
న్యూఢిల్లీ: భారత స్టార్ అథ్లెట్ హిమ దాస్‌కు ప్రముఖ క్రీడా పరికరాల సంస్థ అడిడాస్ స్పాన్సర్‌షిప్ చేస్తుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈ అస్సాం స్ప్రింటర్‌తో ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా 18 ఏళ్ల హిమకు అడిడాస్ కిట్ స్పాన్సర్ చేస్తుంది. ఫిన్ లాండ్‌లో జరిగిన ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచిన భారత అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆసియా క్రీడల్లో స్వర్ణంతో పాటు రెండు రజతాలు గెలిచింది.
అందుకే అడిడాస్ కంపెనీ ఆమె కోసమే ప్రత్యేకంగా ప్రీమియం షూస్‌ను తయారు చేసి ఇచ్చింది. ఒక బూటుపై ప్రముఖంగా ‘హిమ దాస్’ అని... ఇంకోదానిపై ‘క్రియేట్ హిస్టరీ’ అని ముద్రించింది. ఈ సందర్భంగా ‘అడిడాస్ కుటుంబంలో చేరడం గర్వంగా ఉంది. అంతర్జాతీయ అథ్లెట్ల గ్రూపులో ఇప్పుడు నేను భాగమైనందుకు ఆనందపడుతున్నా. క్రీడా ప్రపంచంలో ఎంతో మందికి ఈ సంస్థ అండగానిలుస్తోంది. అడిడాస్ స్పాన్సర్‌షిప్‌తో నేను రెట్టించిన ఉత్సాహంతో రాణిస్తా. నా ప్రదర్శనను మెరుగుపర్చుకుంటా’ అని హిమ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment