సలామ్‌ బాస్‌: రిషభ్‌ | Rishabh Pant congratulates Hima Das after 5 gold medals in 19 days | Sakshi
Sakshi News home page

సలామ్‌ బాస్‌: రిషభ్‌

Published Mon, Jul 22 2019 10:31 AM | Last Updated on Mon, Jul 22 2019 10:33 AM

Rishabh Pant congratulates Hima Das after 5 gold medals in 19 days - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత మహిళా అథ్లెట్‌ హిమ దాస్‌ మూడు వారాల వ్యవధిలో ఐదో స్వర్ణాన్ని గెలిచి  శభాష్‌ అనిపించారు. చెక్‌ రిపబ్లిక్‌లో శనివారం జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ మీట్‌లో హిమ దాస్‌ 400 మీటర్ల రేసులో తొలి స్థానంలో నిలిచి పసిడిని సొంతం చేసుకున్నారు. 200 మీటర్ల రేసులో నాలుగు స్వర్ణాలు సాధించిన హిమదాస్‌.. 400 మీటర్ల రేసులోనూ తనకు తిరుగులేదని నిరూపించారు. భారత కీర్తిని మరింత పెంచిన హిమ దాస్‌ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో స్పందిస్తూ.. ‘ నీవే ఒక స్ఫూర్తి.  ద గోల్డెన్‌ గర్ల్‌ ఆఫ్‌ ఇండియా.. సలామ్‌ బాస్‌’ అంటూ కొనియాడాడు.

‘ గత 19 రోజుల కాలంలో యూరోపియన్‌ సర్క్యూట్‌లో నీ ప్రదర్శన చూసి గర్విస్తున్నాం. గెలవాలనే నీలో కసి యువతకు ఒక స్ఫూర్తి. ఐదు పతకాలు గెలిచినందుకు అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆశిస్తున్నా’ అని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: నచ్చారండి.. హిమదాస్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement