికారులకు తెలుసు. కానీ మామూళ్లకు తలొగ్గి తెలిసీ, తెలియనట్లు వ్యవహరించటం వల్లనే వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. కాగా దాడులు జరుగుతున్న సమయంలో అధికార పార్టీకి చెందిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి అధికారులకు ఫోన్ కాల్స్ వచ్చినట్లు విమర్శలు ఉన్నాయి. తాళాలు పగులుగొట్టి గోడౌన్లు తెరిచి .. త్రిపురాంతకంలో ఐదు గోడౌన్లు, సోమేపల్లిలో మూడు చోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన పొటాష్ 799 బస్తాలను గుర్తించినట్లు తెలిపారు. నకిలీ పొటాష్ నిల్వలపై అధికారులు దాడులు కొనసాగిస్తుండటంతో వ్యాపారులు అందుబాటులో లేరు. వ్యాపారుల కోసం ప్రయత్నం చేసిన అధికారులు గోడౌన్లను రెవెన్యూ శాఖ ద్వారా తాళాలు పగులగొట్టి తనిఖీ చేశారు. నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయించిన వ్యాపారులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నకిలీ పొటాష్‌తో మటాష్ నకిలీ పొటాష్ రైతులను నిలువునా ముంచింది. అధిక ధరలు చెల్లించి నకిలీ పొటాష్‌ను కొనుగోలు చేసి మోసపోయామని రైతులు వాపోతున్నారు. సాగర్ నీటి వసతి ఉన్న ప్రాంతంలో అన్ని జిల్లాల్లోనూ ఈ పొటాష్ అమ్మకాలు జరిగినట్లు నిర్ధారించారు. దీన్ని బట్టి ఈ స్కాం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తవ్విన కొద్ది నకిలీ పొటాష్ విక్రయాల్లో కొత్త కోణాలు బయటపడటం అధికారులనే విస్మయానికి గురిచేస్తుంది. గుంటూరు, ప్రకాశంతో పాటు చుట్టు ఉన్న రాయలసీమ జిల్లాల్లోను ఈ అమ్మకాలు జోరుగా సాగాయి. చిత్తూరు జిల్లాల్లో ఈ పొటాష్ వాడిన చేపల చెరువులో చేపలు చనిపోయినట్లు అధికారులకు సమాచారం. ఇక వరి పంటలో అధిక దిగుబడుల కోసం దీనిని వినియోగిస్తుంటారు. ఈ దిగుబడులు పూర్తిగా తగ్గిపోవడానికి ఈ నకిలీ పొటాషే కారణమని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ పొటాష్‌ను రైతులకు భారీగా విక్రయించినట్లు తెలుస్తోంది. -
పత్తి రైతుల ఆందోళన
నేరేడుగొండ(ఆదిలాబాద్): కల్తీ పత్తి విత్తనాలు ఇచ్చి తమను మోసం చేశారని పత్తి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన రైతులు ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన పత్తి విత్తనాలు కొనుగోలు చేశారు. అవి సరిగా మొలకెత్తలేదు. ఒకవేళ మొలకెత్తినా పూత, కాయ దశకి వచ్చేసరికి చెట్లు ఎండిపోయాయి. దీంతో ఆగ్రహించిన సుమారు 300 మంది రైతులు విత్తనాల ప్యాకెట్లతో గురువారం నాడు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.