
గువాహటి: స్ప్రింట్ సంచలనం హిమదాస్‌కు ప్రభుత్వ చమురు కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఉద్యోగం ఇచ్చింది. అంతర్జాతీయ పోటీల్లో హిమ నిలకడగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే జరిగిన ఆసియా క్రీడల్లో రిలేలో స్వర్ణం సహా మూడు పతకాలు గెలుచుకుంది.
ఆమె సాధించిన ఘన విజయాలకు ప్రోత్సాహంగా తమ సంస్థ మానవ వనరుల (హెచ్‌ఆర్) విభాగంలో గ్రేడ్ ‘ఎ’ ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చినట్లు ఐఓసీ చీఫ్ జనరల్ మేనేజర్ ఉత్తియ భట్టాచార్య తెలిపారు. హిమదాస్‌కు ఉన్నతస్థాయి వేతన భత్యాలతో పాటు ఆమె పాల్గొనే ఈవెంట్ల కోసం ప్రయాణ, బస ఏర్పాట్లకయ్యే ఖర్చును తమ సంస్థే భరిస్తుందని ఆయన చెప్పారు. హిమ ఘనతను గుర్తించిన కేంద్రప్రభుత్వం ఇటీవల అర్జున అవార్డు కూడా బహూకరించింది.