సాధారణంగా ఒక కంపెనీ సీఈఓను కలవాలన్నా.. లేదా మాట్లాడాలన్నా పర్మిషన్ / అపాయింట్‌మెంట్ వంటి ప్రాసెస్ ఉంటాయి. కానీ ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ కంపెనీ అడిడాస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'బిజార్న్ గుల్డెన్' (Bjorn Gulden) ఇటీవల కంపెనీలో పనిచేసే 60000 మంది ఉద్యోగులకు తన మొబైల్ నెంబర్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు.
2023 జనవరిలో అడిడాస్ కంపెనీ సీఈఓగా గుల్డెన్ బాధ్యతలు స్వీకరించిన సమయంలో సంస్థ కొన్ని ఆర్థిక నష్టాల్లో ఉండేది. అంతే కాకుండా అడిడాస్.. అమెరికన్ రాపర్ కాన్యే వెస్ట్‌తో సంబంధాలను తెంచుకుంది. అలాంటి ఒడిదుడుకులను దాటుకుంటూ కంపెనీ లాభాల్లో పయనించేలా చేసిన ఈయన పనిలో పారదర్శకతను పెంచడానికి తన మొబైల్ నెంబర్ ఇచ్చినట్లు వెల్లడించారు.
గుల్డెన్ తన మొబైల్ నెంబర్ ఇచినప్పటి నుంచి 200 కాల్స్ వచ్చాయని.. వ్యాపారంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆ కాల్స్ ద్వారా వెల్లడించినట్లు తెలిపారు.
1990 తరువాత గుల్డెన్ అడిడాస్ వదిలి ప్యూమా కంపెనీలో చేరాడు. ఆ తరువాత 2023 జనవరిలో అడిడాస్‌కు తిరిగి వచ్చాడు. గుల్డెన్ తిరిగి కంపెనీయికి రావడంతో సంస్థ షేర్లు దాదాపు రెండింతలు పెరిగినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా కంపెనీ ప్రత్యర్థి నైక్ కంటే మెరుగైన పనితీరు కనబరిచింది.
ఇదీ చదవండి: టెక్ దిగ్గజాల్లో అలజడి.. నాలుగు కంపెనీలలో 50000 మంది
స్వతహాగా ఫుట్‌బాల్ ఆటగాడైన గుల్డెన్.. కంపెనీలో అనేక మార్పులు చేశారు. సంస్థ ఉత్పత్తులను క్రికెట్ రంగానికి మరింత దగ్గర చేశారు. 2023లో భారత క్రికెట్ జట్టుతో బ్రాండ్ స్పాన్సర్‌షిప్ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, సంస్థ మూడు నెలల్లో భారతదేశంలో 6,00,00 జెర్సీలను విక్రయించింది. రాబోయే రోజుల్లో అడిడాస్ మరింత వృద్ధి సాదిస్తుందని పలువురు ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment