కల్తీ పత్తి విత్తనాలు ఇచ్చి తమను మోసం చేశారని పత్తి రైతులు ఆందోళన చేస్తున్నారు.
నేరేడుగొండ(ఆదిలాబాద్): కల్తీ పత్తి విత్తనాలు ఇచ్చి తమను మోసం చేశారని పత్తి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన రైతులు ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన పత్తి విత్తనాలు కొనుగోలు చేశారు. అవి సరిగా మొలకెత్తలేదు. ఒకవేళ మొలకెత్తినా పూత, కాయ దశకి వచ్చేసరికి చెట్లు ఎండిపోయాయి. దీంతో ఆగ్రహించిన సుమారు 300 మంది రైతులు విత్తనాల ప్యాకెట్‌లతో గురువారం నాడు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.